అన్వేషించండి

Free Train Journey: ట్రైన్ జర్నీ చేస్తున్నారా? ఈ రాయితీలు పొందారా? స్టూడెంట్స్‌కి ఫ్రీ

Train Journey Free: రైలు ప్రయాణం స్టూడెంట్లకు ఫ్రీ.. నిజమే.. జర్నీ చేసేటపుడు మనకు ఏవైనా డిస్కౌంట్లు వస్తాయా లేదా అని చూసుకోవాల్సిన అవసరాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాం.

Train Journey Free For Students:  మీరు స్టూడెంటా..?  రైలు ప్రయాాణం చేస్తున్నారా...?  మీకు 25 నుంచి 100 శాతం వరకు రాయితీ వచ్చే అవకాశం ఉందని మీకు తెలుసా. అంటే కొందరికి రోజూ ఫ్రీగా ట్రైన్ జర్నీ చేసే వెసులుబాటు ఉందని ఎప్పుడైనా విన్నారా?టికెట్ కొనేటప్పుడు మీకొచ్చే రాయితీని పొందారా..? ఒకవేళ ఇంకా లేదంటే ఈ ఆర్టికల్ మీకోసమే. 

విద్యార్థుల కోసం ఇండియన్ రైల్వేస్ ఇచ్చే  ప్రత్యేక ప్రయాణ రాయితీలు

  • అమ్మాయిలకైతే డిగ్రీ వరకు, అబ్బాయిలకైతే ఇంటర్ వరకు తమ ఇంటి నుంచి స్కూల్, కాలేజీ దాకా ఒన్ సైడ్ జర్నీ ఫ్రీగా చేయొచ్చు.
  • తమ సొంతూర్లకు వెళ్తోన్న జనరల్ క్యాటగిరీ కి చెందిన విద్యార్థులకు సెకండ్ క్లాసు, స్లీపర్ క్లాసుల్లో జర్నీ చేసేందుకు 50 శాతం రాయితీ ఇస్తోంది. అలాగే వాళ్లు మంత్లీ సీజన్ టికెట్, క్వార్టర్లీ సీజన్ టికెట్ తీసుకున్నా 50 శాతం రాయితీ  వర్తిస్తుంది.
  • ఎస్సీ, ఎస్టీ క్యాటగిరీకి చెందిన విద్యార్థులకైతే ఈ రాయితీ 75 శాతం దొరుకుతుంది.
  • అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు సైతం ఏడాదికోసారి స్టడీ టూర్ కోసం 75 శాతం రాయితీతో సెకండ్ క్లాస్ జర్నీ చేసే వీలుంది. 
  • ఎంట్రన్స్ పరీక్షలు రాసేందుకు జర్నీ చేసే ఆడపిల్లలకు సైతం 75 శాతం రాయితీ లభిస్తుంది.
  • యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మెయిన్స్‌కి వెళ్లే విద్యార్థులకూ 50 శాతం రాయితీ ఇస్తారు. 
  • మన దేశంలో చదివే ఫారెన్ విద్యార్థులకు సైతం పర్యాటక ప్రదేశాల్లో తిరిగేందుకు సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాసుల్లో 50 శాతం రాయితీ ఇస్తారు.
  • 35 ఏళ్ల లోపు వయసున్న రీసెర్చి విద్యార్థులకు తమ రీసెర్చ్ వర్కుకు సంబంధించిన జర్నీల కోసం 50 శాతం రాయితీ  ఇస్తారు. 
  • ఉద్యోగాలిచ్చేందుకు వచ్చే కంపెనీల ప్రతినిధులకు, వాటిని పొందడానికి ప్రయాణించే విద్యార్థులకు సైతం 25 శాతం రాయితీ ఇస్తారు. 
  • మెరైన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ లకు 50 శాతం రాయితీ దొరుకుతుంది. 

పై రాయితీలు పొందేందుకు సరైన గుర్తింపు కార్డు గానీ, హెచ్ ఓ డీ నుంచి లెటర్ గానీ ఉండాలి. 

దివ్యాంగులు, రోగులకు సైతం.. 

ఇక దివ్యాంగులు,  రోగులు సైతం తమ ప్రయాణంలో 25 శాతం నుంచి 75 శాతం దాకా రైల్వే శాఖ ఈ తరహా రాయితీ అందిస్తోంది. , అంగవైకల్యానికి సంబంధించిన ద్రువపత్రం గానీ,  సంబంధిత హెచ్ ఓ డీ నుంచి రిఫరెన్స్ లేఖ గానీ ఉండాలి. దివ్యాంగులకు ఇండియన్ రైల్వేస్ ముందస్తు గుర్తింపు కార్డులు అందిస్తోంది.  ఆన్లైన్‌ దరఖాస్తు ద్వారా వీటిని పొందొచ్చు.  

  • ఆర్థో పెడికల్లీ (ఎముకలకు సంబంధించిన) దివ్యాంగులైతే సెకండ్ క్లాస్, స్లీపర్, ఫస్ట్ క్లాస్, 3 ఏసీ, ఏసీ ఛైర్ కార్  క్లాసుల్లో 75 శాతం రాయితీతో ప్రయాణం చేయొచ్చు. ఫస్ట్ ఏసీ, 2 ఏసీల్లో 50 శాతం రాయితీ పొందొచ్చు. వీళ్లతో పాటు ఒక ఎస్కార్టుకు కూడా ఇదే చార్జీలు వర్తిస్తాయి.  మానసిక రోగులకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయి. 
  • మూగ, చెవిటి వాళ్లకు , అంధులకు సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ లలో 50 శాతం రాయితీ వర్తిస్తుంది.  ఒకరు ఎస్కార్టుగా ఇవే చార్జీలపై ప్రయాణించొచ్చు.  
  • క్యాన్సర్, కిడ్నీ, హార్టు, తలసేమియా, రక్త హీనత వంటి వ్యాధులతో బాధ పడే పేషంట్లకు దాదాపు అన్ని క్లాసుల్లోనూ 75 నుంచి వంద శాతం రాయితీ వర్తిస్తుంది. ఒక ఎస్కార్టుకూ 75 రాయితీ వర్తిస్తుంది.  
  • టీబీ పేషంట్లకు, లెప్రసీ పేషంట్లకు  సెకండ్ క్లాస్, స్లీపర్లలో 75 శాతం, ఎయిడ్స్ పేషంట్లకు 50 శాతం రాయితీ దొరకుతుంది.  
  • ఓస్టమీ పేషంట్లకు మంత్లీ సీజనల్ టికెట్‌ ద్వారా 50 శాతం రాయితీ దొరుకుతుంది. ఒక అటెండెంట్ ‌కూ ఇదే చార్జీ వర్తిస్తుంది.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండ ఒకే దాంట్లోే -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లోే - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget