Tirupati Balaji Temple: జమ్ముకశ్మీర్‌లో తిరుపతి బాలాజీ ఆలయం, ప్రారంభించిన అమిత్‌షా
Tirupati Balaji Temple: కశ్మీర్‌లో నిర్మించిన తిరుపతి బాలాజీ ఆలయాన్ని కేంద్రహోం మంత్రి అమిత్‌షా వర్చువల్‌గా ప్రారంభించారు.

Tirupati Balaji Temple in J&K:
వర్చువల్‌గా ప్రారంభం..
జమ్ము కశ్మీర్‌లోని ( Jammu And Kashmir) మజీన్ ప్రాంతంలో నిర్మించిన తిరుపతి బాలాజీ (Tirupati Balaji Temple) ఆలయాన్ని కేంద్రహోం మంత్రి అమిత్‌షా వర్చువల్‌గా ప్రారంభించారు. భక్తుల సందర్శనకు ఆలయ తలుపులు తెరిచారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి జితేంద్ర సింగ్, జమ్ముకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. అమిత్‌షా మాత్రం వర్చువల్‌గా హాజరై...ఆలయాన్ని ప్రారంభించారు. 62 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇందుకోసం రూ.25 కోట్లు ఖర్చు పెట్టారు. రెండేళ్లలో ఈ నిర్మాణం పూర్తైంది. జమ్ములోనే ఇది అతి పెద్ద ఆలయంగా రికార్డుకెక్కింది. ఈ ఆలయంతో కశ్మీర్ పర్యాటక రంగం మరింత బలోపేతం అవుతుందని కేంద్రం భావిస్తోంది. జమ్ముకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ టెంపుల్. ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చొరవ చూపించిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)ని అభినందించారు. కేవలం ఆలయాలు కట్టడమే కాకుండా, మత మార్పిడిలనూ టీటీడీ అడ్డుకుంటోందని ప్రశంసించారు. ఒక్క ఏపీలోనే కాకుండా టీటీడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆలయాలు నిర్మించారు. హైదరాబాద్, చెన్నై, కన్యాకుమారి, ఢిల్లీ, భువనేశ్వర్‌లలో ఈ టెంపుల్స్ ఉన్నాయి. తిరుపతిలో ఎలాంటి వ్యవస్థ అయితే ఉందో...అదే కశ్మీర్‌లోని ఆలయానికీ వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ ఆలయానికి సమీపంలోనే మాతా వైష్ణోదేవి ఆలయం ఉంది.
#WATCH | Jammu: Visuals of Tirupati Balaji temple, which will be inaugurated virtually by Union Home Minister Amit Shah today
— ANI (@ANI) June 8, 2023
The temple has been built on 62 acres of land with approx cost of Rs 25 crores and construction work was completed in a span of two years pic.twitter.com/OJFYWdprmJ
#UPDATE | J&K L-G Manoj Sinha inaugurates the Tirupati Balaji temple in Jammu's Sidhra
— ANI (@ANI) June 8, 2023
The temple has been built on 62 acres of land with approx cost of Rs 25 crores and construction work was completed in the span of two years pic.twitter.com/qYniVLUp7k
శ్రీనగర్‌లో G20 సదస్సు..
ఇటీవలే జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో కీలకమైన G-20 సదస్సు జరుగింది. G-20 దేశాలకు చెందిన 60 మంది ప్రతినిధులు శ్రీనగర్‌కు వచ్చారు. 3rd Tourism Working Group సమావేశం నిర్వహించారు. జమ్ముకశ్మీర్‌కి సంబంధించి ఆర్టికల్ 370 రద్దు చేసిన తరవాత ఇక్కడ అంతర్జాతీయ సదస్సు జరగడం ఇదే తొలిసారి. అందుకే...భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెట్టారు. Sher-e-Kashmir International Convention Center వద్ద ఈ సదస్సు నిర్వహించారు.





















