అన్వేషించండి

Solar storm: దూసుకొస్తున్న సౌర తుపాను.. అసలేం జరుగుతుంది?

నాసా తెలిపిన వివరాల ప్రకారం సౌర తుపాను గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తుంది. అయితే ఈ సౌర తుపాన్లు ఎందుకు వస్తాయి? వస్తే ఏం జరుగుతుంది? తెలుసా?

ఓవైపు కరోనాతో ముప్పుతిప్పలు పడుతున్న ప్రపంచాన్ని మరో పెను ముప్పు వెంటాడుతోంది. ఎవరూ ఊహించలేనంత శక్తిమంతమైన సోలార్ స్ట్రామ్.. భూమిపైకి దూసుకొస్తుంది.  సమస్త శక్తికి, వెలుగుకి కారకుడైన సూర్యుడి వాతావరణంలో జరిగే ఈ మార్పు భూమిపై తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

అయితే సూర్యుడిపై సౌర తుపానులు సాధారణంగా చోటు చేసుకుంటాయి. అయితే ఇవేవీ ఇప్పటి వరకు భూమిపై ప్రభావాన్ని పెద్దగా చూపలేదు. కానీ తాజాగా ఏర్పడ్డ ఓ భారీ సౌర తుపాను భూమి వైపు వేగంగా దూసుకొస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూ వాతారణంపైపు చాలా వేగంగా వస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల జీపీఎస్, సెల్​ఫోన్ సిగ్నళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.

స్పేస్​వెదర్ డాట్ కామ్ అనే వెబ్​సైట్ ప్రకారం.. సూర్యుడి వాతావరణంలో ఆవిర్భవించిన ఈ తుపాను వల్ల భూమిపై ప్రభావం పడనుంది. గంటకు 1.6 మిలియన్ కిలోమీటర్ల వేగంతో ఇది భూమివైపు దూసుకొస్తోంది. ఈ తుపాను అతి త్వరలో భూమిని తాకొచ్చని అంచనా.

ఏం జరగొచ్చు..?

ఈ సౌర తుపాను కారణంగా సమాచార వ్యవస్థపై ప్రభావం పడుతుందని స్పేస్​వెదర్ వెబ్​సైట్ పేర్కొంది. భూఉష్ణోగ్రత పెరుగుతుందని, తద్వారా శాటిలైట్లు ప్రత్యక్ష ప్రభావానికి లోనవుతాయని తెలిపింది. ఫలితంగా జీపీఎస్ నేవిగేషన్, శాటిలైట్ టీవీలు, మొబైల్ సిగ్నళ్లకు అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్​ఫార్మర్​లు పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

దీని వేగం మరింత పెరిగే అవకాశం కూడా ఉందని, దీని కారణంగా భూమి వెలుపల వాతావరణంలో ఉన్న ఉపగ్రహాలు ధ్వంసమయ్యే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇలా జరుగుతాయా?

ఈ భూ అయస్కాంత తుపాను శక్తిమంతమైన గాలులను ప్రేరేపించే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రాథమికంగా సౌర తుపాన్లు భూ వాతావరణంలోకి ప్రవేశించే గాలుల శక్తిని సమర్థవంతంగా మార్పిడి చేయడం వల్ల భూమి అయస్కాంత గోళంలో సంభవించే పెద్ద లేదా చిన్న ఆటంకాలను సూచిస్తాయి.

2020 నవంబర్ 29న సూర్యుడి ఉపరితలంపై భారీ తుపాను సంభవించినట్టు ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దగా మంటలు ఎగసిపడి అంతరిక్షంలోకి సెగలు కక్కుతూ దూసుకెళ్లాయి. అంతటి అత్యంత వేడి, అతిపెద్ద సౌర తుపాను గత మూడేళ్లల్లో ఎప్పుడూ సూర్యుడిపై రాలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యుడిపై ఇలాంటి పేలుళ్లు సంభవించినప్పుడు అంతరిక్షంలోకి క్షణాల్లో సౌర గాలులు దూసుకెళ్తాయి. దీనినే కరోనల్ మాస్ ఇజెక్షన్ (coronal mass ejection) అంటారు.

మరోవైపు, సోలార్ తుపాను కారణంగా ధ్రువప్రాంతాల్లో ఉండేవారికి అద్భుత ఖగోళ దృశ్యాలు కనిపిస్తాయని స్పేస్​వెదర్ తెలిపింది. రాత్రి సమయంలో ప్రకాశవంతమైన కాంతి కనువిందు చేస్తుందని పేర్కొంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Tigrer Tension: 21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana Assembly Special Session: నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, సభలో కీలక తీర్మాణం - కేబినెట్ భేటీ వాయిదా
నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, సభలో కీలక తీర్మాణం - కేబినెట్ భేటీ వాయిదా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Tigrer Tension: 21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana Assembly Special Session: నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, సభలో కీలక తీర్మాణం - కేబినెట్ భేటీ వాయిదా
నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, సభలో కీలక తీర్మాణం - కేబినెట్ భేటీ వాయిదా
Jimmy Carter Dies: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత, ఆయన పేరిట ఎన్నో రికార్డులు
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత, ఆయన పేరిట ఎన్నో రికార్డులు
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
EPFO New Facilities: నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Embed widget