Food Poison in Train: ట్రైన్‌లో ఫుడ్ పాయిజన్, 90 మంది ప్రయాణికులకు తీవ్ర అస్వస్థత
Food Poisoning: గుజరాత్‌కి వెళ్తున్న రైల్లో ఫుడ్ పాయిజన్ బారిన పడి 90 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు.
Food Poisoning in Train:
రైల్లో ఫుడ్ పాయిజన్..
చెన్నై నుంచి పలిటన వెళుతున్న రైల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా (Food Poison in Train) 90 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని పుణె రైల్వే స్టేషన్‌లో ఈ బాధితులందరికీ చికిత్స అందించారు. ఈ కారణంగా ట్రైన్ దాదాపు 50 నిముషాలు ఆలస్యమైంది. భారత్ గౌరవ్ ట్రైన్‌లో ఈ ఘటన జరిగింది. గుజరాత్‌లోని పలిటనలో ఓ ఫంక్షన్‌కి వెళ్లేందుకు కొందరు ఈ రైల్‌ని ప్రైవేట్‌గా బుక్ చేసుకున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఫుడ్ కూడా ప్రైవేట్ వ్యక్తులే వండారని, IRCTCకి ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రైల్లోని ప్యాంటీ కార్‌లోనే ఈ ఫుడ్ ప్రిపేర్ చేశారని తెలిపారు.
"రైల్లో 90 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. విరేచనాలు, తలనొప్పితో ఇబ్బంది పడ్డారు. రైల్‌లోని ప్యాంటీ కార్‌లోనే ఆహారం వండుకున్నారు. అది తిన్నాక కాసేపటికే అస్వస్థతకు గురయ్యారు. పుణే రైల్వే స్టేషన్ వద్ద రైల్ నిలిపివేశారు. కొంత మంది వైద్యులు వచ్చి వాళ్లను పరీక్షించారు. అవసరమైన చికిత్స అందించారు. ప్రస్తుతానికి ప్రయాణికులందరి ఆరోగ్యం కుదుటపడింది. ఈ కారణంగా రైల్ 50 నిముషాలు ఆలస్యంగా వెళ్లింది"
- రైల్వే అధికారులు
Also Read: గుళ్లో గంట కొడితే అది ధ్వని కాలుష్యం కాదా? అజాన్‌ని బ్యాన్ చేయాలన్న పిటిషన్‌పై కోర్టు అసహనం
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply