అన్వేషించండి

India Army vs China Army: మరోసారి రెచ్చిపోయిన డ్రాగన్‌ - అసలు భారత్, చైనాల ఆర్మీ బలబలాలు ఎలా ఉన్నాయి?

భారత్‌, చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. తవాంగ్‌ సెక్టార్‌లోని చొరబాటు బిడ్‌ సందర్భంగా ఈ ఘర్షన జరిగిన్నట్లు తెలుస్తోంది. ఇందులో భారతీయ సైనికులే ఎక్కువగా ఉన్నారు.

జిత్తులమారి డ్రాగన్‌ కంట్రీ చైనా మరోసారి కయ్యానికి కాలు దువ్వుతోంది. శాంతి చర్చలంటూనే తన కన్నింగ్‌ మెంటాలిటీని బయటపెడుతోంది. తలకుమాసిన ఎత్తుగడతో భారత్‌ మీదకు దూకేందుకు కపట నాటకాలాడుతోంది. అయితే ఇప్పటికే చాలాసార్లు ఇండియన్‌ ఆర్మీ.. చైనా తోక కట్‌ చేసినప్పటికీ.. కుక్కతోక వంకర అన్నట్లు వ్యవహరిస్తోంది చైనా.  ఎల్‌ఏసీ సరిహద్దుల్లో నిత్యం.. భారత్‌ సహనాన్ని పరీక్షిస్తున్న డర్టీ డ్రాగన్‌ మళ్లి ఇప్పుడు కుప్పిగెంతులు వేస్తోంది. ఆసియా దేశాల్లో.. ఎంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారత్‌తో.. కయ్యానికి కాలుదువ్వుతోంది. ఇప్పటికే.. సరిహద్దుల చుట్టూ ఉన్న దేశాలను భారత్‌పైకి ఎగదోసింది.

తెరవెనుక ఎన్నో కుట్రలు చేస్తూ దొంగదెబ్బ తీసేందుకు రెడీ అవుతోంది. తాజాగా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తహాంగ్‌ సెక్టర్‌ వద్ద భారత్‌, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. తవాంగ్‌ సెక్టార్‌లోని చొరబాటు బిడ్‌ సందర్భంగా ఈ ఘర్షన జరిగిన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో గాయపడిన చైనా సైనికుల సంఖ్య భారతీయ సైనికుల కంటే ఎక్కువగా ఉంది. ఇదిలా ఉంటే.. చైనా ఓవర్‌ యాక్షన్‌కు చెక్‌ పెట్టాలంటే ఇప్పుడు భారత్‌ ఏం చేయాలి..? అసలు భారత్‌ చైనాల దేశాల బలబలాలు ఏంటి.?

భారత్‌ చైనా దేశాల బలబలాలు ఏంటి.?
మొన్నటి వరకు ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించాలన్న అహింసా వాద సిద్ధాంతాన్ని భారత్‌ పాటించింది. కానీ.. ఎవరైనా అకారణంగా రెచ్చగొడితే మాత్రం.. రెండు చెంపలు వాయించాలన్న హింసావాదాన్ని పాటిస్తోంది భారత్‌. మరీముఖ్యంగా కన్నింగ్‌ పాకిస్తాన్‌కు, డర్టీ చైనా వంటి దేశాల విషయాల్లో ఈ రూల్‌ను పక్కాగా ఫాలో అవుతుంది ఇండియన్‌ ఆర్మీ. ఎవరైనా సరిహద్దుల్లో.. హద్దు మీరితే మాత్రం.. మన సైన్యం బెబ్బులిలా గర్జిస్తుంది. చైనా కవ్వింపు చర్యల కారణంగా ఇప్పటికే భారత్‌ బలగాలకు అధునాతన ఆయుధాలను అందచేసింది రక్షణశాఖ. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్.. రక్షణ రంగంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వస్తోంది. రక్షణ రంగ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయడంపై ఫోకస్ పెట్టిన ఇండియా.. మొన్నటికి ప్రచండ పేరిట లైట్ కంబాట్ హెలికాఫ్టర్లను తయారు చేసింది. ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో మోహరించాలనే ప్రాథమిక ఉద్దేశంతో.. ప్రభుత్వ రంగానికి చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ‘ప్రచండ’ హెలికాప్టర్లను డిజైన్ చేసింది. అంతేకాదు.. వీటిని ఇప్పటికే లడఖ్‌లో పరీక్షించారు. చైనా డ్రోన్లతో పాటు ఎయిర్ టు ఎయిర్ మిస్సైళ్లను ఈ హెలికాప్టర్లు కూల్చగలవు. వీటి నుంచి నేల మీద ఉన్న ట్యాంకర్లను సైతం ధ్వంసం చేయొచ్చు. ఇటు చైనా ఆర్మీ విషయానికి వస్తే.. చైనా తన సాయుధ బలగాలను శరవేగంగా పెంచుకుంటుందనే చెప్పాలి. తాజాగా కొత్త ఎయిర్‌ ఫోర్స్‌ విమానాలు, వాహక నౌకను కొనుగోలు చేసింది. 2035 నాటికి చైనా సాయుధ బలగాలను ఆధునీకరించాలని అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆదేశించారు. వారు 2049 నాటికి "యుద్ధాలు చేసి గెలిచే" సామర్థ్యం గల "ప్రపంచ స్థాయి" సైనిక శక్తిగా మారాలని ఆయన అన్నారు. చైనా తాజాగా మూడు మూడు విమానాలు, 11 విమాన జెట్లతో పాటు అణుశక్తితో నడిచే జలాంతర్గాములు, క్రూయిజర్లు, డిస్ట్రాయర్లు పలు యుద్ధనౌకలను రెడీ చేసుకుంది చైనా. అయితే చైనా తన నౌకాదళాన్ని మరింత విస్తరించాలని భావిస్తోంది. 2020 నుంచి 2040 మధ్య చైనా నౌకాదళ నౌకల మొత్తం సంఖ్య దాదాపు 40% పెరుగుతుందని అంచనా వేయవచ్చు. ఇక ఎయిర్‌ స్ట్రైక్‌కు సంబంధించిన జెట్స్‌కు కూడా చాలానే ఉన్నాయని చెప్పాలి. అయితే చైనా ఎక్కువగా అగ్రదేశాల నుంచి కొనుగోలు చేసిన వెపన్స్‌ కన్న సొంతంగా తయారు చేసుకున్న వెపన్స్‌ ఎక్కువే అని చెప్పాలి. ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల మిలటరీకి అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంటే.. చైనా రెండు, భారత్‌ మూడో దేశంలో ఉన్నాయి. చైనా దేశంలో భారత్‌ కన్న ఎక్కువ అణు నిల్వలు ఉన్నాయి. వీటి సంఖ్య మరింత పెంచేందుకు 2030 ఏడాది టార్గెట్‌గా ఉంచుకుని ముందుకు కదులుతోంది. ఒకవేళ భారత్‌ చైనా యుద్ధం అంటూ జరిగే మాత్రం.. చైనాకు ఎక్కడా తగ్గకుండా ధీటుగా భారత్‌ జవాబు ఇవ్వగలదనే చెప్పాలి. 

ఇండియన్‌ ఆర్మీతో ఉన్న అత్యాధునిక వెపన్స్‌:
అమెరికన్‌ సిగ్‌సార్‌ 716 అసాల్ట్‌ రైఫిళ్లతో పాటు స్విస్‌ ఎంపీ -9 పిస్టల్స్‌ను సైనికులకు అందజేసింది కేంద్ర రక్షణ శాఖ. దూరం నుంచే శత్రువులు పనిపట్టడానికి ఈ ఆయుధాలు ఉపయోగపడుతాయి. ఏకే 47 , ఏకే 56 కంటే పవర్‌ఫుల్‌ ఆయుధాలు ఇప్పడు భారత జవాన్ల దగ్గర ఉన్నాయి. మరీముఖ్యంగా అర్జున్‌ MBT యుద్ధ ట్యాంక్‌, T-90భీష్మ, ఆకాశ్‌, బ్రహ్మోస్‌, పృథ్వీ, అగ్ని, ప్రహర్‌, త్రిషల్‌, నాగ్‌ అనే క్షిపణులు ఉన్నాయి. ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించగలిగే ఆకాశ్ మిస్సైల్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. ఇది తాను ఉన్న చోటినుంచి 30 కిమీ దూరంలో ఉన్నవాటిని నిరోధించగలదు. ఇది భారత్-రష్యాలు సమ్యుక్తంగా నిర్మించిన క్షిపణి. భారతీయ నది అయిన బ్రహ్మపుత్ర, రష్యా నది అయిన మొస్క్వా ల పేర్లను కలిపి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. 290 కిలోమీటర్ల దూరం ఉన్న పక్క దేశాల స్థావారాలను సైతం ఈజీ ధ్వంసం చేయగలదు. ప్రధాన యుద్ధ ట్యాంకులు 5వేలకు పైగానే ఉండగా.. ఫిరంగులు 12వేల 800లుగా ఉన్నాయి. బాలిస్టిక్ మిస్సైళ్ళు  వంద ఉండగా.. ఎయిర్ మిస్సైళ్ళు 90వేలకు పైగానే ఉండగా.. యుద్ధ విమానాలు,వాహకాలు వెయ్యి 130 ఉన్నాయి. 

భారత్‌ సైనికుల సంఖ్య:
భారత్‌లో ప్రస్తుతం విధులు నిర్వరిస్తున్న సైనం సుమారు 25లక్షలకు పైగానే ఉంటారని అంచనా. రిజర్వ్‌ సైన్యం 12 లక్షల వరకు ఉండవచ్చు. మేజర్ జనరల్ ఆధ్వర్యం వహించే ప్రతి డివిజన్‌లో 15,000 మంది యుద్ధవిద్యల్లో ఆరితేరినవారు ఉంటారు. 8వేల వారికి సహాయకులు ఉంటారు. ప్రస్తుతం ఆర్మీలో 34 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్‌లో కొన్ని బ్రిగేడ్‌లు ఉంటాయి. ప్రతి బ్రిగేడ్‌లో 4వేల నుంచి 5వేల మంది సైనికులు ఉంటారు. బ్రిగేడ్ అధికారిని బ్రిగేడియర్ అని పిలుస్తారు. ప్రతి బ్రిగేడ్‌లో కొన్ని బెటాలియన్‌లు ఉంటాయి. కల్నల్ ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించే ప్రతి బెటాలియన్‌లో 900 కంటే ఎక్కువమంది సైనికులు పనిచేస్తుంటారు. అంతేకాదు ఏయిర్‌ స్టైక్‌ చేసే ఎయిర్‌ మిస్సైల్స్‌ చాలానే ఉన్నాయి.

అమెరికా నుంచి సిగ్‌సాగర్‌ రైఫిళ్లను ప్రత్యేకంగా తెప్పించింది రక్షణశాఖ. చైనా కంటే అధునాతన ఆయుధాలు ఇప్పుడు భారత్‌ దగ్గర ఉన్నాయి. లద్దాఖ్‌లో ఏమాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడినా డ్రాగన్‌కు గట్టి జవాబు ఇచ్చేందుకు భారత్‌ బలగాలు రెడీగా ఉన్నాయి.  తూర్పు లద్దాఖ్‌ లోని గాల్వాన్‌లో భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణ తరువాత అమెరికా నుంచి అత్యవసరంగా సిగ్‌సార్‌ రైఫిళ్లను రక్షణశాఖ దిగుమతి చేసుకుంది. లక్షన్నర సిగ్‌సార్‌ రైఫిళ్లను సైన్యం కోసం తెప్పించారు. చాలా సులభంగా ఈ ఆయుధాలను ఉపయోగించుకోవచ్చు. 
India Army vs China Army: మరోసారి రెచ్చిపోయిన డ్రాగన్‌ - అసలు భారత్, చైనాల ఆర్మీ బలబలాలు ఎలా ఉన్నాయి?

చైనాకంటే భారత్‌ వద్ద శక్తివంతమైన రాకెట్లు:
చైనా పెద్దఎత్తున యుద్ధ విమానాలు, సైన్యాన్ని మోహరించగా.. మన దేశం కూడా అదే తరహాలో రాకెట్‌ వ్యవస్థలను సరిహద్దులకు ఇప్పటికే తరలించింది. యుద్ధం జరిగితే శత్రువులకు తగిన రీతిలో బుద్ధిచెప్పేందుకు అన్ని వ్యవస్థలను సిద్ధంచేస్తూ నిత్యం మాక్‌డ్రిల్ నిర్వహిస్తోంది. భారత్‌- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో సైన్యం అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తోంది. శత్రుదేశంలో కీలక ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లే సామర్థ్యంతో పినాక, స్మెర్చ్‌ రాకెట్‌ వ్యవస్థలను రూపొందించింది. అత్యంత శక్తిమంతమైన ఈ రెండు రాకెట్‌ వ్యవస్థలను అసోం ఈస్ట్రన్‌ సెక్టార్‌లో పలుచోట్ల ఏర్పాటు చేసింది. ఈ రెండు రాకెట్లను ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేస్తే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించే అవకాశం ఉంటుందని సైనికాధికారులు చెప్తున్నారు.

పినాక రాకెట్‌ వ్యవస్థ కేవలం 44 సెకెన్లలో 75 రాకెట్లను పేల్చగలదు, 100 మీటర్ల పొడవు, 800 మీటర్ల వెడల్పు కలిగిన ప్రాంతాన్ని స్మాష్ చేయగలదు. 75 కిలో మీటర్ల లక్ష్యాన్ని ఛేదించేలా అభివృద్ధి చేసిన పినాక రాకెట్‌ వ్యవస్థ త్వరలో సైన్యంలో చేరనుంది. మరో రాకెట్‌ వ్యవస్థ స్మెర్చ్‌ 90 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంది. 40 సెకెన్లలో 44 రాకెట్లను పేల్చగల సామర్థ్యంతో స్మెర్చ్‌ రాకెట్‌ వ్యవస్థను రూపొందించారు. అంతేకాదు.. భారత రక్షణ శాఖకు చెందిన భూమి మీద నుంచి ప్రయోగించగల శక్తివంతమైన క్షిపణులు కూడా భారత అమ్ముల పొద్దల్లో ఉన్నాయి. పృథ్వి క్షిపణులు.. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అనే చెప్పాలి. కేంద్రీకృత గైడెడ్ క్షిపణుల కార్యక్రమంలో భాగంగా డీఆర్‌డీవో దీన్ని అభివృద్ధి చేసింది. ఈ కార్యక్రమం క్రింద అభివృద్ధి చేసిన మొట్టమొదటి క్షిపణి ఇదే.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌  సేన
గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌ సేన
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Best Thriller movies on OTT: ఓరి నాయనో.. రక్తపు మడుగులో పసివాడు, భార్యను కిడ్నాప్ చేసే భర్త - ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్ మూవీ ఇది
ఓరి నాయనో.. రక్తపు మడుగులో పసివాడు, భార్యను కిడ్నాప్ చేసే భర్త - ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్ మూవీ ఇది
Samsung New Smart TV: కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Raja Singh Ram Navami Shobha Yatra| శ్రీరామనవమి శోభయాత్రలో ఫుల్ జోష్ లో రాజాసింగ్ | ABP DesamBJP Madhavi Latha vs Akbaruddin Owaisi | శ్రీరామ నవమి శోభయాత్రలో పాల్గొన్న మాధవి లత | ABP DesamTruck Hit Motorcycle In Hyderabad  | బైకును ఢీ కొట్టిన లారీ.. పిచ్చి పట్టినట్లు ఈడ్చుకెళ్లాడు | ABPPerada Tilak vs Ram Mohan Naidu | రామ్మోహన్ నాయుడు ఓడిపోతారు ఇదే కారణమంటున్న పేరాడ తిలక్ |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌  సేన
గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌ సేన
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Best Thriller movies on OTT: ఓరి నాయనో.. రక్తపు మడుగులో పసివాడు, భార్యను కిడ్నాప్ చేసే భర్త - ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్ మూవీ ఇది
ఓరి నాయనో.. రక్తపు మడుగులో పసివాడు, భార్యను కిడ్నాప్ చేసే భర్త - ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్ మూవీ ఇది
Samsung New Smart TV: కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Jeep Compass New Car: జీప్ కంపాస్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ గ్లోబల్ లాంచ్ - మనదేశంలో ఎప్పుడు?
జీప్ కంపాస్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ గ్లోబల్ లాంచ్ - మనదేశంలో ఎప్పుడు?
Embed widget