అన్వేషించండి

శ్రద్ధా వాకర్ తరహాలోనే యువతి దారుణహత్య - ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన ప్రియుడు అరెస్ట్

20 నుంచి 25 ఏళ్ల వయసున్న ఓ యువతిని సహజీవనం చేసిన యువకుడే ఢిల్లీలో దారుణంగా హత్య చేశాడు. అనంతరం డెడ్ బాడీని ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో దాచడం కలకలం రేపింది.

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. గత ఏడాది ఓ యువతి శ్రద్ధా వాకర్ ను బాయ్ ఫ్రెండ్ హత్య చేసి డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్ లో దాచడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా అలాంటి ఘటన నైరుతి ఢిల్లీలోని మిత్రాన్ గ్రామ శివార్లలో జరిగింది. 20 నుంచి 25 ఏళ్ల వయసున్న ఓ యువతిని సహజీవనం చేసిన యువకుడే దారుణంగా హత్య చేశాడు. అనంతరం డెడ్ బాడీని ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో దాచడం కలకలం రేపింది. నిందితుడ్ని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి విచారించగా సంచలన విషయాలు వెలుగుచూశాయి.

అసలేం జరిగిందంటే..
అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ద్వారక) విక్రమ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. సాహిల్ గెహ్లాట్, హర్యానా లోని ఝజ్జర్ కు చెందిన నిక్కీ యాదవ్ కొన్ని నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని స్థానికులు తెలిపారు. అయితే ఈ ఫిబ్రవరి 10న సాహిల్ వివాహం జరిగింది. కానీ తన పెళ్లికి ప్రియురాలు అడ్డుగా భావించి నిందితుడు తనతో సహజీవనం చేసిన యువతిని హత్య చేయాలని భావించాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట ఢిల్లీలోని కశ్మీరీ గేట్ ఐఎస్‌బీటీ వద్ద నిక్కీ యాదవ్ ను గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం నిక్కీ యాదవ్ డెడ్ బాడీని తన కారులో నజఫ్ గఢ్ లోని మిత్రాన్ గ్రామానికి తీసుకొచ్చాడు. అనంతరం డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి తన దాబాలోని రిఫ్రిజిరేషర్ లో ఉంచాడని పోలీసులు తెలిపారు.

ఫిబ్రవరి 10వ తేదీన ప్రియురాలు నిక్కీ యాదవ్ ను హత్య చేసిన రోజే మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు సాహిల్. పోలీసులు నిందితుడు నడుపుతున్న దాబాకు వెళ్లి తనిఖీ చేయగా ఫ్రిజ్ నుంచి దుర్వాసన రావడంతో తెరిచి చూడగా ఓ డెడ్ బాడీని ముక్కలు చేసి దాచి ఉంచిటన్లు పోలీసులు గుర్తించారు. తాను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకున్న నిక్కీ యాదవ్ తనను మోసం చేశావంటూ ప్రియుడ్ని నిలదీసింది. వేరే అమ్మాయితో పెళ్లిని అడ్డుకుంటానని ఆమె చెప్పడంతో ఆవేశానికి లోనై తానే నిక్కీ యాదవ్ ను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో నిందితుడు సాహిల్ అంగీకరించాడని వార్తా సంస్థ పీటీఐ రిపోర్ట్ చేసింది. తన పెళ్లిని అడ్డుకుంటుందన్న కారణంతోనే ప్రియురాలిని హత్య చేశానని నిందితుడు అంగీకరించాడని అడిషనల్ డీసీపీ విక్రమ్ సింగ్ వెల్లడించారు. నిందితుడు సాహిల్ పై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్ట ప్రకారం నడుచుకుంటామని చెప్పారు.

గత ఏడాది శ్రద్ధా వాకర్ దారుణహత్య
శ్రద్ధా వాకర్ అనే 27 ఏళ్ల యువతిని ఆమెతో సహజీవనం చేస్తున్న ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా అనే యువకుడు గొంతు కోసి హత్య చేశాడు. ఆపై ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచాడు. తనకు వీలు దొరికినప్పుడల్లా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని ముక్కలు పారవేశాడు. శ్రద్ధా హత్య కేసులో ఢిల్లీ పోలీసులు 6,636 పేజీల చార్జిషీట్‌ను విడుదల చేశారు. కేసు నమోదైన 75 రోజుల్లో చార్జిషీట్‌ను సమర్పించారు. గతేడాది నవంబర్ 12న ఢిల్లీ పోలీసులు నిందితుడు అఫ్తాబ్ ను అరెస్ట్ చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget