Doctors Test Covid Positive: కరోనా హై అలర్ట్.. మొత్తం 157 మంది వైద్యులకు పాజిటివ్
బంగాల్, బిహార్‌లో కలిపి మొత్తం 157 మంది వైద్యులు, నర్సులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.
బంగాల్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. తాజాగా కోల్‌కతాలోని నీల్ రతన్ సిర్కర్ మెడికల్ కళాశాల, ఆసుపత్రిలో 70 మంది వైద్యులు, నర్సులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.
#BREAKING | कोलकाता के NRS अस्पताल में 70 डॉक्टर और नर्स कोरोना संक्रमित@romanaisarkhan @pratimamishra04 @Kuntalch#COVID19 #Coronavirus #Kolkata #Doctors pic.twitter.com/jF4BqxVcv8
— ABP News (@ABPNews) January 3, 2022
మరోవైపు..
బిహార్ పట్నాలోని నలంద వైద్య కళాశాల, ఆస్పత్రిలో(ఎన్ఎంసీహెచ్) 87 మంది వైద్యులు కూడా కరోనా బారినపడడం కలకలం సృష్టించింది. ఇటీవల జరిగిన భారతీయ వైద్యుల సంఘం(ఐఎంఏ) 96వ జాతీయ వార్షిక సదస్సే ఈ వ్యాప్తికి కారణమైనట్లు తెలుస్తోంది.
వీరిలో చాలా మందికి లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. మరికొంతమందికి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. వీరంతా ఆస్పత్రి క్యాంపస్‌లో ఐసొలేషన్‌లో ఉన్నట్లు పట్నా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు.
ఎన్ఎంసీహెచ్లో మొత్తం 194 నమూనాలకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా అందులో శనివారం 12 మందికి కరోనా సోకినట్లు తేలగా మరో 75 మందికి ఆదివారం వైరస్ నిర్ధరణ అయింది.
ఆంక్షలు..
ఒమిక్రాన్, కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. బంగాల్ సర్కార్ కూడా నేటి నుంచి రెండు వారాల పాటు ఆంక్షలు విధించింది.
ఇవే ఆంక్షలు..
- పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు అన్నింటినీ వెంటనే మూసివేయాలి. 50 శాతం ఉద్యోగులతో అధికారిక కార్యకలాపాలు మాత్రమే నిర్వహించాలి.
- ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ 50% ఉద్యోగులతోనే పనిచేయాలి. వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని వీలైనంత ఎక్కువ వినియోగించాలి.
- స్విమ్మింగ్ పూల్స్, స్పాస్, జిమ్‌లు, బ్యూటీ పార్లర్లు, సెలూన్లు వంటి వాటిని మూసివేయాలి.
- ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, జూలు, పర్యటక ప్రాంతాలను మూసివేయాలి.
- షాపింగ్ మాల్స్, మార్కెట్ ప్రాంతాలు 50 శాతం కంటే ఎక్కువ మంది వినియోగదారులు లేకుండా నడపాలి. రాత్రి 10 వరకు మాత్రమే వీటికి అనుమతి.
- రెస్టారెంట్లు, బార్లు 50% సామర్థ్యంతో రాత్రి 10 గంటల వరకు నడపాలి.
- సనిమా హాళ్లు, థియేటర్లు 50% సీటింగ్ సామర్థ్యంతో నడుపుకోవచ్చు. వీటికి కూడా రాత్రి 10 గంటల వరకే అనుమతి.
- సమావేశాలు నిర్వహించుకోవాలంటే 200 మంది కంటే ఎక్కువ మంది ఉండకూడదు. లేదా 50 శాతం సామర్థ్యాన్ని మించకూడదు.
- ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో 50 మంది కంటే ఎక్కువ ఉండకూడదు.
- వివాహం సహా సంబంధిత ఫంక్షన్లలో 50 మంది కంటే ఎక్కువ ఉండకూడదు.
- అంతిమయాత్ర, అంత్యక్రియలకు 20 మంది కంటే ఎక్కువ మంది వెళ్లకూడదు.
- లోకల్ ట్రైన్లు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో రాత్రి 7 గంటల వరకు మాత్రమే నడపాలి.
- మెట్రో సర్వీసులు మాత్రం 50% సీటింగ్ సామర్థ్యంతో ప్రస్తుత ఉన్న సమయం వరకు నడుపుకోవచ్చు.
- రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు ఎలాంటి ప్రజా, ప్రైవేట్ రవాణాకు అనుమతి లేదు. అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తారు.
Also Read: WHO on Covid 19: 2022లో కొవిడ్ అంతం.. కానీ అలా చేస్తేనే సాధ్యం: డబ్ల్యూహెచ్ఓ
Also Read: Omicron Cases in India: ఓవైపు ఒమిక్రాన్ దడ.. మరోవైపు కరోనా కలవరం.. కొత్తగా 33 వేల కేసులు