అన్వేషించండి

Amrita Sher-Gil: చరిత్ర సృష్టించిన అమృత్ షేర్ గిల్ చిత్రం - వేలంలో రికార్డు ధర

Amrita Sher-Gil: 1941లో 28 ఏళ్ల వయసులో మరణించిన సిక్కు - హంగేరియన్ చిత్రకారిణి అమృతా షేర్ గిల్ గీసిన చిత్రం శనివారం రాత్రి జరిగిన సాఫ్రోనార్ట్ వేలంలో రూ. 61.8 కోట్లు ($7.4 మిలియన్లు) పలికింది.

Amrita Sher-Gil: 1941లో 28 ఏళ్ల వయసులో మరణించిన సిక్కు - హంగేరియన్ చిత్రకారిణి అమృతా షేర్ గిల్ గీసిన చిత్రం ‘ది స్టోరీ టెల్లర్’ (1937) శనివారం రాత్రి జరిగిన సాఫ్రోనార్ట్ వేలంలో రూ. 61.8 కోట్లు ($7.4 మిలియన్లు) పలికింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధర పలికిన భారతీయ కళగా నిలిచింది. వాస్తవానికి, ఆధునికవాది సయ్యద్ హైదర్ రజా 'గెస్టేషన్' అనే పెయింటింగ్ పుండోల్ వేలం హౌస్‌లో రూ. 51.7 కోట్లు పలికింది. దాని తరువాత 10 రోజులకు జరిగన వేలంలో అమృత్ షేర్ గీసిన చిత్రం రూ.61.8 కోట్లు పలికింది

దీంతో రజా గీసిన ‘గెస్టేషన్’ ఇప్పుడు రెండవ అత్యంత ఖరీదైన భారతీయ కళాఖండంగా మారింది. అబ్‌స్ట్రాక్షనిస్ట్ వాసుదేయో ఎస్ గైటోండే 2020 ధర రూ.32 కోట్లకు పలికి 3వ స్థానంలో ఉంది. తాజా వేలంతో షేర్‌గిల్‌‌ అందరికంటే పైస్థానంలో ఉన్నారు. భారతదేశంలో చాలా కాలం పాటు,  విజయవంతమైన ఏకైక మహిళా కళాకారిణిగా షేర్ గిల్ మిగిలిపోయారు. మార్చి 2006లో, షేర్-గిల్ ‘విలేజ్ గ్రూప్’ (1938), స్త్రీల సమూహం విచారకరమైన చిత్రం రూ. 6.9 కోట్లకు విక్రయించబడింది. ఆ సమయంలో అది రికార్డు సృష్టించింది. 

ఈ రికార్డు ధర కళాకారుడి అపారమైన నైపుణ్యానికి, శాశ్వతమైన వారసత్వానికి నిదర్శనమని సాఫ్రోనార్ట్ CEO మరియు సహ వ్యవస్థాపకుడు దినేష్ వజిరాణి అన్నారు.  ఈ పని ఆమెలోని నిజాయితీ, కీలక సమయాల్లో సంక్షిప్త రచనకు నిదర్శనమన్నారు. షేర్ గిల్ చిత్రం బెంచ్‌మార్క్‌ను రూపొందించడంలో తామ ఒక పాత్ర పోషించిడం గర్వంగా ఉందని ఆయన చెప్పారు. 

1913లో బుడాపెస్ట్‌లో సిక్కు తండ్రి, హంగేరియన్ తల్లికి జన్మించిన అమృత షేర్ గిల్, యూరప్, భారతదేశంలో నివసించారు. ఎలైట్ ఎకోల్ డెస్ బ్యూక్స్ ఆర్ట్స్‌లో చదువుకున్నారు, అక్కడ పెయింటింగ్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి ఆసియన్‌గా ఆమె నిలిచారు. పారిస్ విద్యార్థి రోజుల్లో ఆమె చిత్రించిన నగ్న చిత్రాలు, ఆమె తన సోదరిని మోడల్‌గా ఉపయోగించుకున్న సందర్భాలు ఆమెలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి. 

ఆమె 25 సంవత్సరాల వయస్సులో పారిస్ నుంచి భారతదేశానికి మారారు. యూరోప్ పికాసో, మాటిస్సే, బ్రాక్, అనేక ఇతర వ్యక్తులకు చెందినది. భారతదేశం తనకు మాత్రమే చెందుతుందని 1938లో ధైర్యంగా ప్రకటించింది. 1934లో తన తల్లిదండ్రులకు రాసిన లేఖలో, ఆమె భారత్‌కు నివాసం ఏర్పరచుకోవడానికి కారణాలను వివరించారు. యూరోప్‌లో సుదీర్ఘ నివాసం భారతదేశంలోని కొత్త విషయాలను కనుగొనడానికి సహాయపడిందన్నారు. అజంతా నుంచి ఒక ఫ్రెస్కో, చిన్న శిల్పం పునరుజ్జీవనోద్యమం కంటే విలువైనదని ఆమె పేర్కొన్నారు. 

ప్రపంచ రికార్డును నెలకొల్పిన పెయింటింగ్  ‘ది స్టోరీ టెల్లర్’ (1937), పహారీ, పారిసియన్ ప్రభావాలను విలక్షణమైన కళాత్మక భాషలో చూపించింది. ఆవుల సహవాసంలో తమ ఇంటి బయట విశ్రాంతి తీసుకుంటున్న స్త్రీల సమూహాన్ని చిత్రీకరించారు. ఒకరు పాన్ తింటుంటే, మరొకరు చేతితో విసనకర్ర ఊపుతూ, మరికొందరు చాట్ చేస్తున్నారు. షేర్-గిల్ పెయింటింగ్స్‌లో  మహిళలు ఆధిపత్యం చెలాయిస్తారు.  షేర్ గిల్ చిత్రాలు స్త్రీల సారాంశాన్ని తెలియజేసేవి అని క్యూరేటర్, విమర్శకురాలు యశోధర దాల్మియా జీవిత చరిత్రలో రాశారు. 

టాప్ హెడ్ లైన్స్

Indian Railways Transformation: బడ్జెట్ కేటాయింపుల నుండి బుల్లెట్ వేగం వరకు - మోదీ హయాంలో ఇండియన్ రైల్వేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విప్లవం!
బడ్జెట్ కేటాయింపుల నుండి బుల్లెట్ వేగం వరకు - మోదీ హయాంలో ఇండియన్ రైల్వేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విప్లవం!
Parliament Monsoon Session 2026 Big Bills: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు - తెరవెనుక బిగ్ బిల్స్ వ్యూహం - దేశ రాజకీయాన్ని మార్చబోతున్న కీలక బిల్లులు!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు - తెరవెనుక బిగ్ బిల్స్ వ్యూహం - దేశ రాజకీయాన్ని మార్చబోతున్న కీలక బిల్లులు!
Parliament Seat Redistribution: డీలిమిటేషన్ పజిల్ - యూనిఫాం 50% ఫార్ములా కు దక్షిణాది సై.. నియోజకవర్గాల పునర్విభజనపై మారిన పొలిటికల్ మైండ్‌సెట్!
డీలిమిటేషన్ పజిల్ - యూనిఫాం 50% ఫార్ములా కు దక్షిణాది సై.. నియోజకవర్గాల పునర్విభజనపై మారిన పొలిటికల్ మైండ్‌సెట్!
Breaking News: లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. 2-1 తేడాతో సిరీస్ దక్కించుకున్న ఇంగ్లాండ్
లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. 2-1 తేడాతో సిరీస్ దక్కించుకున్న ఇంగ్లాండ్

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Embed widget