IAF Helicopter: గోవా అడవుల్లో మంటలు ఆర్పేందుకు రంగంలోకి IAF,వేలాది లీటర్ల నీళ్లు చల్లుతున్న హెలికాప్టర్లు
IAF Helicopter: గోవా అడవుల్లో మంటల్ని ఆర్పేందుకు IAF హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి.
IAF Helicopter:
వారం రోజులుగా కార్చిచ్చు..
గోవా అడవుల్లో మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దాదాపు వారం రోజులుగా కార్చిచ్చు చల్లారడం లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. మంటలు చల్లార్చేందుకు హెలికాప్టర్ల ద్వారా భారీ మొత్తంలో నీళ్లు చల్లుతోంది.
IAF Mi-17 హెలికాప్టర్‌తో ప్రభావిత ప్రాంతాల్లో 25 వేల లీటర్ల మేర నీరు చల్లింది. ఇప్పటికే 47,000 లీటర్ల నీళ్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినట్టు వివరించింది IAF.కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఇదే విషయాన్ని వెల్లడించారు. ట్విటర్లో IAF వీడియో షేర్ చేశారు.
"ప్రధాని మోదీ సహకారంతో IAF హెలికాప్టర్లు మంటలు చల్లార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అడవిని రక్షించుకునేందుకు వీళ్లు చేస్తున్న ప్రయత్నం మరిచిపోలేనిది"
- భూపేంద్ర యాదవ్, కేంద్ర అటవీశాఖ మంత్రి
Augmenting its firefighting effort near #Goa with Mi-17 helicopters on 11 Mar 23, the #IAF dispensed over 25000 ltrs of water over the affected areas.
— Indian Air Force (@IAF_MCC) March 12, 2023
Thus far, 47000 litres of water have been dispensed by the #IAF, over the afflicted area.
Aapatsu Mitram pic.twitter.com/Zr8eWQ6cAl
గోవా మంత్రి విశ్వజిత్ రాణే కూడా దీనిపై స్పందించారు. స్థానిక యువత ముందుకొచ్చి మంటలు ఆర్పేందుకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు. ట్విటర్ ద్వారా థాంక్స్ చెప్పారు.
I would like to thank the youth of Copordem and Mauxi, for coming forward in supporting us to douse the fire.
— VishwajitRane (@visrane) March 11, 2023
Once again I am grateful to our Prime Minster Shri @narendramodi Ji, without whose intervention and support this would have not been possible. pic.twitter.com/bWeYr3Iske
తగలబడుతున్న అడవులు...
గోవాలో అడవులు తగలబడుతున్నాయి. గోవాలోని మాదై వైల్డ్ లైఫ్ సాంక్చుయరీ(Mhadei Wildlife Sanctuary)లో ఇప్పటికే ఆరు రోజులుగా పచ్చటి అడవులు భారీ మంటలకు మాడి మసి అవుతున్నాయి. మూగజీవాల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. మంటలను ఆర్పేందుకు గోవా ప్రభుత్వానికి మద్దతుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ హెలికాఫ్టర్లను రంగంలోకి దింపింది కేంద్రం. దగ్గర్లోని రిజర్వాయర్లలోని నీటిని తోడుకుని మంటలను ఆర్పుతున్నా ఫలితం కనిపించటం లేదు. అటవీ ప్రాంత సమీపంలోని స్థానికులు కూడా మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పడమటి కనుమల్లో జీవవైవిధ్యానికి కేంద్రాలుగా భావించే అడవులు గోవా పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రపంచంలో బయోడెైవర్సిటీ హాట్ స్పాట్స్ ఎనిమిది ఉండగా... అందులో ఒకటి పశ్చిమ కనుమల్లోని ఈ అడవులు. కానీ గోవా చరిత్రలోనే ఇంతటి భారీ మంటలు అడవులను చుట్టుముట్టిన దాఖలాలు లేవు. కనీసం చేరుకునేందుకు వీలు లేని ప్రాంతాల్లో మంటలు అలముకోవటంపై ఎన్నో అనుమానాలున్నాయి. మార్చి 14నాటికి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావాలని నేవీ, ఎయిర్ ఫోర్స్ పనిచేస్తున్నాయి.గోవా ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. అసలు మంటలు ఇంతలా గోవా అడవులను చుట్టుముట్టటానికి కారణాలు.. మొదట మంటలు కనిపించిన ప్రాంతాలను స్థానికుల సహాయంతో గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఇప్పటికే బాంబీ బకెట్లతో మంటలు విస్తరించకుండా నేవీ, ఎయిర్ ఫోర్స్ సహాయాసహకారాలు అందిస్తున్నాయని గోవా ప్రభుత్వం చెబుతోంది.
Also Read: Air India Flight: సిగరెట్ తాగిన ప్రయాణికుడు,కాళ్లు చేతులు కట్టేసిన సిబ్బంది - ఫ్లైట్‌లో షాకింగ్ ఘటన