తిరుపతి వెంకన్నను దర్శించుకున్న ఇస్రో సైంటిస్ట్‌లు, చంద్రయాన్ 3 సక్సెస్ అవ్వాలని పూజలు
Chandrayaan-3 Mission: చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ అవ్వాలని సైంటిస్ట్‌లు తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకున్నారు.
Chandrayaan-3 Mission:
చంద్రయాన్ 3 కి కౌంట్‌డౌన్ మొదలు
చంద్రయాన్ 3 మిషన్‌కి మరి కొద్ది గంటలే మిగిలి ఉన్నాయి. దేశమంతా ఈ ప్రయోగంపై చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. చంద్రయాన్ 2 ఫెయిల్ అవ్వడం వల్ల చంద్రయాన్ 3ని ఛాలెంజ్‌గా తీసుకుంది ఇస్రో. ఈ సారి కచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమాతో ఉన్నారు సైంటిస్ట్‌లు. ఈ క్రమంలోనే తిరుపతి ఆలయాన్ని సందర్శించారు. చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ కావాలని వెంకన్న స్వామిని కోరుకున్నారు. చంద్రయాన్ 3కి సంబంధించిన మినియేచర్ మోడల్‌ని తమతో పాటు తీసుకొచ్చారు. వెంకన్న సన్నిధిలో ఉంచి ప్రార్థనలు చేశారు. మొత్తం 8 మంది సైంటిస్ట్‌లు తిరుపతి బాలాజీని సందర్శించుకున్నారు. ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ శ్రీ చెంగలమ్మ ఆలయం వద్ద ప్రార్థనలు చేశారు. అనుకున్నట్టుగా ఈ మిషన్ సక్కెస్ అవ్వాలని, చంద్రుడిపై సేఫ్‌గా ల్యాండ్ అవ్వాలని కోరుకున్నారు.
"చంద్రయాన్ 3 ప్రయాణం త్వరలోనే మొదలవనుంది. అంతా సరిగానే జరుగుతుందని విశ్వసిస్తున్నాం. అనుకున్నట్టుగానే ఆగస్టు 23వ తేదీన చంద్రుడిపై అది ల్యాండ్ అవుతుందని అనుకుంటున్నాం"
- ఎస్ సోమనాథ్, ఇస్రో ఛైర్మన్
#WATCH | Andhra Pradesh | A team of ISRO scientists team arrive at Tirupati Venkatachalapathy Temple, with a miniature model of Chandrayaan-3 to offer prayers.
— ANI (@ANI) July 13, 2023
Chandrayaan-3 will be launched on July 14, at 2:35 pm IST from Satish Dhawan Space Centre, Sriharikota, ISRO had… pic.twitter.com/2ZRefjrzA5
ఇక చంద్రయాన్ 3 మిష్ కౌంట్ డౌన్ మొదలు కానుంది. దాదాపు 26 గంటల పాటు ఇది కొనసాగుతుంది. ఇప్పటికే లాంఛింగ్ రిహార్సల్ చేపట్టింది ఇస్రో.
#WATCH | "This is Chandrayaan-3 --- our mission to the moon...We have a launch tomorrow," says the team of ISRO scientists after offering prayers at Tirupati Venkatachalapathy Temple in Andhra Pradesh. pic.twitter.com/xkQb1SuX4V
— ANI (@ANI) July 13, 2023
గతంలో నిర్వహించిన చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైంది. దీంతో చంద్రయాన్ -3 ని ఫెయిల్యూర్ బేస్ట్ అప్రోచ్ తో అభివృద్ధి చేశామని సోమనాథ్ చెప్పారు. చంద్రయాన్-2 ను సక్సెస్ బేస్డ్ మోడల్ లో రూపొందించారు. చంద్రయాన్ -3 ని మాత్రం ఫెయిల్యూర్ ఆధారిత డిజైన్ తో అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ఒకరకంగా చెప్పాలంటే చంద్రయాన్-2 ప్రయోగాన్ని సక్సెస్ కావాలనే ఉద్దేశంతో అభివృద్ధి చేయగా.. చంద్రయాన్-3 ప్రయోగాన్ని మాత్రం ఫెయిల్ కావొద్దు అనే ఉద్దేశంతో అభివృద్ధి చేసినట్లన్నమాట. ఫెయిల్యూర్ బేస్ట్ అప్రోచ్ లో ఏదైనా వ్యవస్థ విఫలమైతే.. దాన్ని ఎలా రక్షించాలనే విధానంలో డిజైనింగ్ ఉంటుంది అని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పుకొచ్చారు.
Also Read: చంద్రయాన్ 3 మిషన్‌లో ఆ పావుగంటే కీలకం, ఆ గండం దాటితే సక్సెస్ అయినట్టే!