Priyanka In wayanad: వయనాడ్‌లో నామినేషన్ వేసిన ప్రియాంక- ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి
Wayanad Lok Sabha Bypoll: వయనాడ్ ఎంపీ స్థానానికి జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక పోటీ చేస్తున్నారు. ఇవాళ ఆమె తన నామినేషన్ వేశారు.
Wayanad Lok Sabha Bypoll: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ తన నామినేషన్ ఇవాళ ఫైల్ చేశారు. మంగళవారం రాత్రి తన తల్లి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కలిసి వయనాడ్ చేరుకున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆమె వెంట ఉన్నారు.
నామినేషన్ దాఖలు చేసే ముందు ప్రియాంక గాంధీ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వయనాడ్ ప్రజలను తన ఫ్యామిలీ మెంబర్స్‌గా చేసుకునేందుకు తాను వచ్చానంటూ చెప్పుకొచ్చారు. ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రయాణం వాయనాడ్ ఉప ఎన్నిక నుంచి ప్రారంభంకానుంది.
"ఇది కొత్త ప్రారంభం"
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, వయనాడ్ నియోజకవర్గం అభ్యర్థి ప్రియాంక గాంధీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. '35 ఏళ్ల తర్వాత తొలిసారిగా మీ మద్దతు కోరేందుకు వచ్చాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మీకు గుర్తింపు తెచ్చే బాధ్యత నాది. 8 వేల కిలోమీటర్లు ప్రయాణించి మీ వద్దకు వచ్చాను.ఇది నా కొత్త ప్రారంభం, మీరు నా మార్గదర్శి అని నాకు తెలుసు."
రోడ్ షోకు తరలి వచ్చిన జనం
#WATCH | Kerala: Congress leader Priyanka Gandhi Vadra files her nomination for Wayanad parliamentary by-election, in the presence of CPP Chairperson Sonia Gandhi, Congress President Mallikarjun Kharge, Leader of Opposition Rahul Gandhi and Congress general secretary KC… pic.twitter.com/ykU6ljJkrm
— ANI (@ANI) October 23, 2024
వాయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ప్రియాంక గాంధీ వాద్రా కల్పేటలో రోడ్‌షో నిర్వహించారు. ఇందులో యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ (యుడిఎఫ్) నాయకులు, కార్యకర్తలతో సహా భారీగా జనం తరలివచ్చారు.
#WATCH | Kerala: Addressing a public rally in Wayanad, Congress candidate Priyanka Gandhi Vadra says, "These values (truth and non-violence) moved my brother to walk 8000 km across India for love and unity... He could not have done that without your support... You stood with my… pic.twitter.com/nv8gbsP8Mu
— ANI (@ANI) October 23, 2024
రోడ్‌షోలో ప్రియాంకతోపాటు ఆమె భర్త రాబర్ట్ వాద్రా, సీనియర్ కాంగ్రెస్, ఐయూఎంఎల్ నేతలు ఉన్నారు. ఉదయం నుంచి వేచి ఉన్న యుడిఎఫ్ కార్యకర్తలు, మద్దతుదారులు, సాధారణ ప్రజలు ప్రియాంక, రాహుల్ గాంధీల చిత్రాలు, పార్టీ రంగుల బెలూన్లతో డప్పులు కొడుతూ ఆమెకు స్వాగతం పలికారు.
#WATCH | Kerala: Addressing a public rally in Wayanad, Congress candidate Priyanka Gandhi Vadra says, "It has been 35 years that I have been campaigning for different elections. This is the first time I am campaigning for your support for myself..."
— ANI (@ANI) October 23, 2024
(Source: Indian National… pic.twitter.com/wq6Up4s3Fh
బీజేపీ తరపున నవ్య హరిదాస్ పోటీ
లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్)కి చెందిన సత్యన్ మొకేరి, బిజెపి నుంచి నవ్య హరిదాస్‌పై ప్రియాంక పోటీ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని వయనాడ్, రాయ్‌బరేలీ స్థానాల నుంచి గెలుపొందారు. ఆ తర్వాత రాహుల్ వాయనాడ్ స్థానాన్ని వదిలిపెట్టారు. రాహుల్ వాయనాడ్ సీటును వదులుకోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.
"Wayanad has two MPs": Rahul Gandhi after Priyanka files nomination for by polls
Read @ANI Story | https://t.co/h0SRa1cv6A#WATCH | Kerala: Addressing a public rally in Wayanad, Lok Sabha LoP and Congress leader Rahul Gandhi says, "Wayanad is the constituency in the country that has two Members of Parliament... One is the official and the other is the unofficial MP..." pic.twitter.com/qLZCIlJjlj
src=hash&ref_src=twsrc%5Etfw">#RahulGandhi #Congress #Wayanad pic.twitter.com/40Jcgk73Ed— ANI Digital (@ani_digital) October 23, 2024