చంద్రయాన్ 3 మిషన్‌లో ఆ పావుగంటే కీలకం, ఆ గండం దాటితే సక్సెస్ అయినట్టే!
Chandrayaan 3: చంద్రయాన్ 3 ప్రయోగంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
Chandrayaan 3 Launch:
జులై 14న చంద్రయాన్ 3
ఇస్రో చేపట్టనున్న చంద్రయాన్ 3 మిషన్ (Chandrayaan 3 Mission)పై అంచనాలు పెరుగుతున్నాయి. దేశమంతా ఈ ప్రయోగంపై ఆసక్తి చూపిస్తోంది. జులై 14వ తేదీన మధ్యాహ్నం 2.35 నిముషాలకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం చేపట్టనుంది ఇస్రో. చంద్రయాన్ 2కి ఇది కొనసాగింపు అని ఇప్పటికే వెల్లడించింది. 2019 సెప్టెంబర్‌లో చంద్రయాన్ 2 (Chandrayaan 2) ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. అయితే...ఆన్‌బోర్డ్ కంప్యూటర్, ప్రపల్షన్ సిస్టమ్‌లలో లోపాల కారణంగా అది సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వలేదు. చంద్రుడి ఉపరితలంపై అది క్రాష్ అయింది. ఆ ప్రాజెక్ట్‌లో తలెత్తిన సమస్యల్ని గుర్తించిన సైంటిస్ట్‌లు ఆ సవాళ్లను అధిగమించేలా చంద్రయాన్ 3ని తెరపైకి తీసుకొచ్చారు. సేఫ్ ల్యాండింగ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
మిషన్ లక్ష్యాలేంటి..?
1. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌గా ల్యాండ్ అయ్యేలా చేయడం
2. రోవర్ సరైన విధంగా చంద్రుడిపై తిరిగేలా చేయడం
3.సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్స్
Chandrayaan-3 mission:
— ISRO (@isro) July 11, 2023
The ‘Launch Rehearsal’ simulating the entire launch preparation and process lasting 24 hours has been concluded.
Mission brochure: https://t.co/cCnH05sPcW pic.twitter.com/oqV1TYux8V
2020 నుంచే ప్లానింగ్..
2020 జనవరిలో ఇస్రో తొలిసారి చంద్రయాన్ 3పై ప్రకటన చేసింది. డిజైన్‌పై పని చేస్తున్నామని, త్వరలోనే స్పేస్‌క్రాఫ్ట్ అసెంబ్లింగ్ పూర్తవుతుందని అప్పట్లో వెల్లడించింది. చంద్రయాన్ 2 కన్నా పకడ్బందీదా దీన్ని డిజైన్ చేశారు. ముఖ్యంగా ల్యాండర్ లెగ్స్‌ని మరింత దృఢంగా తయారు చేశారు. నిజానికి 2021లోనే ప్రయోగించాలని భావించినా కొవిడ్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక సెకండ్ వేవ్ వల్ల మరింత జాప్యం జరిగింది. అప్పటికే ప్రపల్షన్ సిస్టమ్ టెస్టింగ్ పూర్తైంది. ఇన్ని రోజుల తరవాత జులై 14న లాంఛ్ చేస్తామని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. Launch Vehicle Mark 3 ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ల్యాండర్, రోవర్ మాడ్యూల్ వేరువేరుగా ఉన్న ఈ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి సౌత్ పోల్‌కి సమీపంలో ల్యాండ్ అవ్వనుంది. ఒక లూనార్ డే (Lunar Day) అంటే మన భూమిపై 14 రోజుల పాటు అక్కడ ఆపరేట్ అవుతుంది. చంద్రయాన్ 2 ట్రాజెక్టరీలోనే చంద్రయాన్ 3 కూడా కొనసాగుతుంది. ప్రపల్షన్ మాడ్యూల్ భూమి చుట్టూ పలుసార్లు తిరిగి చంద్రుడిపై దిగుతుంది. చంద్రుడిపై గ్రావిటీకి తగ్గట్టుగా మాడ్యూల్ మెల్లగా కిందకు దిగుతుంది. ల్యాండర్ విడిపోతుంది. లాంఛ్ అయినప్పటి నుంచి సరిగ్గా నెల రోజుల తరవాత చంద్రుడిపై మాడ్యూల్ దిగుతుంది. ఇస్రో అంచనాల ప్రకారం ఆగస్టు 23-24 వ తేదీల్లో అది ల్యాండ్ అవుతుంది.
ఆ పావుగంటే కీలకం..
అయితే..చంద్రుడిపై సన్‌రైజ్ ఎలా ఉందన్న దానిపైనే ల్యాండింగ్ ఎప్పుడవుతుందన్నది ఆధారపడి ఉంటుంది. సన్‌రైజ్‌లో ఆలస్యం జరిగితే..ల్యాండింగ్ కూడా లేట్ అవుతుంది. అదే జరిగితే...ఇస్రో ల్యాండింగ్‌ని సెప్టెంబర్‌కి రీషెడ్యూల్ చేస్తుంది. కానీ...ఈ మిషన్‌లో అసలైన క్రూషియల్ పాయింట్ ఇదే. ల్యాండింగ్‌కి కనీసం 15 నిముషాల సమయం పడుతుంది. అందుకే...ఇస్రో మాజీ ఛైర్‌పర్సన్ కే శివన్ "15 మినిట్స్ ఆఫ్ టెర్రర్" అని డిఫైన్ చేశారు. ఒక్కసారి సేఫ్‌గా ల్యాండ్ అయిన తరవాత ల్యాండర్ (Vikram) నాలుగు సైంటిఫిక్ పేలోడ్స్‌ని ( scientific payloads) చంద్రుడి ఉపరితలంపై డిప్లాయ్ చేస్తుంది. అవే చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులను స్టడీ చేస్తాయి. ఈ మాడ్యూల్‌లో Spectro-polarimetry of HAbitable Planet Earth (SHAPE) పరికరం అమర్చి ఉంటుంది. భూమి ఎంత కాంతిని రిఫ్లెక్ట్ చేస్తుంది..? ఎంత ఎమిట్ చేస్తోంది..? అనే డేటాని ఈ పరికరం సేకరిస్తుంది. ఇక రోవర్ ప్రగ్యాన్ (Pragyan Rover) కెమికల్ టెస్ట్‌ల ద్వారా లూనార్ సర్‌ఫేస్‌పై పరిశోధనలు చేపడుతుంది.
Also Read: Amogh Lila Das: అమోఘ్ లీలాదాస్ ఏమన్నారు? ఇస్కాన్ ఎందుకు నిషేధించింది?