By: Ram Manohar | Updated at : 28 Aug 2023 11:04 AM (IST)
విస్టారా ప్లైట్‌లో రెండేళ్ల చిన్నారికి గుండెపోటు రాగా విమానంలో ఉన్న డాక్టర్లు సీపీఆర్ చేసి కాపాడారు. (Image Credits: Twitter)
Vistara Flight:
విస్టారా ఫ్లైట్‌లో ఘటన..
బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్టారా ఫ్లైట్‌లో ఓ రెండేళ్ల చిన్నారికి అస్వస్థకు గురైంది. ఊపిరాడక ఇబ్బంది పడింది. ఆ ఫ్లైట్‌లోనే ఢిల్లీ AIIMSకి చెందిన ఐదుగురు డాక్టర్లు ప్రయాణిస్తున్నారు. వెంటనే చిన్నారి పరిస్థితిని గమనించారు. అప్పటికే చిన్నారి పల్స్ పోయింది. శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. శ్వాస తీసుకోడమూ ఆగిపోయింది. విమానం గాల్లో ఉండగానే వెంటనే CPR చేశారు డాక్టర్లు. మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి ఫ్లైట్‌ని నాగ్‌పూర్‌కి మళ్లిస్తున్నట్టు అనౌన్స్‌మెంట్ చేశారు. అప్పటిలోగా చిన్నారికి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం రాకుండా ప్రాథమిక చికిత్స అందించారు. అందుబాటులో ఉన్న మెడికల్ డివైజ్‌లతోనే చిన్నారి ప్రాణం పోకుండా కాపాడారు. IV Canullaతో చికిత్స చేశారు. మళ్లీ సాధారణ స్థితికి వచ్చి ఊపిరి తీసుకునేంత వరకూ చాలా సేపు శ్రమించారు. గుండెపోటు వచ్చిందని గుర్తించి వైద్యులు దాదాపు 45 నిముషాల పాటు మెడికేషన్ చేశారు. కాసేపటికి ఫ్లైట్ నాగ్‌పూర్‌కి చేరుకుంది. వెంటనే చిన్నారిని పీడియాట్రిషియన్‌కి అప్పగించారు. ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను Delhi AIIMS ట్విటర్‌లో షేర్ చేసింది. రెండేళ్ల చిన్నారి ప్రాణాలను CPRతో కాపాడాం అంటూ ట్విటర్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది.
#Always available #AIIMSParivar
While returning from ISVIR- on board Bangalore to Delhi flight today evening, in Vistara Airline flight UK-814- A distress call was announced
It was a 2 year old cyanotic female child who was operated outside for intracardiac repair , was… pic.twitter.com/crDwb1MsFM— AIIMS, New Delhi (@aiims_newdelhi) August 27, 2023
Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు
UGC NET 2023 Notification: యూజీసీనెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?
చీపురు పట్టి ఊడ్చిన ప్రధాని మోదీ, స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా గంటపాటు శ్రమదానం
ఎలక్ట్రిక్ కార్‌లో ఉన్నట్టుండి మంటలు, చూస్తుండగానే కాలి బూడిదైపోయింది - వైరల్ వీడియో
కార్‌పూలింగ్‌ని బ్యాన్ చేసిన బెంగళూరు, ఉల్లంఘిస్తే రూ.10 వేల జరిమానా - కారణమిదే
Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు
PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్
Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'
/body>