Bangaldeshi Woman: ప్రేమ కోసం బంగ్లాదేశ్ యువతి సాహసం- అడవులు దాటి, సముద్రాన్ని ఈది భారత్‌కు!
Bangaldeshi Woman: ప్రేమ కోసం ఓ బంగ్లాదేశ్ యువతి ఏకంగా సముద్రాన్ని ఈది భారత్ చేరుకున్న ఘటన అందర్ని అవాక్కయ్యేలా చేసింది.
Bangaldeshi Woman: "ప్రేమ కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి, లైఫ్‌నే రిస్క్ చేయాలి" .. ఇది ఓ ఫేమస్ సినిమాలో డైలాగ్. అయితే ఓ యువతి ఇలాంటి సాహసమే చేసింది. ప్రేమించిన యువకుడ్ని కలిసేందుకు ఏకంగా లైఫ్‌నే రిస్క్ చేసింది. అడవులు దాటి, సముద్రాన్ని ఈది భారత్ వచ్చింది ఓ బంగ్లాదేశ్ యువతి.
This is called True Love 'Shiddat'❤️
— Rahul Pandit (@IMRahul_Pandit) June 1, 2022
A 22-Year Old Bangladeshi Woman Swims Across The Sunderbans To Marry Her Lover In West Bengal, India! @BhaavnaArora pic.twitter.com/MU9bqGrxUG
ప్రేమ కోసం
బంగ్లాదేశ్‌కు చెందిన కృష్ణ మండల్ అనే యువతికి కోల్‌కతా వాసి అభిక్ మండల్ అనే యువకుడితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే అతడ్ని పెళ్లి చేసుకోవాలని భావించిన ఆ యువతి.. భారత్ రావాలనుకుంది. కానీ తన దగ్గర పాస్‌పోర్ట్ లేదు. దీంతో ఏం చేయాలో తెలియక పెద్ద సాహసమే చేసింది.
#Assam | 22-year-old woman swims from Bangladesh to India to marry boyfriend she met on Facebook.
— I Love Bongaigaon ™ (@ILoveBongaigaon) June 1, 2022
A 22-year-old woman from Bangladesh swam across a river for over an hour to cross the Indian-Bangladesh border to marry her boyfriend, who she had met on Facebook. pic.twitter.com/OXCwP7gYIk
సముద్రాన్ని ఈది
ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడాలనే ఆలోచనతో ఆ బంగ్లాదేశ్ యువతి వెనుకా ముందూ ఆలోచించలేదు. ప్రాణాలను లెక్క చేయకుండా పులులు ఉండే దట్టమైన అడవిలోకి ప్రవేశించింది. రాయల్ బెంగాల్ టైగర్లు ఉండే సుందర్‌బన్ అడవిని దాటింది. సముద్రంలోకి దూకి గంటపాటు ఈదుకుంటూ బంగాల్ చేరుకుంది.
క్లైమాక్స్ ట్విస్ట్
మూడు రోజుల క్రితం కోల్‌కతాలోని కాళీ ఆలయంలో కృష్ణ మండల్-అభిక్ మండల్ వివాహం జరిగింది. పోనిలే ఇప్పటికైనా కథ సుఖాంతం అయిందనుకుంటే అక్కడే అసలైన ట్విస్ట్ ఎదురైంది. ఈ బంగ్లాదేశ్ యువతి సాహసం గురించి పోలీసులు తెలుసుకున్నారు. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినందుకు కృష్ణ మండల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను బంగ్లాదేశ్ రాయబార కార్యాలయ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిసింది.
Also Read: Corona Cases: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- కొత్తగా 3,712 మందికి వైరస్
Also Read: Hardik Patel Joins BJP-భాజపాలోకి ఫైర్‌బ్రాండ్ హార్దిక్ పటేల్