Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
Covid 19 Vaccines Gap Between Doses: కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటున్న వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెండో డోసు, మూడో డోసుకు మధ్య గ్యాప్‌ను తగ్గించారు.
Covid 19 Vaccines Gap Between Doses: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ 19 వ్యాక్సిన్ డోసుల మధ్య కాల వ్యవధిని తగ్గించారు. కరోనా వ్యాక్సిన్ రెండో డోసు, మూడో డోసుకు మధ్య కాల వ్యవధిని 9 నెలల నుంచి 90 రోజులకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొవిన్ యాప్ (COWIN App)లో మార్పులు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
బీఎంసీ పరిధిలోని అన్ని ప్రైవేట్ & ప్రభుత్వ టీకా కేంద్రాలకు వ్యాక్సిన్ కోసం ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే అంతర్జాతీయ ప్రయాణం చేయాల్సిన వ్యక్తులకు మాత్రమే కరోనా వ్యాక్సిన్ రెండో, మూడో డోసుల మధ్య తగ్గించిన గ్యాప్ టైమ్ వర్తిస్తుందని బీఎంసీ స్పష్టం చేసింది.
Centre govt has approved to decrease gap b/w 2nd & 3rd dose of Covid vaccines from 9 months to 90 days. Cowin app has also been modified. Orders are issued for all private & govt vaccination centres under BMC's jurisdiction. Only for people needing to do international travel: BMC
— ANI (@ANI) May 17, 2022
Covid Update: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. 28 రోజుల తర్వాత కేసులు 2వేలకు దిగువనే నమోదయ్యాయి. కొత్తగా 1,579 కరోనా కేసులు నమోదుకాగా 19 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 4,31,25,370కి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 16,400కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా తాజాగా 10.78 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌లు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 191 కోట్ల 48 లక్షల 94 వేలు దాటింది. ఒక్కరోజే 3 లక్షల 57 వేల 484 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
Also read: గర్భంతో ఉన్నప్పుడు ఈ మందులు వాడితే ఎంత ప్రమాదమో తెలుసా? వీలైనంత వరకు వాడకపోతేనే మంచిది