ఫ్రెండ్షిప్ డే సర్ప్రైజ్ ఇచ్చిన జొమాటో సీఈవో, కస్టమర్స్‌కి స్వయంగా ఫుడ్ డెలివరీ
Friendship Day 2023: ఫ్రెండ్షిప్ డే సందర్భంగా జొమాటో సీఈవో బైక్‌పై తిరుగుతూ ఫుడ్ డెలివరీ చేశాడు.
Friendship Day 2023:
డెలివరీ బాయ్‌గా సీఈవో
జొమాటో సీఈవో దీపీందర్ గోయల్ ( Deepinder Goyal ) అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్వయంగా ఆయనే కస్టమర్స్‌కి ఫుడ్ డెలివరీ చేశాడు. బైక్‌పై అన్ని చోట్లా తిరుగుతూ కస్టమర్స్‌కి ఫుడ్‌తో పాటు ఫ్రెండ్షిప్ డే బ్యాండ్‌లనూ ఇచ్చాడు. కస్టమర్స్‌కి మాత్రమే కాదు. డెలివరీ పార్ట్నర్స్కి, రెస్టారెంట్ పార్ట్నర్స్కీ ఆయనే స్వయంగా బ్యాండ్లు డెలివరీ చేశాడు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై జొమాటో బ్యాగ్ వెనకాల పెట్టుకుని, డెలివరీ బాయ్ టీషర్ట్ వేసుకుని కనిపించాడు. "ఫ్రెండ్షిప్ బ్యాండ్లు డెలివరీ చేయడానికి వెళ్తున్నా" అంటూ ట్విటర్లో పోస్ట్ చేశాడు. కొన్ని ఫొటోలు షేర్ చేశాడు. ఆయన చేతిలో ఫ్రెండ్షిప్ బ్యాండ్లున్నాయి. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. నెటిజన్లు ఈ పోస్ట్ చూసి తెగ ఇంప్రెస్ అయ్యారు. కొందరు కస్టమర్స్ ఇవాళ జొమాటో సీఈవోని చూడబోతున్నారంటూ చాలా ఎగ్జైటింగ్‌గా కామెంట్స్ పెట్టారు. "మీరు ఛండీగఢ్‌లో డెలివరీ చేస్తున్నారా..? ఒక్కసారైనా మీ చేతితో డెలివరీ తీసుకోవాలని కోరుకుంటున్నాను" అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. చాలా తక్కువ సమయంలోనే జొమాటో పాపులర్ అయింది. ప్రతి సిటీలోనూ సర్వీస్‌లు అందిస్తోంది. ఇంత పాపులారిటీ ఉన్న కంపెనీ సీఈవో ఓ సాధారణ డెలివరీ బాయ్‌గా మారిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
Going to deliver some food and friendship bands to our delivery partners, restaurant partners and customers. Best Sunday ever!! pic.twitter.com/WzRgsxKeMX
— Deepinder Goyal (@deepigoyal) August 6, 2023
Zomato orders over Swiggy today where people are hoping to meet the CEO 📈
— Ash Arora (@0xashesonchain) August 6, 2023
Thanks @zomato for being my food friend in my househelp’s absence! ❤️
— Swapnil Srivastav (@theswapnilsri) August 6, 2023
దీపిందర్ గోయల్ జీవితం ఒక సినిమా స్టోరీకి ఏ మాత్రం తక్కువ కాదు. తన లైఫ్‌లో వ్యక్తిగతంగా, వృత్తిగతంగా చాలా అడ్డంకులను అధిగమించి విజయం సాధించారు. అతని కంపెనీ త్వరలోనే లాభాల బాట పట్టే సూచనలు ఉన్నాయి. అతని సంపద విలువ 1 బిలియన్ డాలర్ల మార్క్ దాటింది. కొవిడ్ మహమ్మారి సమయంలో, తన డెలివరీ పార్ట్నర్స్ చదువుల ఫీజుల కోసం రూ. 700 కోట్ల విలువైన కంపెనీ షేర్లను విరాళంగా ఇచ్చి వార్తల్లో నిలిచాడు దీపిందర్ గోయల్. ఇప్పటివరకు చెఫ్కార్ట్, అన్అకాడెమీ సహా 16 స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టాడు.
దీపిందర్ గోయల్, పంజాబ్‌లోని ముక్త్సర్ జిల్లాలో జన్మించాడు. చదువుల్లో బిలో యావరేజ్ స్టుడెంట్. 8వ తరగతిలో, పరీక్ష ఇన్విజిలేటర్ అతనికి సాయం చేశాడు. ఆ తరగతిలో ఫెయిల్ అవ్వాల్సిన గోయల్, స్కూల్ స్థాయిలో 3వ ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఇదే అతని జీవితంలో టర్నింగ్ పాయింట్. ఆ తరువాత, అతను తన స్కూల్ టాప్ ర్యాంక్ హోల్డర్లలో ఒకడిగా మారాడు. ఐఐటీ ప్రిపరేషన్ కోసం అతని కుటుంబ సభ్యులు గోయల్‌ను చండీగఢ్ పంపించారు. అయితే, అక్కడి సూపర్‌ఫాస్ట్ స్టుడెంట్స్‌తో పోటీ పడలేక కోచింగ్ మధ్యలోనే ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే, టార్గెట్ మాత్రం మిస్ కాలేదు, దిల్లీ ఐఐటీలో సీటు సంపాదించాడు. దీపిందర్ గోయల్ లో ప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేస్తాడు. ఎందుకంటే, అతనికి నత్తి ఉంది. అందుకే, నలుగురిలో కలవడానికి, హైలైట్ అవ్వడానికి ఇష్టపడడు. తన నత్తిని వదిలించుకోవడానికి ప్రాక్టిస్ చేసి, కాలక్రమేణా మెరుగుపడ్డాడు. కానీ, ఇప్పటికీ కొన్ని అక్షరాలను స్పష్టంగా పలకలేడు.
Also Read: దొంగతనం చేశారన్న అనుమానంతో మైనర్లపై దారుణం, మూత్రం తాగించి కారం పెట్టి చిత్రహింసలు