అన్వేషించండి

ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు

BrahMos Missile: భారత్ రష్యా సంయుక్తంగా తయారు చేసిన బ్రహ్మోస్ మిజైల్‌ని తొలిసారి ఫిలిప్పైన్స్‌కి ఎగుమతి చేశారు.

BrahMos Missile to Philippines: రక్షణ రంగంలో ఎప్పటికప్పుడు సామర్థ్యాన్ని పెంచుకుంటున్న భారత్ ఇప్పుడు ఎగుమతులపైనా దృష్టి సారించింది. ఎంతో కీలకమైన BrahMos సూపర్‌ సోనిక్ క్రూజ్‌ మిజైల్‌ని ఫిలిప్పైన్స్‌కి అప్పగించింది. రెండేళ్ల క్రితం భారత్, ఫిలిప్పైన్స్ మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ మిజైల్‌ కోసం ఫిలిప్పైన్స్ 375 మిలియన్ డాలర్లు చెల్లించింది. 2022 జనవరిలో ఈ డీల్ కుదిరింది. భారత్, రష్యా సంయుక్తంగా తయారు చేసిన ఈ మిజైల్‌ని తొలిసారి ఎగుమతి చేశారు. 2024-24 మధ్య కాలంలో రక్షణ రంగ ఎగుమతులను రూ.35 వేల కోట్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ ఎగుమతులు 32.5%కి పెరిగాయి. రూ.21 వేల కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ఈ క్రమంలోనే దేశీయంగా ఆయుధాల తయారీపై కేంద్ర ప్రభుత్వం మరింత దృష్టి పెడుతోంది. ఏప్రిల్ 1వ తేదీన రక్షణశాఖ ఇదే ప్రకటన చేసింది. 

31 రెట్లు పెరిగిన ఎగుమతులు..

2014తో పోల్చి చూస్తే ఈ పదేళ్లలో రక్షణ రంగ ఎగుమతులు 31 రెట్లు పెరిగాయి. Indian Air Force C-17 జెట్‌ ద్వారా ఈ మిజైల్‌ని అందించారు. ఈ యాంటీ షిప్ క్రూజ్ మిజైల్‌ రేంజ్ 290 కిలోమీటర్లు. నిజానికి భారత్‌ వద్ద లాంగ్ రేంజ్ మిజైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఫిలిప్పైన్స్‌కి అందించింది షార్ట్ వేరియంట్.

రక్షణ రంగంలో ప్రస్తుతానికి ప్రైవేట్ సెక్టార్‌కి 60% వాటాఉండగా డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్‌కి 40% వాటా ఉంది. భారత్ ఇప్పుడు 85 దేశాలకు మిలిటరీ హార్డ్‌వేర్ ఎగుమతి చేస్తోంది. ఇందుకోసం 100 దేశీయ సంస్థలు పని చేస్తున్నాయి. ఈ ఎగుమతుల్లో మిజైల్స్‌, ఆర్టిలరీ గన్స్, రాకెట్‌లు, సాయుధ వాహనాలు, రకరకాల రేడార్స్, వ్యక్తిగత రక్షణ వ్యవస్థలు, నిఘా వ్యవస్థలు ఉన్నాయి.

Also Read: టేస్ట్ కోసం నాన్‌వెజ్‌లో ఆ మసాలా వేస్తున్నారా? జాగ్రత్త అందులో పురుగుల మందు ఉందట!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు

వీడియోలు

Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
Embed widget