By: ABP Desam | Updated at : 05 Nov 2021 12:57 PM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
భారత్‌లో తాజాగా 12,729 కరోనా కేసులను గుర్తించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఒకేరోజులో దేశంలో 221 మంది కరోనా సోకడం వల్ల మరణించినట్లుగా వివరించారు. దీంతో భారత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,333,754 కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య 4,59,873 కి ఎగబాకింది.
ఇక ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 1,48,922గా ఉందని హెల్త్ బులెటిన్‌లో వివరించారు. యాక్టివ్ కేసులు గత 253 రోజులతో పోలిస్తే అతి తక్కువగా నమోదయ్యాయని హెల్త్ బులెటిన్‌లో వివరించారు. అన్ని కేసుల్లో ఒకశాతం కూడా ప్రస్తుత యాక్టివ్ కరోనా కేసులు లేవని వివరించారు. ప్రస్తుతం 0.43 శాతంగా యాక్టివ్ కేసులు ఉన్నాయని, ఇది గతేడాది మార్చి నుంచి అతి తక్కువ అని పేర్కొన్నారు.
COVID19 | India reports 12,729 new cases, 221 deaths and 12,165 recoveries in the last 24 hours; active caseload stands at 1,48,922
Total Vaccination : 1,07,70,46,116 pic.twitter.com/4vwu5UEou5— ANI (@ANI) November 5, 2021
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) November 5, 2021
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/475eqcLzPp pic.twitter.com/stA2vkiVwX
దాదాపు 6,70,847 కరోనా పరీక్షలు దేశ వ్యాప్తంగా నిర్వహించామని అందులో నుంచి 12,729 కేసులను గుర్తించినట్లుగా వివరించారు. దీంతో గురువారం నాటికి మొత్తం చేసిన కరోనా పరీక్షల సంఖ్య 613,017,614 అని మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ వెల్లడించింది. గత 24 గంటల్లో 12,165 మంది డిశ్చార్జి కాగా.. మొత్తం రికవరీ అయిన వారి సంఖ్య 33,724,959 అని వెల్లడించారు.
వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇలా..
మరోవైపు వ్యాక్సినేషన్ కూడా దేశంలో శరవేగంగా సాగుతోంది. ఇప్పటిదాకా 1,077,046,116 డోసుల వ్యాక్సిన్‌ను ప్రజలకి అందించారు. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా కేరళలోనే నమోదవుతున్నట్లుగా కరోనా బులెటిన్‌లో వివరించారు. తాజాగా అక్కడ 7 వేలకు పైచిలుకు కేసులను గుర్తించారు.
MLA Food: దళిత వ్యక్తి నోట్లోని అన్నం తీయించి ఎంగిలి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే - వీడియో వైరల్
PM Modi Arrives In Tokyo: జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా
PM Modi: థామస్ కప్ గెలిచిన టీంతో ప్రధాని చిట్‌చాట్- దేశం గర్వపడేలా చేశారని కితాబు
NTR: ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్లో వంశీ పైడిపల్లి - క్రేజీ రూమర్స్ షురూ
Hyderabad Honour Killing Case: అవమానం తట్టుకోలేని సంజన ఫ్యామిలీ, పక్కా ప్లాన్‌తో నీరజ్ పరువు హత్య - రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు ఇవే
Pranitha Subhash: అమ్మ కావడమే వరం, బేబీ బంప్‌తో ప్రణీత ఫోటోషూట్
Spirituality: భోజనం చేస్తున్నప్పుడు అన్నంలో వెంట్రుకలు వచ్చాయా, విమర్శిస్తూ భోజనం చేస్తున్నారా, ఈ విషయాలు తెలుసుకోండి