అన్వేషించండి

Cyclone Asani: దూసుకొస్తున్న అసని తుఫాన్ ముప్పు- బలమైన గాలులతో అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు

Cyclone Asani Updates: ఉత్తర, మధ్య అండమాన్‌లలో బలమైన గాలులు వీస్తున్నాయి. ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్‌లో అంతా సాధారణంగానే ఉండగా.. బంగ్లాదేశ్-మయన్మార్ తీరాల వైపు అల్పపీడనం కదులుతోంది.

Cyclone Asani 2022 Rains: ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం (India Meteorological Department) ఆదివారం తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా మారే క్రమంలో తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయి.  దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కదులుతూ శనివారం తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ అల్పపీడనం మరింతగా బలపడింది. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతంలో నేడు (ఆదివారం) వాయుగుండంగా మారనుంది. 

ఓ వైపు బలమైన గాలులు వీచనుండగా, మరోవైపు అకాల వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అసని తుఫాను కారణంగా నేడు అండమాన్ & నికోబార్‌లోని కొన్ని ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు తెలిపినట్లు పీటీఐ రిపోర్ట్ చేసింది. అండమాన్ మరియు నికోబార్ దీవులలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురనున్నాయి. ఈ ఏడాది సంభవిస్తున్న మొదటి తుఫాను ప్రభావంతో ద్వీపసమూహంలో సేవలు నిలిపివేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. 

అప్రమత్తమైన ఎన్డీఆర్ఎఫ్ టీమ్..
వాయుగుండం సోమవారం తుఫాన్‌ తీవ్ర రూపం దాల్చనుంది. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మార్చి 22 ఉదయం నాటికి బంగ్లాదేశ్, దానిని అనుకుని ఉన్న ఉత్తర మయన్మార్ తీరానికి మార్చి 23న చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గత రెండు రోజులుగా చెబుతోంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF)కి చెందిన సుమారు 100 మంది సిబ్బందిని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆరు సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి దీవుల సమీప ప్రాంతాల్లో మోహరించారు. .

ఉత్తర, మధ్య అండమాన్‌లలో బలమైన గాలులు వీచడంతో పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. పోర్ట్ బ్లెయిర్‌లో ఇప్పటివరకూ జనజీవనం సాధారణంగా ఉందని, ఏ క్షణంలోనైనా అసని తుఫాను ప్రభావం వీరిపై సైతం పడుతుందని ఆ ప్రజలను వాతావరణ కేంద్రం హెచ్చరికల ద్వారా అప్రమత్తం చేసింది.  అసని తుఫాను బంగ్లాదేశ్-మయన్మార్ తీరాల వైపు కదులుతుందని అంచనా వేశారు.

అక్కడ భారీ వర్షాలు.. 
అండమాన్ మరియు నికోబార్ దీవులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాని పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.  సోమవారం కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అండమాన్ సముద్రం, దాని సమీప ప్రాంతాల్లో, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ పేర్కొంది. 

Also Read: Weather Updates: వాయుగుండంగా మారిన అల్పపీడనం - ఏపీ, తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, కొన్నిచోట్ల వర్షాలు !

Also Read: Special Trains: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్! 104 కొత్త రైళ్లు, ఈ నగరాల మధ్యే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sankranti 2025: సంక్రాంతి బండెక్కిన హైదరాబాద్‌- ఊరెళ్లే రహదారులన్నీ జామ్‌
సంక్రాంతి బండెక్కిన హైదరాబాద్‌- ఊరెళ్లే రహదారులన్నీ జామ్‌
CM Revanth Reddy: 'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
CM Chandrababu: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
Pawan Kalyan: 'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sobhan Babu House Vlog | చిన నందిగామ లో నటభూషణ్  కట్టిన లంకంత ఇల్లు | ABP DesamKondapochamma Sagar Tragedy | కొండపోచమ్మసాగర్ లో పెను విషాదం | ABP DesamNagoba Jathara Padayathra | ప్రారంభమైన మెస్రం వంశీయుల గంగాజల పాదయాత్ర | ABP DesamPawan Kalyan vs BR Naidu | టీటీడీ ఛైర్మన్ క్షమాపణలు కోరేలా చేసిన డిప్యూటీ సీఎం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sankranti 2025: సంక్రాంతి బండెక్కిన హైదరాబాద్‌- ఊరెళ్లే రహదారులన్నీ జామ్‌
సంక్రాంతి బండెక్కిన హైదరాబాద్‌- ఊరెళ్లే రహదారులన్నీ జామ్‌
CM Revanth Reddy: 'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
CM Chandrababu: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
Pawan Kalyan: 'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
Telangana News: భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక   
భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక  
Sankranti Traffic Jam: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
CM Chandrababu: సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Kondapochamma Sagar Dam: సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం - సాగర్ డ్యామ్‌లో పడి ఐదుగురు యువకుల దుర్మరణం, సెల్ఫీ కోసం ఒకరినొకరు పట్టుకుంటూ..
సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం - సాగర్ డ్యామ్‌లో పడి ఐదుగురు యువకుల దుర్మరణం, సెల్ఫీ కోసం ఒకరినొకరు పట్టుకుంటూ..
Embed widget