Bihar Terror Module: ప్రధాని మోదీ లక్ష్యంగా భారీ ఉగ్రకుట్ర- ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్
Bihar Terror Module: ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా చేసిన భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు.
Bihar Terror Module: ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్‌గా పన్నిన ఉగ్ర కుట్రను పోలీసులు ఛేదించారు. ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 12న ప్రధాని మోదీ బిహార్ పర్యటనలో దాడి చేసేందుకు ఉగ్రవాదులు ఈ ప్లాన్ వేసినట్లు పోలీసులు తెలిపారు.
Bihar Police busts a major terror module run by Islamist terror organization Popular Terrorist front of India. They planned to convert India into Islamic state by 2047. https://t.co/HX3QNxeLQ5
— Jayess (@Sootradhar) July 14, 2022
భారీ ఉగ్ర దాడికి
ప్రధాని మోదీ లక్ష్యంగా ఈ నెల 6,7 తేదీల్లో సమావేశమై వీరు ఉగ్ర కుట్రకు ప్రణాళికలు రచించినట్లు పోలీసుల తెలిపారు. అనుమానిత ఉగ్రవాదుల పుల్వారి షరీఫ్ కార్యాలయంపై బిహార్ పోలీసులు దాడులు నిర్వహించగా పలు పత్రాలు, ఉగ్ర సాహిత్యాన్ని సీజ్ చేశారు.
Bihar Police busts terror module planning to target PM Modi, ex-cop among 2 arrested https://t.co/gHcxJnmeh7 Bihar Police busts terror module planning to target PM Modi, ex-cop among 2 arrested pic.twitter.com/0ln7lz3DPc
— Vishal verma (@Vishalverma111) July 14, 2022
పట్నాలోని పుల్వారి షరీఫ్ ప్రాంతంలో ఉగ్ర కార్యకలాపాలు సాగుతున్నాయనే సమాచారంతో ఇంటెలిజెన్స్ బ్యూరో.. పోలీసులుకు సమాచారం అందించింది. దీంతో జులై 11న ఆ ప్రాంతంలోని నయా టోలాలో పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు తనిఖీలు చేశాయి.
దీంతో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులను అధర్ పర్వేజ్, మహ్మద్ జలాలుద్దీన్‌లుగా గుర్తించారు. వీరు ప్రధాని పర్యటనకు పదిహేను రోజుల ముందు పుల్వారి షరీఫ్‌లో శిక్షణ పొందినట్టు చెబుతున్నారు.
ఇక్కడే శిక్షణ
ఉగ్ర కుట్రల్లో పాలుపంచుకునేందుకు శిక్షణ నిమిత్తం పలు రాష్ట్రాల నుంచి యువత ఇక్కడికి వస్తుంటారని పోలీసులు గుర్తించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, టర్కీ వంటి ఇస్లామిక్ దేశాల నుంచి అరెస్టయిన ఉగ్రవాదులకు నిధులు వస్తుంటాయని పోలీసులు వెల్లడించారు.
Also Read: CM Stalin Hospitalized: ఆసుపత్రిలో చేరిన సీఎం స్టాలిన్- రెండు రోజుల క్రితం కరోనా!
Also Read: LS RS Unparliamentary Words: పార్లమెంటులో ఇక ఆ పదాలపై నిషేధం- లిస్ట్ పెద్దదే!