Contempt Case: విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టు షాక్- 4 నెలల జైలు శిక్ష, రూ.2 వేలు ఫైన్!
Contempt Case: విదేశాలకు పరారైన బిజినెస్ మ్యాన్ విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Contempt Case: కింగ్‌ఫిషర్ యజమాని విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. రూ.9 వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగవేసి విదేశాలకు పరారైన మాల్యాకు కోర్టు ధిక్కార కేసులో నాలుగు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. రూ. 2వేల జరిమానా కూడా విధించింది.
Supreme Court awards 4-month jail sentence and imposes Rs 2000 fine on fugitive businessman Vijay Mallya who was found guilty of contempt of court in 2017 for withholding information from the court pic.twitter.com/Z8zP5P8qdf
— ANI (@ANI) July 11, 2022
కోర్టు ధిక్కారం
విజయ్ మాల్యా కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తేల్చింది. 2017లో కర్ణాటక హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి విదేశాల్లో ఉన్న తన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా, కుమార్తెలు లియానా మాల్యా, తాన్యా మాల్యాలకు 40 మిలియన్ డాలర్లను ఎస్‌బీఐ బ్యాంక్ నుంచి మాల్యా బదిలీ చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా నగదు బదిలీ చేశారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయాన్ని కోర్టు వద్ద దాచినట్లు సుప్రీం కోర్టు తేల్చింది.
In 2017, Supreme Court had held Mallya guilty of contempt of court for withholding information from the court about transferring USD 40 million to his children in violation of the court's order
— ANI (@ANI) July 11, 2022
వడ్డీతో సహా
దీంతో 40 మిలియన్ డాలర్లు (సుమారు రూ.317 కోట్లు) వడ్డీతో సహా విజయ్ మాల్యా డిపాజిట్ చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లోపు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అలా చేయకపోతే మాల్యా ఆస్తులను జప్తు చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రస్తుతం మాల్యా.. విదేశాల్లో తలదాచుకుంటున్నారు.
Also Read: Covid Update: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు- 26 మంది మృతి
Also Read: Tamilnadu Politics: పన్నీర్ సెల్వంకు కోర్టు షాక్! జనరల్ మీటింగ్‌కు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్