Centre on Covid19: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గమనిక.. ఇప్పటి నుంచి నో బయోమెట్రిక్.. ఎప్పటి వరకు అంటే
దేశంలో కొవిడ్ విజృంభిస్తున్న వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
మళ్లీ దేశంలో కరోనా విజృంభిస్తోంది. అయితే బయోమెట్రిక్ విధానం వలన.. వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని రద్దు చేస్తున్నామని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. ఇప్పటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని.. మళ్లీ తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు అమలులోనే ఉంటుందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వ సారథ్యంలో ఉద్యోగుల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
కిందటి సంవత్సరం సైతం.. కరోనా ఉద్ధృతి కారణంగా.. ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా బయోమెట్రిక్ హాజరు విధానం నుంచి మినహాయింపునిచ్చారు. అయితే కొన్ని రోజుల తర్వాత.. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గతేడాది నవంబర్ 8 నుంచి అన్ని స్థాయిల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేశారు. అంతేగాకుండా.. బయోమెట్రిక్ యంత్రాల పక్కన శానిటైజర్లు కూడా ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఆఫీసుకు వచ్చే.. ఉద్యోగులు హాజరుకు ముందు, డ్యూటీ అయిపోయిన తర్వాత చేతులను శుభ్రపరచుకునేలా ఆదేశాలు ఇచ్చారు. దేశంలో మళ్లీ కరోనా విజంభిస్తున్న కారణంగా... బయోమెట్రిక్ హాజరు విధానం నుంచి మరోసారి మినహాయింపు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.
'దేశంలో కొవిడ్ 19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. ప్రభుత్వ ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరును సస్పెండ్ చేస్తున్నాం. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు.. బయోమెట్రిక్ హాజరుపై ఇచ్చిన ఆదేశాలు అమల్లో ఉంటాయి.' అని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.
Also Read: COVID Vaccine: పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ప్రారంభం.. మీరు కూడా ఇలా రిజిస్ట్రేషన్ చేస్కోండి
Also Read: Omicron Cases in India: ఓవైపు ఒమిక్రాన్ దడ.. మరోవైపు కరోనా కలవరం.. కొత్తగా 33 వేల కేసులు
Also Read: Doctors Test Covid Positive: కరోనా హై అలర్ట్.. మొత్తం 157 మంది వైద్యులకు పాజిటివ్
Also Read: Children's Covid Vaccination: తొలి రోజే 12.3 లక్షల మంది పిల్లలకు కరోనా వ్యాక్సిన్
Also Read: Corona Updates: ఏపీలో కొత్తగా 122 కోవిడ్ కేసులు, ఒకరు మృతి