అన్వేషించండి

G20 Handicrafts Stalls: జీ20 సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ హస్తకళలు- ప్రత్యేక ఆకర్షణగా బొబ్బిలి వీణ, చెక్క బొమ్మలు

జీ20 సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ హస్తకళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్రాఫ్ట్స్‌ బజార్‌లో తెలుగు రాష్ట్రాల స్టాళ్లకు చోటు దక్కింది. బొబ్బిలి వీణ, చెక్క బొమ్మలు ఆహుతులను అలరిస్తున్నాయి.

ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశాలు.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వేదికగా నిలిచాయి. మన దేశంలోని వైవిధ్యాన్ని, శతాబ్దాల సాంస్కృతిక, హస్త కళా  వైభవాన్ని విదేశీ ప్రతినిధులకు చాటిచెప్పేలా భారత్‌ మండపంలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్స్‌ బజార్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రగతి మైదాన్‌లోని భారత్‌ మండపం ప్రాంగణంలో  ఏర్పాటు చేసిన ఈ క్రాఫ్ట్స్‌ బజార్‌లో తెలుగు రాష్ట్రాల స్టాళ్లకు కూడా చోటు లభించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల స్టాళ్లలో ప్రముఖ హస్తకళల వస్తువులను విక్రయానికి  ఉంచారు. ఆంధ్రప్రదేశ్‌ చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర హస్తకళ వారసత్వం, సంస్కృతిని ప్రతిబింబిస్తూ లేపాక్షి స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్‌లో హస్తకళలు, చేనేత  వ్రస్తాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఏపీ స్టాల్‌లో బొబ్బిలి వీణ, ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి చేనేత వస్త్రాలు, కొండపల్లి, అనకాపల్లి, విజయనగరం బొమ్మలు అందుబాటులో  ఉంచారు. తిరుపతిలో చెక్కతో చెక్కిన వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు రూ.30 లక్షల విలువైన వస్తువులను విక్రయానికి ఉంచినట్టు ఆప్కో,  లేపాక్షి ప్రతినిధులు తెలిపారు.

విదేశీ అతిథులకు లేపాక్షి ఉత్పత్తుల ప్రాశస్త్యాన్ని వివరిస్తున్నారు అధికారులు. ఉత్పత్తుల నేపథ్యం.. వాటికున్న వారసత్వం, సంస్కృతిని సవివరంగా వివరిస్తున్నారు. ఏపీకి  చెందిన హస్తకళలు, చేనేత వ్రస్తాలకు విదేశీ ప్రతినిధుల నుంచి విశేష స్పందన లభిస్తోందని కూడా లేపాక్షి అధికారులు తెలిపారు. మరోవైపు.. గిరిజన ఉత్పత్తుల స్టాల్‌లో  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరకు కాఫీని కూడా ప్రదర్శనకు ఉంచారు. 

ఇక.. తెలంగాణ స్టాల్‌లో చేర్యాల పెయింటింగ్స్‌, గద్వాల, పోచంపల్లి చేనేత వస్త్రాలు, నిర్మల్‌ బొమ్మలు, కరీంనగర్‌ వెండి ఫిలిగ్రి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కరీంనగర్‌ సిల్వర్‌  ఫిలిగ్రి కళకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. కరీంనగర్‌ సిల్వర్‌ ఫిలిగ్రి కళాఖండాలు విశ్వవ్యాప్తమయ్యాయి. స్వచ్ఛమైన వెండితో అతి సున్నితంగా.. పూర్తిగా చేతితోనే తయారు చేసే ఈ  కళారూపాలు ఎంతో ప్రఖ్యాతిగాంచాయి. యునెస్కో అవార్డు, నాలుగు జాతీయ అవార్డులు కూడా కరీంనగర్‌ సిల్వర్‌ ఫిలిగ్రి కైవసం చేసుకుంది. ఇక, నిర్మల్‌ పెయింటింగ్స్‌కు  సంబంధించిన స్టాల్స్‌ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సదస్సులో పాల్గొనే దేశాధ్యక్షులు, ప్రధానులకు అశోకచక్రం ఆకారంలో వెండి తీగతో తయారు చేసిన బ్యాడ్జీలను  అలంకరించారు. రెడీమేడ్‌గా తయారు చేసుకొచ్చిన హస్త కళాకృతులే కాకుండా అక్కడే సజీవంగా అందరి ముందు తయారుచేసి చూపే ఏర్పాట్లు చేశారు. కుమ్మరి చక్రం,  సాలెల మగ్గం, దారం వడికే రాట్నం, తంజావూరు, రాజస్థాన్‌ పెయింటింగ్‌లన్నీ అందరి ముందు వేసి అందించడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇండియన్‌ క్రాఫ్ట్స్‌లో  ప్రధానంగా బొబ్బిలి వీణ, వేప చెక్కతో తయారు చేసిన శ్రీవేంకటేశ్వరస్వామి నిలువెత్తు విగ్రహం ఆకట్టుకుంటున్నాయి. వెండితో చేసిన ఏడుకొండలవాడి ఫిలిగ్రీ విగ్రహాలు  ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Modi Speech In peeleru : వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KA Paul with Thati Munjalu | ఓట్లతో కుండలు నింపాలంటున్న కేఏ పాల్ | ABP DesamKTR On Krishank Arrest |క్రిశాంక్ తో ములాఖత్ ఐన కేటీఆర్ | ABP DesamParakala Prabhakar Exclusive Interview | మోదీ సర్కార్ చెప్పే దొంగ లెక్కలు ఇవే..! | ABP DesamVelichala Rajender Rao | Karimnagar | వినోద్ కుమార్, బండి సంజయ్‌లతో ప్రజలు విసిగిపోయారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Modi Speech In peeleru : వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
Swathi Reddy: ‘ఛీ.. నీ బ్రతుకు’ అంటూ స్వాతిపై నెటిజన్ నెగిటివ్ కామెంట్ - ఆమె రిప్లై చూస్తే ఫ్యాన్ అయిపోతారు!
‘ఛీ.. నీ బ్రతుకు’ అంటూ స్వాతిపై నెటిజన్ నెగిటివ్ కామెంట్ - ఆమె రిప్లై చూస్తే ఫ్యాన్ అయిపోతారు!
Nagarjuna: మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
Meenakshi Chaudhary Latest Photos: గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
KTR: కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
Embed widget