News
News
X

Train Food Whatsapp : ట్రైన్ లో లాంగ్ జర్నీనా - ఈ ఫోన్ నెంబర్ మీ ఆకలి తీర్చేస్తుంది !

రైల్లో పుడ్ ఆర్డర్ కోసం ప్రత్యేక వాట్సాప్ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చారు.

FOLLOW US: 
Share:

Train Food Whatsapp :   ట్రైన్ జర్నీలో  టిఫిన్, మీల్స్ కావాలంటే... అటూ ఇటూ తిరిగే వెండర్స్ కోసం ఎదురు చూడాలి. కానీ ఇప్పుడు ఆ బాధ లేకండా వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తెచ్చాు. వాట్స్ అప్ ద్వారా  ఆహార పదార్థాలను  ఆర్డర్ చేసే కొత్త సర్వీసు ను భారతీయ రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందుకు సంబందించిన వాట్సాప్ నంబర్ +91-8750001323 ను కూడ రైల్వే శాఖ ప్రకటించింది. ఈ - క్యాటరింగ్ సేవల ద్వారా   రైల్వే ప్రయాణికులు వాట్స్ అప్ సందేశం నుండి  తమకు కావాల్సిన   ఆహార పదార్థాలను  ఆర్డర్ చేసుకునే సౌకర్యాన్ని ప్రారంభించింది, ఇండియన్ రైల్వేస్, పి ఎస్ యూ , ఐ ఆర్ సి టి సి  ... వినియోగదారులకు పరస్పర సంభాషణ కోసం వాట్సాప్ నంబర్ +91-8750001323  ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

పవర్ చాట్‌బాట్  ద్వారా ప్రయాణికులు  అన్ని రకాల ఈ కేటరింగ్ సేవలను ఉపయోగించుకునేందుకు మరియు భోజనం ఆర్డర్ చేయొచ్చుని రైల్వే శాఖ ప్రకటించింది.ఎంపిక చేసిన రైళ్లు మరియు ప్రయాణీకులకు వాట్సాప్ నుండి  ఈ కేటరింగ్ సేవలు అందుబాటులో తీసుకువచ్చినట్లుగా వెల్లడించారు.వినియోగదారుల అభిప్రాయాలు ,సూచనల ఆధారంగా  ఇతర రైళ్లలో కుడా  ఈ కేటరింగ్ ను దశల వారీగా  అమలుకు చేసేందుకు యత్నస్తున్నామని అదికారులు అన్నారు.ఇండియన్ రైల్వేస్ పి ఎస్ యూ , ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్. (ఐ ఆర్ సి టి సి )  ప్రత్యేకంగా రూపొందించిన  చేసిన వెబ్‌సైట్  www.catering.irctc.co.in  .ద్వారా ఫుడ్ ఆన్ ట్రాక్ కోసం   ఈ -కేటరింగ్ యాప్  సేవలను ప్రారంభించింది.

వినియోగదారుకు  ఈ -కేటరింగ్  సేవలను అందించడమే  లక్ష్యంగా  ఒక అడుగు ముందుకు వేసి, భారతీయ రైల్వే ఇటీవలే రైల్వే ప్రయాణికులకు ఈ -కేటరింగ్ విధానం ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి  వాట్సాప్ సేవలను  ప్రారంభించింది. వాట్సాప్ సంభాషణ   ద్వారా ఈ కేటరింగ్ సేవలను రెండు దశల్లో అమలు పర్చడానికి ప్రణాళికలు రూపొందించారు . మొదటి దశలో  , www.ecatering.irctc.co.in లింక్‌ను క్లిక్ చేయడం వల్ల వాట్సప్ నుండి   ఈ -కేటరింగ్ సేవలను ఎంచుకోవడానికి అవకాశం ఉంది.వినియోగదారులకు బుకింగ్ ఇ-టికెట్‌కు సందేశాన్ని పంపుతుంది.ఈ ఎంపికతో వినియోగదారులు  యాప్‌ను డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా నేరుగా ఐ ఆర్ సి టి సి  వెబ్‌సైట్ ద్వారా స్టేషన్లలో అందుబాటులో ఉన్న తమకు నచ్చిన రెస్టారెంట్ల నుండి తమకు నచ్చిన భోజనాన్ని బుక్ చేసుకోవచ్చు.

తదుపరి దశ సేవలలో,  వాట్సాప్  నంబర్  ద్వారా AI పవర్ చాట్‌ నుండి  వినియోగదారులకు ఈ కేటరింగ్ ద్వారా  ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవటంతో పాటుగా,అన్ని రకాల కేటరింగ్  సేవలకు సంబందించిన సందేహాలను నివృత్తి కోసం పరస్పర సంభాషణ చేసేందుకు వీలుకల్పిస్తున్నట్లు రైల్వే అదికారులు వెల్లడించారు.ప్రయాణికుల నుండి  సేవలకు సంబందించి అభిప్రాయాలు   మరియు సూచనల ఆధారంగా ఇతర రైల్వే లో కూడా ఈ సేవలను ప్రారంభిస్తామన్నారు.ఐ ఆర్  సి టి సి  వెబ్‌సైట్  నుండి మరియు  యాప్ ద్వారా ప్రారంభించిన రోజునే  ,   ఈ -కేటరింగ్ సేవల ద్వారా వినియోగదారులకు సుమారు 50,000 భోజనాలను అందించడం జరిగిందని రైల్వే అధికారులు ప్రకటించారు.

Published at : 07 Feb 2023 03:28 PM (IST) Tags: Indian Railway ap updates FOOD ORDER BY WHATS APP

సంబంధిత కథనాలు

సీయూఈటీ (పీజీ) పరీక్ష షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!

సీయూఈటీ (పీజీ) పరీక్ష షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!

ED Notices To MP Magunta : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, వైసీపీ ఎంపీ మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు

ED Notices To MP Magunta : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, వైసీపీ ఎంపీ మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Patna Junction Video : పట్నా రైల్వే స్టేషన్ లో పోర్న్ వీడియో ప్లే, షాక్ కు గురైన ప్రయాణికులు!

Patna Junction Video : పట్నా రైల్వే స్టేషన్ లో పోర్న్ వీడియో ప్లే, షాక్ కు గురైన ప్రయాణికులు!

Gold Price Record high: 'గోల్డెన్‌' రికార్డ్‌ - తొలిసారి ₹60 వేలు దాటిన పసిడి

Gold Price Record high: 'గోల్డెన్‌' రికార్డ్‌ - తొలిసారి ₹60 వేలు దాటిన పసిడి

టాప్ స్టోరీస్

Breaking News Live Telugu Updates: విచారణ ముగిసినా ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాని ఎమ్మెల్సీ కవిత

Breaking News Live Telugu Updates: విచారణ ముగిసినా ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాని ఎమ్మెల్సీ కవిత

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం