అన్వేషించండి

Bihar Assembly Elections 2025: ఎన్డీఏలో పూర్తయిన సీట్ల పంపకం.. మహా ఘట్ బంధన్‌లో ఇంకా కొలిక్కిరాని వ్యవహారం

Bihar Elections 2025: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏనే మళ్లీ విజయం సాధిస్తుందని నేతలు ధీమాగా ఉన్నారు. ఎన్నికలకుగానూ ఎన్డీయేలో సీట్ల పంపకం ప్రశాంతంగా పూర్తయింది. పార్టీలవారీగా సీట్ల వివరాలివే.

NDA Seat Sharing in Bihar Assembly Elections | బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏలో సీట్ల పంపకం పూర్తయింది. బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.  చిరాగ్ పాశ్వాన్ పార్టీకి 29 సీట్లను కేటాయించారు. దీంతో పాటు జీతన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహాలకు చెరో 6 సీట్లు ఇచ్చారు. బీజేపీ బీహార్ ఇన్‌ఛార్జ్ వినోద్ తావ్డే  సీట్ల పంపకాలపై ట్లాడుతూ.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీఏ లోని సభ్యులందరూ స్నేహపూర్వక వాతావరణంలో పరస్పర అంగీకారంతో సీట్ల పంపకం పూర్తి చేశాం. ఎవరికీ సీట్ల పంపకంపై అసంతృప్తి లేదు. 

ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకాలు ఇలా చేశారు..

బీజేపీ – 101 సీట్లు
జేడీయూ – 101 సీట్లు
లోజపా (రాంవిలాస్) – 29 సీట్లు
రాలోమో – 06 సీట్లు
హమ్ – 06 సీట్లు

జీతన్ రామ్ మాంఝీ పార్టీకి దక్కిన సీట్లు ఇవే 

టెకారీ
కుటుంబా
అత్రి 
ఇమామ్‌గంజ్ 
సికింద్రా 
బరాచట్టి

ఉపేంద్ర కుష్వాహా పార్టీ ఎక్కడ పోటీ చేస్తుంది 

ససారం 
దినారా 
ఉజియార్‌పూర్ 
మహువా 
బాజ్‌పట్టి 
మధుబని

సీట్ల పంపకంపై జేడీయూ అభిప్రాయం 

జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ కుమార్ ఝా  సీట్ల పంపకాలపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ఎన్డీఏలోని మిత్రులతో కలిసి స్నేహపూర్వక వాతావరణంలో సీట్ల పంపకం జరిగిందన్నారు. ఎన్డీఏలోని అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు సీట్ల పంపకాన్ని స్వాగతిస్తున్నారని, నితీష్ కుమార్ ను భారీ మెజారిటీతో తిరిగి ముఖ్యమంత్రిని చేయడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. కూటమి లోని అన్ని పార్టీలు ఐక్యంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని, బిహార్ అందుకు సిద్ధంగా ఉందన్నారు.

వినోద్ తావ్డే మాట్లాడుతూ.. ఎన్డీఏలోని అన్ని పార్టీల నాయకులు సీట్ల పంపకాల నిర్ణయాన్ని సంతోషంగా స్వాగతించారు. మరోసారి విజయం సాధించడానికి అందరూ నడుం బిగించారు. బిహార్‌లో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

మహా ఘట్ బంధన్ సీట్ల పంపకంపై ఉత్కంఠ

ఎన్డీఏ సీట్ల పంపకం జరిగిన తర్వాత, ఇప్పుడు అంతా మహాకూటమి సీట్ల పంపకం కోసం ఎదురు చూస్తున్నారు. మహాకూటమి కూడా త్వరలో సీట్ల పంపకం ప్రకటిస్తుందని, ఎన్నికలకు రోజులు దగ్గర పడేకొద్దీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. 

రెండు దశల్లో ఎన్నికలు

బిహార్ అసెంబ్లీలోని 243 సీట్లకు మొత్తం రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో 121 సీట్లకు నవంబర్ 6న ఎన్నికలు జరగనుండగా, మిగతా 122 సీట్లకు రెండో దశలో నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనుంది ఈసీ.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget