అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  Poll of Polls)

అయోధ్య ట్రస్ట్ వద్ద రూ.3 వేల కోట్ల మిగులు నిధులు, గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణ పనులు పూర్తి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గుడి నిర్మాణానికి, భక్తులకు సౌకర్యాల కల్పనకు ఇప్పటి వరకు రూ.900 కోట్లకు పైగా ఖర్చు చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ ( Up)లోని అయోధ్యలో (Ayodhya) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రామాలయ నిర్మాణ (Ram Temple) పనులు శరవేగంగా సాగుతున్నాయి. రామమందిర ప్రాణప్రతిష్ఠకు గడువు సమీపిస్తుండటంతో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెలా చివరి నాటికి గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణ పనులు పూర్తవుతాయని రామాలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్రా (Nripendra Mishra) వెల్లడించారు. గుడి నిర్మాణానికి, భక్తులకు సౌకర్యాల కల్పనకు ఇప్పటి వరకు రూ.900 కోట్లకు పైగా ఖర్చు చేశామని అయోధ్య ట్రస్ట్‌ కోశాధికారి గోవింద్‌ దేవగిరి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఇచ్చిన విరాళాలతో ట్రస్టుకు కుబేరుని ఆశీర్వాదం ఉందనన్నారు. తమ వద్ద ఇంకా రూ.3 వేల కోట్ల మిగులు నిధులు ఉన్నాయిని తెలిపారు. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున గర్భగుడిలోని విగ్రహాలపై సూర్యకిరణాలు నిరంతరాయంగా ప్రసరించేలా ఆలయం శిఖరంపై ఓ ప్రత్యేక నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నిపుణుల పర్యవేక్షణలో బెంగళూరులో ఈ నిర్మాణాన్ని రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూర్కీ, పుణెలోని సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సంయుక్తంగా అందిస్తోంది. 

జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ
జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తారని ఆలయ ట్రస్టు భావిస్తోంది. భక్తుల సౌకర్యార్థం ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అయోధ్యలో వేర్వేరుచోట్ల 10 పడకల ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ సమయంలో 12 వేల నుంచి 15 వేల మంది అయోధ్యలో బస చేసేందుకు వీలుగా ఆలయ ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. సాధువులు సహా తాము ఆహ్వానించిన ప్రముఖులందరికీ అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. వేర్వేరు బృందాలకు ఈ బాధ్యతలు అప్పగించాం అని వివరించారు. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. జనవరి 20- 24 మధ్య జరిగే విగ్రహ ప్రాణప్రతిష్ఠ, ప్రారంభోత్సవ వేడుకలకు ప్రధాని మోడీ కూడా హాజరవుతారు. అయితే ప్రధాని ఏ రోజున స్వామివారి సేవలో పాల్గొంటారన్న అంశంపై ప్రధాని కార్యాలయం (PMO) స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సి ఉంది.

70 ఎకరాల విస్తీర్ణంలో మరో 7 ఆలయాలు
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని సందర్శించే భక్తులు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జన్మభూమి కాంప్లెక్స్‌లో మరో 7 ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గోనాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోస్టు ద్వారా అందరికీ ఆహ్వానాలు పంపుతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ వస్తున్నారు. ఆయనతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతున్నారు.  జాబితాలో సినీరంగం నుంచి అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ తో పాటు ఇతర ప్రముఖులు ఉన్నారు. అలాగే పారిశ్రామిక రంగం నుంచి రతన్ టాటా, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ లాంటి ప్రముఖులు, భారత్ క్రికెట్ రూపురేఖలు మార్చిన దిగ్గజ క్రికెటర్లలో సచిన్, విరాట్ కోహ్లి  లాంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. ఏడు ధ్వజ స్తంభాల బరువు సుమారు 5,500 కిలోలు. రామమందిరం చుట్టూ 800 మీటర్ల పొడవున నిర్మిస్తున్న రింగ్ రోడ్డు  చివరి దశలో ఉంది. మరోవైపు ప్రాకారాలలో నుంచే కాకుండా రింగ్‌రోడ్డు మార్గం నుంచి కూడా ఆలయాన్ని  సందర్శించవచ్చు. ఆలయంలోని నేలను పాలరాతితో తీర్చిదిద్దుతున్నారు. 60 శాతం మేరకు ఫ్లోర్‌లో మార్బుల్‌ను అమర్చారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana News: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana News: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
AAA Rangoli Contest: ముగ్గేయండి.. పాతిక లక్షలు పట్టేయండి. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ బంపర్ ఆఫర్
ముగ్గేయండి.. పాతిక లక్షలు పట్టేయండి. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ బంపర్ ఆఫర్
Kurnool News: కర్నూలులో హృదయ విదారక ఘటన - బాలునికి రంగు పూసి ఎండలో భిక్షాటన చేయించారు, నెటిజన్ ట్వీట్‌కు స్పందించిన మంత్రి లోకేశ్
కర్నూలులో హృదయ విదారక ఘటన - బాలునికి రంగు పూసి ఎండలో భిక్షాటన చేయించారు, నెటిజన్ ట్వీట్‌కు స్పందించిన మంత్రి లోకేశ్
Jharkhand Exit Poll 2024: జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Jagan On Balakrishna: షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
Embed widget