Allahabad High Court: పిల్లలతో ఆ లైంగిక చర్య తీవ్ర నేరం కాదు: అలహాబాద్ హైకోర్టు వెల్లడి
పోక్సో చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం.. చిన్నారులతో ఓరల్ సెక్స్ చేసినా శిక్షార్హమైన నేరం. కానీ, అలహాబాద్ హైకోర్టు ఈ నేరం అంతగా తీవ్రమైనది కాదని అభిప్రాయపడింది.
చిన్నారులపై లైంగిక దాడి, లైంగిక వేధింపుల విషయంలో అలహాబాద్ కోర్టు వివాదాస్పదమైన అభిప్రాయాన్ని వెల్లడించింది. పిల్లలతో ఓరల్ సెక్స్ చేయడం అది ‘తీవ్రమైన లైంగిక నేరం’ కిందకు రాదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఓ కేసులో నిందితుడికి శిక్ష కూడా తగ్గించింది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్- పోక్సో చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం.. చిన్నారులతో ఓరల్ సెక్స్ చేసినా శిక్షార్హమైన నేరం. కానీ, అలహాబాద్ హైకోర్టు ఈ నేరం అంతగా తీవ్రమైనది కాదని అభిప్రాయపడింది. ఈ సందర్భంలో పోక్సో చట్టంలోని సెక్షన్ 6, 10 కింద శిక్షలు వేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో 10 సంవత్సరాల జైలు శిక్షను ఏడేళ్లకు తగ్గించింది. అంతేకాక, శిక్షలో భాగంగా దోషికి రూ.5 వేల జరిమానా కూడా విధించింది.
సోనూ కుశ్వాహా అనే వ్యక్తి ఓ పదేళ్ల బాలుడికి రూ.20 ఇచ్చి అతనితో ఓరల్ సెక్స్ చేయించుకున్నాడని ప్రధాన ఆరోపణ. ఈ కేసులోనే గతంలో ఝాన్సీ జిల్లా కోర్టు ఇతనికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఝాన్సీ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కుశ్వాహా హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే జస్టిస్ అనిల్ కుమార్ ఓఝాతో కూడిన ఏక సభ్య ధర్మాసనం సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును తగ్గించింది. ఈ సందర్భంగానే కోర్టు చిన్నారులతో ఓరల్ సెక్స్ చేయడాన్ని తీవ్ర నేరంగా పరిగణించబోమని కోర్టు వ్యాఖ్యానిస్తూ 10 ఏళ్ల శిక్షను ఏడేళ్లకు తగ్గించింది. గతంలో సెషన్స్ కోర్టు ఐపీసీ సెక్షన్ 377 (అసహజ లైంగిక ప్రక్రియ), 506 (నేరపూరిత బెదిరింపులకు శిక్ష), పోక్సో చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం.. పదేళ్ల జైలు శిక్ష విధించింది.
Also Read: పరాయి వ్యక్తితో బెడ్‌రూంలో భార్య, భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి.. చివరికి ఏమైందంటే..
మైనర్ నుంచి ఓరల్ సెక్స్ చేయడం లేదా వీర్యం పడిపోవడం వంటివి పోక్సో చట్టంలోని సెక్షన్ 5/6 లేదా సెక్షన్ 9/10 పరిధిలోకి వస్తుందా అనేది కోర్టు ముందున్న ప్రశ్న. ఇది రెండు సెక్షన్ల పరిధిలోకి రాదని, అయితే పోక్సో చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం మాత్రం ఈ నేరం శిక్షార్హమని కోర్టు తీర్పు చెప్పింది. అలహాబాద్ హైకోర్టు తన తీర్పులో, పిల్లల ద్వారా ఓరల్ సెక్స్ చేయించుకోవడం అనేది పోక్సో చట్టంలోని సెక్షన్ 4 కింద శిక్షార్హమైన లైంగిక వేధింపుల కేటగిరీ కిందకు వస్తుందని స్పష్టం చేసింది. కానీ చట్టంలోని నిబంధనల ప్రకారం.. సెక్షన్ 6 కింద కాదని అభిప్రాయపడింది.
Also Read: Hyderabad: రూ.99కే బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్.. టెంప్ట్ అయినందుకు రూ.33 లక్షలు హాంఫట్, ఏం జరిగిందంటే..
Also Read: ఇద్దరివీ వీఆర్వో ఉద్యోగాలు, అన్నీ పాడుపనులే.. ఏళ్లుగా వారికి గాలం.. చివరికి ఇలా..
Also Read: Cheating Woman: తక్కువ ధరకే బైక్ కావాలా నాయనా.. హా కావాలి.. అన్నారో అంతే.. మీ ఆశే ఆమెకి బిజినెస్