Cruise Ship Drugs Case: ముంబయి డ్రగ్స్ కేసులో షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్!
Cruise Ship Drugs Case: ముంబయి డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది ఎన్‌సీబీ.
Cruise Ship Drugs Case: ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది ఎన్సీబీ.
Cruise drug bust case | All the accused persons were found in possession of Narcotics except Aryan and Mohak, reads a statement of Sanjay Kumar Singh, DDG (Operations), NCB
— ANI (@ANI) May 27, 2022
ఆర్యన్‌తో పాటు మరో ఆరుగురికి ఈ కేసులో క్లీన్‌చిట్ లభించింది. షారుక్ ఖాన్ కుమారుడు అమాయకుడని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఎన్‌సీబీ పేర్కొంది.
ఇదీ కేసు
ముంబయి కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఆ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు గతేడాది అక్టోబర్‌లో అర్ధరాత్రి దాడులు జరిపారు. ఈ రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడే ఎన్సీబీ అధికారులకు అధిక మొత్తంలో కొకైన్ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు.
ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. వీరందరినీ ముంబయికి తీసుకొచ్చారు. అదుపులోకి తీసుకున్న వారిలో 8 నుంచి 10 మందిని విచారణ జరిపారు. ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరికి వైద్య పరీక్షలు కూడా జరిపించారు.
విచారణలో ఉన్న ఆర్యన్ ఖాన్‌కు త్వరగానే బెయిల్ లభిస్తుందని అంతా భావించారు. కానీ ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను పలుమార్లు కోర్టు కొట్టివేసింది. ఎట్టకేలకు బాంబే హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేసింది.
Also Read: Manjusha Neogi Death: కోల్‌కతాలో మరో మోడల్ మృతి- 2 వారాల్లో మూడో ఘటన!