Hardik Patel Join BJP: భాజపాలోకి పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్- ముహూర్తం ఖరారు
Hardik Patel Join BJP: గుజరాత్ నేత హార్దిక్ పటేల్.. భాజపాలో చేరుతున్నారు.
![Hardik Patel Join BJP: భాజపాలోకి పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్- ముహూర్తం ఖరారు Hardik Patel will join BJP on June 2 at Gandhinagar BJP Office Check Details Hardik Patel Join BJP: భాజపాలోకి పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్- ముహూర్తం ఖరారు](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2017/12/04152200/1-hardik-patel-clarification-on-luxurious-life.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hardik Patel Join BJP: పాటిదార్ ఉద్యమ నేత, మాజీ కాంగ్రెస్ నాయకుడు హార్దిక్ పటేల్ భాజపాలో చేరుతున్నారు. గుజరాత్ గాంధీనగర్‌లోని భాజపా కార్యాలయంలో జూన్ 2న అధికారికంగా కమలం పార్టీలో చేరనున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి ఆయన రాజీనామా చేశారు
భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటిదార్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన హార్దిక్ పటేల్ చివరికి ఆ పార్టీలోనే చేరనున్నారు. ఆయన పాటిదార్ ఉద్యమంలో పాల్గొన్న సమయంలో దేశద్రోహం కేసులను కూడా భాజపా ప్రభుత్వం పెట్టింది. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి అదే పార్టీలో రాజకీయ భవిష్యత్ వెదుక్కోవాలని నిర్ణయించుకున్నారు.
కీలక పాత్ర
భాజపాలో చేరుతున్నానని, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని హార్జిక్ పటేల్ ప్రకటించారు. పార్టీలో చేరిన తర్వాత సోమనాథ్ ఆలయం నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు ఏక్తా యాత్రకు పటేల్ నాయకత్వం వహించనున్నారు. భారీ బల ప్రదర్శన ద్వారా భాజపాలో చేరాలని పటేల్ నిర్ణయించుకున్నారు. హార్దిక్ మే 18న కాంగ్రెస్‌కు ( Cpngress ) వర్కింగ్ ప్రెసిడెంట్‌తో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన భాజపాలో చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ప్రశంసించడం.. కేజ్రీవాల్ కూడా హార్దిక్ పటేల్‌కు స్వాగతం చెప్పడంతో ఆయన అటు వైపు మొగ్గుతారేమో అనుకున్నారు.
భాజపాకే హార్దిక్ ఓటు !
అయితే పాటీదార్లు ఎక్కువగా భాజపా ఓటు బ్యాంక్‌గా ఉన్నారు. అందుకే ఆయన కూడా భాజపాలోనే చేరాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో తాను ముఖ్యమైన పాత్రను పోషిస్తానని ఇప్పటికే పటేల్ ప్రకటించారు. రానున్న శాసన సభ ఎన్నికలు భాజపాకు అనుకూలంగా ఏకపక్షంగా జరుగుతాయని కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత పలు సందర్భాల్లో చెప్పారు.
ప్రాధాన్యం దక్కలేదని రాజీనామా !
పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి ( PAAS ) ఉద్యమాల ద్వారా వెలుగులోకి వచ్చిన యువనేత.. తర్వాత 2019లో కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యేగా గెలిచారు. 2020లో ఆయన గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. కానీ పార్టీ హైకమాండ్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. రాజీనామా చేశారు. ఇప్పుడు భాజపాలో చేరి అదృష్టం పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు.
Also Read: Power Cut Season : వర్షాలు పడినా విద్యుత్ కోతలు తప్పవా ? ఆ సంక్షోభం ముంచుకొచ్చేస్తోందా ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)