Vote For AAP: మరో రాష్ట్రంలోనూ ఒక్క ఛాన్స్ అంటున్న అరవింద్ కేజ్రీవాల్ - వారి అహంకారం అణచడమే లక్ష్యమని తీవ్ర వ్యాఖ్యలు
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల పంజాబ్‌లో అధికారం చేపట్టగా.. ఇప్పుడు మరో రాష్ట్రంలోనూ తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రిక్వెస్ట్ చేశారు.
Delhi CM Arvind Kejriwal: ఒక్క ఛాన్స్ అంటూ ఇటీవల పంజాబ్‌లో అధికారం చేపట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ (AAP). ఇప్పుడు మరో రాష్ట్రంలోనూ తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రిక్వెస్ట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సైతం తమకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని ఎలాగైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో కోరారో.. అచ్చం అదే తరహాలో కేజ్రీవాల్ గుజరాత్ ప్రజలను కోరుతున్నారు. భారతీయ జనతా పార్టీ (BJP) అహంకారాన్ని అణిచేందుకు గుజరాత్‌లో తమకు ఒక్కసారి అధికారం (Vote For AAP In Gujarat ) అప్పగించాలని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రజలను కేజ్రీవాల్ కోరారు.
గుజరాత్‌లోని భరూచ్‌లో ఆదివారం నిర్వహించిన ఆదివాసీ సంకల్ప్ మహా సమ్మేళన్ ఈవెంట్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ ఓ విషయాన్ని వెల్లడించారు. ‘నేను ఓ బీజేపీ నేతను కలిశాను. బీజేపీ నేతలు గుజరాత్ రాష్ట్రంలో ఎందుకు పనులు చేయడం లేదని అడిగాను. తమకు పని చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదని, ఎందుకంటే కాంగ్రెస్ మా పాకెట్లో ఉందని, దాంతో బీజేపీ గెలుస్తుందని ధీమాగా చెప్పారు. కనుక మనం బీజేపీ గర్వాన్ని అణచాల్సిన అవసరం ఉంది. తనతో మాట్లాడిన బీజేపీ నేత నిజాయితీపరుడిగా చెలమాణి అవుతున్నారు. ఆయనపై వచ్చిన ఏ అవినీతి ఆరోపనలు నిరూపితం కాలేదని తెలిపారు.
मुझे एक BJP नेता मिला। मैंने पूछा- BJP Gujarat में काम क्यों नहीं करती?
— AAP (@AamAadmiParty) May 1, 2022
उसने कहा- हमें काम करने की ज़रूरत नहीं। Congress हमारी जेब में है, हम ऐसे ही जीत जाते हैं
इनको बहुत अहंकार हो गया है। इनका घमंड तोड़ने के लिए AAP को वोट दें।
-CM @ArvindKejriwal #AAPGujaratAadivasiSammelan pic.twitter.com/95ZufqQN1N
కాంగ్రెస్ పని అయిపోయింది..
ప్రాచీన పార్టీ కాంగ్రెస్ పని అయిపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీలో కొందరు మంచి నేతలున్నారు. వారు తమతో కలిసి పనిచేసేందుకు అవకాశం కల్పిస్తామని, ఆప్‌లో చేరేందుకు ఆహ్వానించారు క్రేజీవాల్. బీజేపీలోనూ కొందరు మంచి నేతలున్నారు. గుజరాత్‌కు మేలు జరగాలంటే వారు సైతం ఆప్‌లో చేరడం బెటర్. వచ్చే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులకు ఓటు వేసి తమ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రజలను కేజ్రీవాల్ మరోసారి కోరారు.
क्या भाजपा अगले हफ़्ते गुजरात विधान सभा भंग करके गुजरात के चुनावों का एलान करने जा रही है? “आप” का इतना डर?
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 30, 2022
ఆప్ అంటే అంత భయమా..?
వచ్చే వారం గుజరాత్ అసెంబ్లీని రద్దు చేసి బీజేపీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుందా. ఆప్ అంటే మీకు అంత భయమా అని హిందీలో ట్వీట్ చేశారు కేజ్రీవాల్. ఈ ఏడాది పంజాబ్‌లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్ గుజరాత్‌లో పాగా వేయాలని చూస్తోంది. ప్రస్తుతం గుజరాత్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఆప్ జెండా ఎగరవేయాలని అరవింద్ కేజ్రీవాల్ యోచిస్తున్నారు.