By: Ram Manohar | Updated at : 31 Aug 2023 06:14 PM (IST)
సెప్టెంబర్ 18-22 వరకూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.
Parliament Special Session:
ప్రత్యేక సమావేశాలు..
పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టారు.
"A special Session of Parliament (13th Session of 17th Lok Sabha and 261st Session of Rajya Sabha) is being called from 18th to 22nd September having 5 sittings," tweets Parliamentary Affairs Minister Pralhad Joshi pic.twitter.com/7nyRfZUAHF
— ANI (@ANI) August 31, 2023
"సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం. అమృత్ కాల్లో భాగంగా పార్లమెంట్లో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని భావిస్తున్నాం"
- ప్రహ్లాద్ జోషి, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి
ఆ బిల్స్ కోసమేనా..?
ఉన్నట్టుండి ఈ ప్రకటన చేయడం వెనక కారణమేంటన్న చర్చ మొదలైంది. విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ ప్రత్యేక సమావేశాల్లో దాదాపు 10 కీలక బిల్స్‌ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది మోదీ సర్కార్. వీటిని కచ్చితంగా పాస్ చేసి ఆమోదం పొందేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, అందుకే ఈ బిల్స్ కోసమే ఈ స్పెషల్ సెషన్ పెడుతోందని సమాచారం. జులై 20 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకూ వర్షాకాల సమావేశాలు జరిగాయి. మణిపూర్ అంశంపై రెండు సభలు దద్దరిల్లాయి. విపక్షాలు మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. దాదాపు రెండు వారాల పాటు ఈ తీర్మానంపై పార్లమెంట్లో వాగ్వాదం జరిగింది. ప్రధాని మోదీ మణిపూర్ అంశంపై చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుపట్టాయి. ఆ మేరకు ప్రధాని మోదీ సభకు హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించారు. విపక్షాలపై సెటైర్లు వేశారు. మణిపూర్‌పైనా ప్రకటన చేశారు. మొత్తానికి ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మోదీ సర్కార్ నెగ్గింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన సమావేశాలు కావడం వల్ల ఇంకాస్త వాడివేడి చర్చలు జరిగాయి. కానీ...ఇప్పుడు ఉన్నట్టుండి ప్రత్యేక సమావేశాలకు పిలుపునివ్వడంపై ఆసక్తి పెరుగుతోంది.
మోదీ స్పీచ్‌పై రాహుల్ అసహనం..
ప్రధాని మోదీ అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సహా విపక్ష కూటమిపై విమర్శలు చేశారు. ముఖ్యంగా రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. మణిపూర్ అంశంపైనా ప్రకటన చేశారు. మోదీ స్పీచ్‌ని ఇప్పటికే విపక్షాలు ఖండించగా...ఇప్పుడు రాహుల్ స్పందించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ప్రధానిపై విమర్శలు చేశారు. మణిపూర్ మంటల్లో తగలబడిపోతున్నా...మోదీ వాటిని చల్లార్చే ప్రయత్నం చేయడం లేదని అన్నారు. మణిపూర్‌లో భరత మాతను హత్య చేశారన్న వ్యాఖ్యలపై దుమారం రేగినప్పటికీ...అవే వ్యాఖ్యల్ని మరోసారి చేశారు రాహుల్. ఎంతో ఆవేదనతో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని వివరించారు. రెండు గంటల పాటు ప్రసంగించిన ప్రధాని...జోక్‌లు వేయడం, నవ్వడం తప్ప మరేమీ చేయలేదని విమర్శించారు. మణిపూర్‌లో హింసను ఎలా అదుపులోకి తీసుకురావాలన్నదే అసలైన చర్చ అని...అది తప్ప అన్నీ మాట్లాడారని అసహనం వ్యక్తం చేశారు.
Also Read: అదానీ వ్యవహారంలో విచారణే జరగలేదు, ప్రధాని మోదీ అడ్డుకున్నారు - రాహుల్ ఆరోపణలు
Jaahnavi Kandula: జాహ్నవి కందులను హేళన చేసిన అధికారి సస్పెండ్, వెల్లడించిన సియాటెల్ పోలీసులు
GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!
Law Commission: లైంగిక కార్యకలాపాల సమ్మతి వయస్సును 16 ఏళ్లకు తగ్గించవద్దు, కేంద్రానికి లా కమిషన్ నివేదిక
Bank CEO Quits: క్యాబ్ డ్రైవర్ అకౌంట్లోకి 9వేల కోట్లు - ఆ బ్యాంకు సీఈవో రాజీనామా!
Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
/body>