అన్వేషించండి

Bihar Political Crisis: తొమ్మిదోసారి సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం, బిహార్‌లో కొలువు దీరిన కొత్త ప్రభుత్వం

Bihar Political Crisis: బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Nitish Kumar Swearing: 9వ సారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహాఘట్‌బంధన్‌ నుంచి బయటకు వచ్చిన నితీశ్...బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతకు ముందు గవర్నర్‌కి తన రాజీనామా లేఖ సమర్పించారు. ఆ తరవాత బీజేపీ మద్దతునిస్తూ ప్రకటించిన లేఖని ఆయనకు అందించారు. ఈ రెండు లేఖలనీ గవర్నర్ ఆమోదించడం వల్ల ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. నితీశ్ కుమార్‌తో పాటు సామ్రాట్ చౌదరి డిప్యుటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో బీజేపీ నేత విజయ్ సిన్హా కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ తరపున బిజేంద్ర ప్రసాద్ యాదవ్‌, శ్రవణ్ కుమార్‌ మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు. మొత్తం 8 మందిని మంత్రులుగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. 

ప్రధాని అభినందనలు..

బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. బిహార్‌లో NDA ప్రభుత్వం ఏర్పాటు కావడం సంతోషంగా ఉందని, రాష్ట్ర అభివృద్ధికి ఇది బాటలు వేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం నడుచుకుంటుందని తెలిపారు.

"బిహార్‌లో NDA ప్రభుత్వం ఏర్పాటు కావడం ఆనందంగా ఉంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం నడుచుకుంటుంది. రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా పని చేస్తుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్‌ కుమార్‌కి అభినందనలు"

- ప్రధాని నరేంద్ర మోదీ

మహాఘట్‌బంధన్‌లో చాలా సమస్యలున్నాయని, మునుపటి బలం ఆ కూటమిలో కనిపించడం లేదని రాజీనామా తరవాత తేల్చి చెప్పారు నితీశ్ కుమార్. అందుకే బయటకు రావాల్సి వచ్చిందని వెల్లడించారు. అటు I.N.D.I.A కూటమిపైనా విమర్శలు చేశారు. కూటమి ఏర్పాటైందనే తప్ప ఎవరూ ఏమీ చేయడం లేదని మండి పడ్డారు. మాట్లాడుకోడమూ మానేశామని తెలిపారు. ఈ కారణాల వల్లే కూటమి నుంచి బయటకు వచ్చినట్టు స్పష్టం చేశారు. 

"ప్రస్తుతానికి నేను అనవసరమైన వ్యాఖ్యలు చేయలేను. కానీ మహాఘట్‌బంధన్‌లో చాలా సమస్యలున్నాయి. ఏదీ సరిగా లేదు. ఈ విషయంలో చాలా మంది నేతలు నన్ను ప్రశ్నించారు. సలహాలు, సూచనలు ఇచ్చారు. వాళ్లందరి అభిప్రాయాలు తీసుకున్నాను. ఆ తరవాతే రాజీనామా చేశాను"

- నితీశ్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి 

Also Read: Bihar Political Crisis: నితీశ్‌ జీ అసలు ఆట ముందుంది, 2024లో JDU కథ కంచికే - తేజస్వీ యాదవ్

టాప్ హెడ్ లైన్స్

Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. కమిషన్‌లో సభ్యులు ఎవరు?.. నియామకం, అధికారాలు ఇలా పూర్తి వివరాలు!
డీలిమిటేషన్ బిల్లు 2026.. కమిషన్‌లో సభ్యులు ఎవరు?.. నియామకం, అధికారాలు ఇలా పూర్తి వివరాలు!
Delimitation Bill: నియోజకవర్గాల పునర్ విభజన బిల్లుకు PM Modi Cabinet ఆమోదం, 50 శాతం లోక్‌సభ సీట్ల పెంపు!
నియోజకవర్గాల పునర్ విభజన బిల్లుకు PM Modi Cabinet ఆమోదం, 50 శాతం లోక్‌సభ సీట్ల పెంపు!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
Top 5 Road Trips in India : రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? బైక్, కారుపై వెళ్లేందుకు ఇండియాలో టాప్ 5 బెస్ట్ ప్లేస్​లు ఇవే
రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? బైక్, కారుపై వెళ్లేందుకు ఇండియాలో టాప్ 5 బెస్ట్ ప్లేస్​లు ఇవే

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Elections: రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Komatireddy Financial Help: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
Comedy Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
AP Cabinet Decisions: 36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
రూ.36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
Jagapathi Babu : వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
Sunil Gavaskar Angry:  రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
Embed widget