PM Narendra Modi BJP Meeting: ప్రధాని మోదీతో భేటీ అరుదైన ఘట్టం - బీజేపీ నూతన పదాధికారులకు నరేంద్ర మోదీ మార్గనిర్దేశం!
BJP National Office Bearers: బీజేపీ కొత్త జాతీయ పదాధికారుల బృందంతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. మూడు గంటల సేపు వారందరితో ఆత్మీయంగా మాట్లాడారు.

Nitin Nabin BJP Team: భారతీయ జనతా పా నూతనంగా నియమించిన జాతీయ పదాధికారుల బృందంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘంగా సమావేశమయ్యారు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నాయకత్వంలో కొలువుదీరిన నూతన కార్యవర్గంతో జరిపిన ఈ భేటీలో దేశవ్యాప్తంగా వివిధ బాధ్యతల్లో నియామకమైన కీలక నేతలు పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు, దేశ సేవే పరమావధిగా ప్రజల్లోకి వెళ్లే దిశగా మోదీ ప్రతి ఒక్కరికీ పక్కా దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి ఉపాధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ 'ఆల్ సెల్స్' జాతీయ సహ కన్వీనర్‌గా నియామకమైన ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పదవులు కేవలం అధికారం కోసం కాదని, సమాజానికి అంకితభావంతో సేవ చేయడానికి లభించిన అరుదైన అవకాశాలని స్పష్టం చేశారు. ప్రతి నాయకుడి వ్యక్తిగత వివరాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్న ప్రధాని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, వికసిత భారత్ లక్ష్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
A truly rare and unforgettable moment in my political journey.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) August 23, 2026
Grateful to Hon’ble PM Shri @narendramodi Ji for spending nearly four hours with us, the newly appointed BJP National Office Bearers, and personally enquiring about our families while sharing invaluable guidance on… pic.twitter.com/wU1H8PxTzJ
సమావేశం అనంతరం బీజేపీ జాతీయ 'ఆల్ సెల్స్' కో-కన్వీనర్ ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి స్పందిస్తూ.. తన రాజకీయ జీవితంలో ప్రధాని మోదీతో గడిపిన ఈ సమయం ఒక అరుదైన, మర్చిపోలేని ఘట్టమని కొనియాడారు. "దేశం కోసం, సమాజం కోసం మరింత నిబద్ధతతో పనిచేయాలనే సంకల్పాన్ని ప్రధాని మోదీ గారి ఆత్మీయ సమావేశం మాలో మరింత బలపరిచింది. ఆయన ఇచ్చిన స్ఫూర్తిదాయక మార్గదర్శకత్వం ప్రతి పదాధికారిలో బాధ్యతాయుతమైన సేవాభావాన్ని పెంపొందించింది" అని ఆయన వెల్లడించారు.
జాతీయ స్థాయిలో తనపై నమ్మకంతో ఈ కీలకమైన బాధ్యతను అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్ , జాతీయ నాయకులు శివప్రకాశ్, మధుకర్, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ లకు విష్ణువర్ధన్ రెడ్డి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నిరంతరం అండగా నిలిచి ప్రోత్సహించిన శ్రేయోభిలాషులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ పదాధికారుల సమావేశంలో రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా జరగబోయే వివిధ రాష్ట్రాల రాజకీయ వ్యూహాలు, పార్టీ సంస్థాగత విస్తరణ , వందేమాతరం నినాదంతో జాతీయ భావజాలాన్ని బలోపేతం చేసే కార్యచరణపై సుదీర్ఘంగా చర్చించారు ప్రధాని మోదీ అందించిన స్ఫూర్తితో దేశానికి, సమాజానికి మరింత నిబద్ధతతో, అంకితభావంతో సేవ చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని బీజేపీ నూతన జాతీయ కార్యవర్గ నాయకులు స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు





















