అన్వేషించండి

Indian Passport Controversy:SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భారతీయ పాస్‌పోర్ట్ ఒక చెల్లుబాటు అయ్యే పత్రమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వ్యాఖ్యలపై ఈసీ క్లారిటీ ఇచ్చింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఓటరు జాబితాలో పాస్‌పోర్ట్ కీలకమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
  • పౌరసత్వ వివాదంపై విదేశాంగ ప్రకటన గందరగోళం సృష్టించింది.
  • ఓటర్ల నమోదుకు పాస్‌పోర్ట్ కీలక పత్రమని ఈసీ పునరుద్ఘాటించింది.
  • పాస్‌పోర్ట్‌ను ఓటర్ల నమోదుకు తిరస్కరించడానికి అధికారులకు వీలులేదు.

Indian Passport Controversy:తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్‌ రివిజన్ ప్రక్రియలో పాస్‌పోర్ట్‌ పాత్రపై కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఒక ముఖ్యమైన వివరణ ఇచ్చింది. ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవాలన్న లేదా ప్రస్తుతం వివరాలను సవరించుకోవాలన్నా అవసరమైన 12 రకాల ధృవీకరణ పత్రాలలో పాస్‌పోర్ట్ కూడా ఒకటిగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ వివరణ సాధారణ ఓటర్లకు, కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఎంతో ఊరటనిచ్చే అంశం. 

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 1967 పాస్‌పోర్ట్ చట్టాన్ని ఉటంకిస్తూ, పాస్‌పోర్ట్‌ అనేది కేవలం ప్రయాణ పత్రమే కానీ, అది పౌరసత్వానికి నిరూపణ కాదని పేర్కొంది. ఈ ప్రకటన సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. పాస్‌పోర్ట్ ఉన్నప్పటికీ పౌరసత్వం విషయంలో సమస్యలు వస్తాయా? ఓటర్ల జాబితాలో పాస్‌పోర్ట్‌ ఆధారంగా పేరు నమోదు చేయడం సాధ్యం కాదా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమయ్యాయి. దీంతో ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.  

ఎన్నికల సంఘం అధికారుల ప్రకారం, ఓటర్ల జాబితాలో ఒక వ్యక్తి పేరు చేర్చడానికి ఆ వ్యక్తి భారతీయ పౌరుడై ఉండటం, నిర్ణీత వయసు కలిగి ఉండటం ప్రాథమిక సూత్రం. దీనిని నిరూపించడానికి ఓటరు నమోదు అధికారి కొన్ని పత్రాలను పరిశీలిస్తారు. ఈ పత్రాల జాబితాలో పాస్‌పోర్ట్ ఎప్పటి నుంచో ఉంది. అది అలాగే కొనసాగుతుంది. " పాస్‌పోర్ట్ అనేది ఒక వ్యక్తి గుర్తింపును, నివాసాన్ని ధృవీకరించే కీలక పత్రం. ఇందులో ఎలాంటి మార్పు లేదు" అని ఒక ఉన్నతాధికారి స్పష్టం చేశారు. 

చారిత్రక ఆధారాలు, గత అనుభవాలు 

గతంలో  బిహార్‌లో జరిగిన SIR, అసోంలో జరిగిన ప్రత్యేక సవరణలు, ఆ తర్వాత జరిగిన వివిధ దశల ఓటర్ల జాబితా సవరణలలో కూడా పాస్‌పోర్ట్‌ను ఒక ప్రామాణిక పత్రంగానే పరిగణించారు. గత 12 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి కొత్త విధానాన్ని తీసుకురాలేదని, పాత పద్ధతులే అమల్లో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అంటే దశాబ్ద కాలంగా పాస్‌పోర్ట్‌ అనేది ఓటరుగా నమోదు కావడానికి ఒక నమ్మదగిన ఆధారంగా ఉంటూ వస్తోంది. 

పౌరసత్వం vs గుర్తింపు పత్రం

చట్టపరంగా చూస్తే పాస్‌పోర్ట్ అనేది ఒక వ్యక్తి భారత వెలుపలికి వెళ్లడానికి లేదా తిరిగి రావడానికి ఇచ్చే ప్రయాణ పత్రం. అయితే ఓటర్ల జాబితా తయారీ సమయంలో , సదరు వ్యక్తి వివరాలను సరిచూడటానికి అధికారులు కోరే 12 పత్రాలలో  ఇది ఒకటి. ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దరఖాస్తుదారు సమర్పించిన ఈ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఓటు హక్కుపై నిర్ణయం తీసుకుంటారు. 

ప్రజలు గమనించాల్సిన అంశాలు...

ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసేటప్పుడు పాస్‌పోర్ట్ మాత్రమే కాకుండా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌ వంటి మరో 11 పత్రాలను కూడా ప్రభుత్వం అనుమతిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్నికల సంఘం కానీ పాస్‌పోర్ట్ ప్రాముఖ్యతను తగ్గించే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఓటరు నమోదు ప్రక్రియలో దరఖాస్తుదారు పత్రాలను అంగీకరించే పూర్తి అధికారం సంబంధిత అధికారులకు ఉంటుంది. పాస్‌పోర్ట్ సమర్పించినప్పుడు దాన్ని నిరాకరించడానికి వీలులేదని తాజా వివరణ ద్వారా స్పష్టమవుతుంది. 

Frequently Asked Questions

ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి పాస్‌పోర్ట్ ఉపయోగపడుతుందా?

అవును, కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం ఓటరు నమోదుకు అవసరమైన 12 రకాల ధృవీకరణ పత్రాలలో పాస్‌పోర్ట్ ఒకటి. ఇది మీ గుర్తింపును, నివాసాన్ని ధృవీకరిస్తుంది.

పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదని చెప్పినప్పటికీ, ఓటర్ల జాబితాకు ఇది ఎలా ఉపయోగపడుతుంది?

పాస్‌పోర్ట్ ప్రయాణ పత్రమైనప్పటికీ, ఓటరు నమోదు ప్రక్రియలో మీ గుర్తింపును, నివాసాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే 12 పత్రాలలో ఇది ఒకటి. ఇది పౌరసత్వానికి రుజువు కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి పాస్‌పోర్ట్‌తో పాటు ఏ ఇతర పత్రాలను సమర్పించవచ్చు?

పాస్‌పోర్ట్‌తో పాటు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి మరో 11 రకాల పత్రాలను కూడా ప్రభుత్వం ఓటరు నమోదు కోసం అనుమతిస్తుంది. దరఖాస్తుదారు సమర్పించిన పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amroha Three Sisters Marriage: ముగ్గురు అక్కా చెల్లెళ్లను ఒకే సారి పెళ్లి చేసుకున్న వ్యక్తి - వీడియో వైరల్ - కానీ అసలు ట్విస్ట్ క్లైమాక్స్‌లో
ముగ్గురు అక్కా చెల్లెళ్లను ఒకే సారి పెళ్లి చేసుకున్న వ్యక్తి - వీడియో వైరల్ - కానీ అసలు ట్విస్ట్ క్లైమాక్స్‌లో
Mumbai Cop Threatens Student Protesters: డ్రగ్స్ కేసు ఇరికించి జీవితాలు నాశనం చేస్తా - విద్యార్థి ఉద్యమకారులకు ముంబై పోలీసుల బెదిరింపు- వీడియో వైరల్
డ్రగ్స్ కేసు ఇరికించి జీవితాలు నాశనం చేస్తా - విద్యార్థి ఉద్యమకారులకు ముంబై పోలీసుల బెదిరింపు- వీడియో వైరల్
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Advertisement

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
Embed widget