Maharashtra New CM : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్
Maharashtra CM: మహాయుతిలో కొలువుల పంచాయతీ కొలిక్కివచ్చింది. మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్రఫడ్నవీస్ ఎంపికయ్యారు. డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ పదవీ బాధ్యతలు చేపడారు.
Maharashtra New CM News: మహారాష్ట్ర రాజకీయాల్లో(Maharashtra Politics) ప్రతిష్టంభనకు దారి తీసిన ముఖ్యమంత్రి కొలువు విషయంపై తాజాగా పరిష్కారం లభించింది. గత నెల నవంబరు 20న(November 20) జరిగిన అసెంబ్లీ(Assembly) ఎన్నికల్లో బీజేపీ(BJP) నేతృత్వంలోని మహాయుతి(Mahayuthi) కూటమి ప్రభంజన విజయాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ, శివసేన, ఎన్సీపీలు తిరుగులేని మెజారిటీ దక్కించుకుని అధికారం దక్కించుకున్నారు. అయితే.. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పీఠంపై ముడిపడింది. తమకు కావాలంటే తమకు కావాలంటూ.. బీజేపీ, శివసేన మధ్య తెరచాటు రాజకీయం జోరందుకుంది. దీనిపై అనేక దఫాలుగా ఢిల్లీ వేదికగా బీజేపీ పెద్దలు చర్చలు జరిపారు. బీజేపీ తరఫున సీనియర్ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించారు. అయితే.. తామే సీఎం సీటు తీసుకుంటామని శివసేన అధినేత, ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పట్టుబట్టారు. మొత్తానికి ఈ విషయం కారణంగా.. దాదాపు 12 రోజులుగా మహారాష్ట్రలో సర్కారు ఏర్పాటు ఆలస్యమవుతూ వచ్చింది.
ఇప్పుడు బీజేపీ పంపించిన దూతలు.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman) సహా మరికొందరితో భేటీ అయిన మహాయుతి నాయకులు కొలువుల పంచాయతీని ఒక కొలిక్కి తెచ్చారు. దీని ప్రకారం.. ముఖ్యమంత్రి పీఠం దేవేంద్ర ఫడ్నవీస్‌కు దక్కింది. ఉప ముఖ్యమంత్రులుగా శివసేన అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు అవకాశం చిక్కింది. దీంతో మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధాలు.. తొలిగిపోయినట్టు అయింది. దీంతో గవర్నర్‌ను కలిసి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల పేర్లతో పాటు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా మహాయుతి కోరనుంది.
శాసన సభా పక్ష నాయకుడిగా..
బీజేపీ సీనియర్ నేత మాజీ సీఎం, దేవేంద్ర ఫడ్నవీస్‌ను.. బుధవారం బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ నిర్ణయం అనంతరం.. దేవేంద్ర ఫడ్నవీస్ సహా.. మహాయుతి నాయకులు.. శాసన సభా పక్ష ఎమ్మెల్యేల పేర్లను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు అందజేయనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని కోరనున్నారు. మరోవైపు.. గురువారం(డిసెంబర్ 5న) నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియ ఇప్పటికే వడివడిగా సాగుతోంది. మహారాష్ట్రలోని ఆజాద్ మైదాన్‌లో సీఎం, డిప్యూటీ సీఎంలు సహా.. మంత్రులు ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రిన రేంద్ర మోడీ సహా.. కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. మరోవైపు.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కూడా ఆహ్వానించనున్నట్టు తెలిసింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు కూడా ఆహ్వానం అందనుంది.
Also Read: బస్టాండ్‌లో కూర్చొని ఫోన్ చూస్తుండగా కౌగిలించుకున్న బస్- తృటిలో తప్పిన ఘోరం
గతంలోనూ దేవేంద్ర..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కనున్నారు. అయితే.. ఆయనకు సీటు కొత్తకాకపోయినా.. స్వల్ప కాలమే ఆయన సీఎంగా ఉన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో అప్పటి ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనతో కలిసి బీజేపీ విజయం దక్కించుకుంది. అయితే.. సీఎం సీటు విషయంలో అప్పుడు కూడా వివాదం ఏర్పడింది ఈ క్రమంలో బీజేపీ తరఫున సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేశారు. కానీ, బల నిరూపణకు ముందుగానే ఆయన రాజీనామా చేశారు. తర్వాత.. రాజకీయ పరిణామాలు యూటర్న్ తీసుకోవడం.. శివసేన చీలికతో ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యాక.. ఆయన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ వ్యవహరించారు.
రాజకీయ దూకుడు..
రాజకీయంగా దేవేంద్ర ఫడ్నవీస్‌కు దూకుడు ఎక్కువని అంటారు. మంచి వాక్చాతుర్యం ఆయన సొంతం. ఈసారి మహాయుతి మరోసారి అధికారంలోకి రావడమే కాకుండా 288 స్థానాలకు గాను .. 235స్థానాలు దక్కించుకోవడం వెనుక ఫడ్నవీస్ కృషి ఎంతో ఉందని పరిశీలకులు చెబుతారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడికి కేవలం 50 సీట్లకే పరిమితం చేయడం కూడా.. ఫడ్నవీస్ చాతుర్యమేనని అంటారు. బీజేపీ 132 సీట్లు, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీకి ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా లభించింది.
Also Read: తూచ్, అవన్నీ ఊహాగానాలే - పన్ను పోటు వార్తలు నమ్మొద్దన్న సర్కారు