అన్వేషించండి

Chief Minister Choices: 3 రాష్ట్రాల్లోనూ కొత్త వారికే అవకాశం,సీఎం అభ్యర్థిపై బీజేపీ మేధోమథనం

Election Results 2023: మూడు రాష్ట్రాలకూ కొత్త వ్యక్తులకు సీఎం పదవినివ్వాలని బీజేపీ మేధోమథనం కొనసాగిస్తోంది.

Election Results:

మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులెవరో?  

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో (Election Results 2023) మూడు చోట్ల ఘన విజయం సాధించింది బీజేపీ. కాంగ్రెస్ ఖాతాలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌నీ కైవసం చేసుకుంది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్‌లోనూ మరోసారి అధికారంలోకి వచ్చింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు (Loksabha Elections 2024) జరగనున్నాయి. సరిగ్గా వీటి ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావడం వల్ల బీజేపీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలనూ తలకిందులు చేసి బీజేపీ భారీ మెజార్టీ సాధించింది. ప్రభుత్వం ఏర్పాటుకి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థులపైనే మేధోమథనం జరుగుతోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఇప్పటికే కీలక అభ్యర్థులతో సమావేశమయ్యారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు చర్చించారు. ఈ సమావేశంలో మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి రేస్‌లో ఉన్న అభ్యర్థులతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. మూడు రాష్ట్రాల పార్టీ ఇన్‌ఛార్జ్‌లతోనూ సమావేశమయ్యారు అమిత్‌షా, జేపీ నడ్డా. అయితే...బీజేపీ జాతీయ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా పరిశీలకులను నియమించనుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఈ పరిశీలకులు సమావేశాలు నిర్వహించనున్నారు. ఆ తరవాత ముఖ్యమంత్రి అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

రేసులో ఎందరో..? 

మధ్యప్రదేశ్‌కి ఇప్పటి వరకూ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే..ఈ సారి ఆయనకు పోటీగా పలువురు కేంద్రమంత్రులు ఈ రేస్‌లో ఉన్నారు. ప్రహ్లాద్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్‌తో పాటు కైలాశ్ విజయ్‌వర్గియ కూడా పోటీ పడుతున్నారు. ఇక రాజస్థాన్‌లోనూ ముఖ్యమంత్రి రేస్‌లో చాలా మందే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజస్థాన్‌ బీజేపీ ప్రెసిడెంట్ సీపీ జోషి, దియా కుమారి, మహంత్ బాలాకాంత్ రేసులో ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌ ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా కనిపిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ సావో, ప్రతిపక్ష నేత ధరమలాల్ కౌశిక్, మాజీ IAS అధికారి ఓపీ చౌదరి కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. అయితే..హైకమాండ్ మాత్రం ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు. మరికొద్ది రోజుల్లో ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశముంది. 

టాప్ హెడ్ లైన్స్

Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Embed widget