Weather Updates: వాయుగుండంగా మారిన అల్పపీడనం - ఏపీ, తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, కొన్నిచోట్ల వర్షాలు !
Low Pressure Prevail Over Andhra Pradesh: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
Low Tropospheric Southerly Winds Prevail Over Andhra Pradesh and Yanam: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముంద్రం మీదగా కేంద్రంగా ఉందని భారత వాతావరణ కేంద్రం, అమరావతి కేంద్రం తెలిపాయి. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కదులుతూ శనివారం తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ అల్పపీడనం మరింతగా బలపడింది. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతంలో నేడు (ఆదివారం) వాయుగుండంగా మారనుంది.
వాయుగుండం సోమవారం (మార్చి 21న) తుఫాన్‌గా తీవ్ర రూపం దాల్చనుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆ తరువాత ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మార్చి 22 ఉదయం నాటికి బంగ్లాదేశ్, దానిని అనుకుని ఉన్న ఉత్తర మయన్మార్ తీరానికి మార్చి 23న చేరుకుంటుంది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న వేడిగాలుతో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ వాతావరణం (Temperature in Andhra Pradesh), తెలంగాణలోనూ పొడిగా మారింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి గాలులు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఏపీ, యానాంలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తాంధ్ర యానాంలో..
అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో తీరం వెంట గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు వస్తాయి. మరో 24 గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గత రెండు వారాలుగా పెరుగుతున్న ఎండల నుంచి ఉత్తర కోస్తా, యానాం ప్రజలకు కాస్త ఊరట లభించనుంది. మత్స్యకారులు వేటకు వెళ్లడం ప్రమాదకరమని, గాలులు తీవ్రమైతే వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. గత మూడు రోజులతో పోలిస్తే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. .
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరణం పొడిగా మారుతుంది. అల్పపీడన ప్రభావం ఈ ప్రాంతాల్లో చాలా తక్కువ. రాయలసీమలో చలి గాలులు వేగంగా వేచనున్నాయి. మరో 24 గంటల్లో చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. బాపట్లలో 33 డిగ్రీలు, కావలిలో 35.3 డిగ్రీలు, మచిలీపట్నంలో 34.3 డిగ్రీలు, ఒంగోలులో 34.7 డిగ్రీలు, విశాఖపట్నంలో 33 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. వాయుగుండం ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయాయి.
Weather warning for Andhra Pradesh for next 5 days Dated 19.03.2022. pic.twitter.com/s9DsacAyho
— MC Amaravati (@AmaravatiMc) March 19, 2022
తెలంగాణ వెదర్ అప్‌డేట్
అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో తెలంగాణలో కొన్ని చోట్ల చిరు జల్లులు కురిశాయి. గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం(Heavy Rain) కురిసింది. సైదాబాద్, సంతోష్ నగర్ చంపా పేట, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, మలక్ పేటలలో భారీ వర్షం పడటంతో హైదరాబాద్ ఉష్ణోగ్రత కాస్త తగ్గడంతో నగరవాసులకు ఉపశమనం కలిగింది. ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మిర్యాలగూడలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాడిపోవడంతో వాతావరణంలో ఉక్కపోత ఎక్కువైంది. ఆదిలాబాద్‌లో 40.3 డిగ్రీలు, హైదరాబాద్‌లో 39 డిగ్రీలు, ఖమ్మంలో 36, నల్గొండలో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.