అన్వేషించండి

PV Narasimha Rao Birth Anniversary Tributes 2026: మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు

PV Narasimha Rao Tributes: పీవీ నరసింహారావు మహనీయుడు. ఆయనను ఓ ప్రాంతానికి పరిమితం చేయడంపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. విద్వేష రాజకీయాలకు కాలం చెల్లిందని పీవీకి నివాళులు అర్పించారు.

BJP Vishnuvardhan Reddy Tweet MLC Kavitha:  భారత మాజీ ప్రధాని,  భారతరత్న పాములపర్తి వెంకట నరసింహారావు  జయంతి ఉత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రాజకీయ విమర్శలకు, సవాళ్లకు వేదికగా మారాయి. పీవీ నరసింహారావును కేవలం తెలంగాణ సరిహద్దులకే పరిమితం చేస్తూ  తెలంగాణ రక్షణ సేన నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ  జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహనీయులకు ప్రాంతీయ గీతలు, భాషా భేదాలు అంటగట్టడం సరికాదంటూ ఆయన క్లియర్ కట్ కౌంటర్ ఇచ్చారు.     

అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే.. పీవీ జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఆయనను కేవలం  తెలంగాణ ముద్దుబిడ్డ గా సంబోధిస్తూ, ప్రాంతీయ సెంటిమెంట్‌ను జోడించే ప్రయత్నం చేశారు. అంతేకాదు, గతంలో కూడా మహనీయులకు ప్రాంతాలు అంటగడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలంగాణ నేతల విగ్రహాలను ఇక్కడికి పార్శిల్  చేస్తామనే తరహా అర్థం వచ్చేలా గతంలో వ్యాఖ్యలు చేశారు. కవిత చేసిన ఈ సంకుచిత వ్యాఖ్యలను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తప్పుబట్టారు. విశాఖపట్నంలో రాజకీయాలకు అతీతంగా పీవీ నరసింహారావు విగ్రహానికి తాము ఘనంగా నివాళులు అర్పించిన ఫోటోను జత చేస్తూ కవిత ట్వీట్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.

"మహనీయులకు ప్రాంతాలు, భాషలు ఉండవు కవిత గారు! నేడు తెలుగు బిడ్డ పి.వి. నరసింహా రావు గారికి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలకు అతీతంగా నివాళులు అర్పించాం. విద్వేష, విభజన రాజకీయాలు మానేసి ప్రజల కోసం పనిచేయండి. అప్పుడు భవిష్యత్తులో మీ విగ్రహాలు కూడా ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశమంతా నిలుస్తాయి. ఇది విశాఖపట్నంలోని పి.వి. గారి విగ్రహం.. మేము మహనీయులను పార్శిల్ చేయం… భావి తరాలకు అందిస్తాం" అంటూ విష్ణువర్ధన్ రెడ్డి తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన పీవీ లాంటి అంతర్జాతీయ స్థాయి నేతను కేవలం ఒక ప్రాంతానికి పరిమితం చేయడం కవిత రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు.

తెలంగాణ రక్షణ సేన పేరుతో సొంత పార్టీ పెట్టుకునిరాజకీయం చేస్తున్న కవిత.. తెలంగాణ సెంటిమెంట్  'ఆంధ్రా-తెలంగాణ' విభేదాలను రాజేయడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోందన్న ఆరోపణలుబ ీజేపీ నుంచి వస్తున్నాయి.   అందులో భాగమే పీవీ నరసింహారావు లాంటి జాతీయ నాయకుడిని కూడా తమ సొంత బ్రాండ్‌గా మార్చుకునే ఈ ప్రయత్నం. అయితే,  ఆంధ్రప్రదేశ్‌లో పీవీ జయంతి వేడుకలను అధికారికంగా, అత్యంత గౌరవప్రదంగా నిర్వహించడం ద్వారా.. తెలుగువారైన మహనీయులందరినీ ఏపీ గౌరవిస్తుందనే బలమైన సందేశాన్ని విష్ణువర్ధన్ రెడ్డి వంటి  నేతలు పంపగలిగారు.
 
ఆధునిక భారత ఆర్థిక  శిల్పిగా కీర్తించే  పీవీ నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడని, ఆయనను ఒక ప్రాంతానికో, భాషకో పరిమితం చేయడం ఆయన కీర్తిని తగ్గించడమే అవుతుందని అభిప్రాయపడుతున్నారు. కవితకు విష్ణువర్ధన్ రెడ్డి ఇచ్చిన ఈ  కౌంటర్ ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Breaking News: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget