ఆలు(Potato) తినడం వల్ల బరువు పెరుగుతారా?

Published by: Geddam Vijaya Madhuri

బంగాళాదుంపలలో కార్బోహైడ్రేట్లు, పిండి పదార్థాలు ఉంటాయి.

బంగాళదుంపలు తింటే శరీరానికి శక్తిని ఇస్తాయి.

బంగాళాదుంపలను ఎలా తయారు చేస్తారు అనేది బరువులో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ఎక్కువ నూనెలో వేయించిన బంగాళాదుంపలు లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ కేలరీలను పెంచవచ్చు.

ఉడికించిన లేదా తక్కువ కొవ్వు ఉన్న బంగాళాదుంపలు మంచి ఎంపిక కావచ్చు.

బరువు తగ్గించేటప్పుడు బంగాళాదుంపల పరిమాణాన్ని కూడా గుర్తుంచుకోవడం అవసరం.

బంగాళాదుంపలను కూరగాయలు, పప్పు లేదా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారంతో పాటు తినవచ్చు.

అయితే బంగాళాదుంపలు తినడం వల్లనే బరువు పెరుగుతారని నమ్మడం సరైనది కాదు.

రోజు మొత్తం ఎన్ని కేలరీలు తీసుకుంటున్నారు.. ఆహార నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

బరువు తగ్గడానికి సమతుల్య ఆహారం, క్రమమైన శారీరక శ్రమ అవసరం.