Kerala Viral News: బస్టాండ్‌లో కూర్చొని ఫోన్ చూస్తుండగా కౌగిలించుకున్న బస్- తృటిలో తప్పిన ఘోరం
Viral News: రోడ్లపై బస్సు ప్రమాదాలు కామన్. కానీ, బస్టాండులో బస్సు కోసం వెయిట్ చేస్తున్న సమయంలో బస్సు దూసుకువస్తే ఏం చేస్తాం. ఇలాంటి అనుభవమే కేరళలోని ఓ వ్యక్తికి జరిగింది.
Kerala News Today: బస్సు ప్రమాదాల (Bus Accidents) గురించి అందరికీ తెలిసిందే. రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో అదుపుతప్పో.. లేక, మరే కారణంతోనే బస్సులు ఢీ కొట్టి దేశవ్యాప్తంగా అనేక మంది మరణిస్తున్నారు. అయితే.. బస్టాండ్‌లోనే బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటే.. నివ్వెర పోవాల్సిందే. గత ఏడాది తిరుపతి(Tirupati) బస్టాండ్‌లో ఓ బస్సు డ్రైవర్ రివర్స్ చేస్తూ.. ముగ్గురు ప్రయాణికులపైకి ఎక్కించేశాడు. అప్పట్లో అది తీవ్ర సంచలనంగా మారింది. తర్వాత విజయవాడ(Vijayawada) బస్టాండ్‌లో ప్రయాణికులు కూర్చునే ఆవరణలోకి(Sitting area) బస్సు దూసుకువచ్చేసింది. గుడివాడ బస్సులు ఆగే ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటనలో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అంటే.. బస్సుల విషయంలో రోడ్లపైనే కాదు.. బస్టాండుల్లోనూ జాగ్రత్తగా ఉండాలనే సంకేతాలు వచ్చాయి.
తాజాగా ఏం జరిగిందంటే..
తాజాగా కేరళ(Kerala)లో కూడా అచ్చంగా ఇలానే ఓ ఘటన చోటు చేసుకుంది. బస్సు కోసం ఎదురు చూస్తూ.. ప్లాట్ ఫాంపై(Flatform) ఉన్న కుర్చీలో కూర్చున్న ఓ యువకుడిని అతను ఎక్కాల్సిన బస్సే.. రయ్యన దూసుకు వచ్చి.. ఢీ కొట్టింది. ఈ ఘటన చూసిన ప్రత్యక్ష సాక్షులు నివ్వెర పోయారు. ఎందుకంటే.. స్టాపింగ్ పాయింట్ నుంచి దూసుకువచ్చిన బస్సు.. నేరుగా యువకుడి ఛాతీపై బలంగా ఢీ కొట్టింది. ఆ వెంటనే వెనక్కి వెళ్లిపోయింది. అయితే.. ఈ ఘటనలో అదృష్టవశాత్తు యువకుడికి ఏమీ జరగకపోయినా.. సీసీ కెమెరాల్లో నమోదైన వీడియోను చూసిన వారికి మాత్రం ఒళ్లు జలదరించడం ఖాయం.
ఎక్కడ?
కేరళలోని కట్టప్పనా(Kattappna) బస్టాండ్‌లో ఓ యువకుడు.. తాను ఎక్కవలసిన బస్సు కోసం స్టాపింగ్ పాయింట్‌కు ఎదురుగా ఉన్న ప్లాట్ ఫాంపై వేచి చూస్తున్నాడు. అక్కడే ఉన్న కుర్చీలపై కూర్చుని తాపీగా ఫోన్ చూసుకుంటున్నాడు. ఇంతలోనే రయ్యిన దూసుకువచ్చిన బస్సు స్టాపింగ్ పాయింట్‌ను దాటి.. పెద్ద గట్టును ఢీ కొట్టి దానిపైనుంచి.. కుర్చీలో కూర్చున్న యువకుడిపై నేరుగా దూసుకుపోయింది. ఇది ఎంత వేగంగా అంటే కన్నుమూసి తెరిచే లోపే ఈ ఘటన జరిగిపోయింది. యువకుడి ఛాతీపైకి దూసుకుపోయిన బస్సు.. ఆ వెంటనే కిందకు దిగిపోయింది. అయితే.. ఈ ఘటన చూసిన వారు మాత్రం ఇక, ఆ యువకుడు ప్రాణాలతో బతికి బయటపడడం కష్టమేనని అనుకుంటారు. కానీ, అదృష్టవ శాత్తు ఆ యువకుడికి ఏమీ జరగలేదు.
Also Read: పన్ను ఆదా చేయాలంటే ఈ నెలాఖరులోగా సీరియస్‌గా ఆలోచించాల్సిన ఆప్షన్స్ ఇవి
ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే..
ప్రత్యక్ష సాక్షులు(Eyewitnesses) తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ బస్టాండ్‌కు చేరుకోగానే బస్సు అదుపు తప్పి నేరుగా ప్యాసింజర్ వెయిటింగ్ ఏరియాలోకి దూసుకు వెళ్లింది. ఆ తర్వాత కుర్చీపై కూర్చున్న యువకుడి ఛాతీపైకి దూసుకు వెళ్లింది. ఇంతలో డ్రైవర్ సకాలంలో బ్రేకులు వేయడంతో బస్సు అంతే దూకుడుగా వెనక్కి మళ్లింది. లేకుంటే బస్సు టైరు ఆ వ్యక్తి ఛాతీకి తగిలి ఉంటే ప్రాణాలు పోయేవని తెలిపారు. కాగా, ఈ ఘటనపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా బస్సును నడిపిన డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటన అనంతరం.. వెయిటింగ్ ఏరియాలో ఉన్న ప్రయాణికులు ఉరుకులు పరుగులు పెడుతూ.. భయభ్రాంతులకు గురై.. అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ(CCTV)లో రికార్డయింది.
సోషల్ మీడియాలో రుసరుస!
కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ రికార్డు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీనిని చూసిన నెటిజన్లు(Netizen) నిర్ఘాంత పోయారు. ఇదే సమయంలో డ్రైవర్ తీరుపై నిప్పులు చెరిగారు. ఘటన జరిగిన సమయంలో బస్సు డ్రైవర్ మద్యం తాగి(Drunk) ఉన్నాడని, ఆయనపై కఠినంగా వ్యవహరించాలని కొందరు డిమాండ్ చేశారు. మరికొందరు బస్సు బ్రేక్ ఫెయిల్ అయి ఉంటుందని, అందుకే ఇలా జరిగి ఉంటుందని వ్యాఖ్యానించారు. మరొకరు స్పందిస్తూ.. ఎక్కడా మనుషులకు రక్షణ లేదు.. అని ఆవేదన వ్యక్తం చేశాడు. మొత్తంగా ఈ వీడియోను 76 వేల మందికంటేఎక్కువ మంది వీక్షించడం గమనార్హం.
Also Read: తూచ్, అవన్నీ ఊహాగానాలే - పన్ను పోటు వార్తలు నమ్మొద్దన్న సర్కారు