Hero Glamour X: క్రూయిజ్ కంట్రోల్ తో సరికొత్త బైక్! అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్లోకి దూసుకొస్తున్న హీరో!
Hero Glamour X: టూవీలర్లలో సక్సెస్ ఫుల్ బైక్ గ్లామర్ కొత్త వేరియంట్ ను తీసుకొస్తోంది. అధునాతన ఫీచర్లతోపాటు స్టన్నింగ్ క్రూయిజ్ కంట్రోల్ సౌకర్యాన్ని కూడా కల్పించినట్లు తెలుస్తోంది.

Hero Moto Corp Latest Bike News: హీరో మోటోకార్ప్ బైక్స్ లో అత్యంత విజయవంతమైన బైక్ గ్లామర్ లో కొత్త వేరియంట్ ను సిద్ధం చేసింది. గ్లామర్ ఎక్స్ పేరిట త్వరలోనే లాంచ్ చేయబోయే ఈ బైకులో స్టన్నింగ్ ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. 125cc విభాగానికి చెందిన ఈ బైక్ వివరాలు లాంచ్ కుమ ముందే లీక్ అయ్యాయి. 125 సీసీ విభాగంలో గేమ్ చేంజర్ లాగా కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ద్విచక్ర వాహానాల్లో తొలిసారిగా ఈ విభాగంలో క్రూయిజ్ కంట్రోల్ అనే ఫీచర్ ను జోడించినట్లు తెలుస్తోంది. నిజానికి, క్రూయిజ్ కంట్రోల్ అనేది స్పోర్టీ మరియు ప్రీమియం 125cc మోటార్‌సైకిళ్లలో కూడా వినియోగించలేదు.. అలాగే, హీరో మోటోకార్ప్ నుండి క్రూయిజ్ కంట్రోల్‌ను అందిస్తున్న మొట్టమొదటి మోటార్‌సైకిల్ బైక్ గా గ్లామర్ X నిలవనున్నట్లు తెలుస్తోంది.
All New @heromotocorp Glamour X 125 details leaked
— Automobile Tamilan (@automobiletamil) August 16, 2025
https://t.co/a25VjXtadr
📣 125cc Engine
📣Cruise Control
📣Colour TFT Cluster
📣Ride Modes - Eco, Road, Power
📣Led Projector Headlamp
📣 under Seat small Document Storage Box
💸 ₹ 95,000 - ₹ 1 lakhs#Heromotocorp pic.twitter.com/5qFaHwOGM5
డేడికేటెడ్ కీ..
తాజా లీక్‌లలో, క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌లను ఆపరేట్ చేసే కుడి చేతి స్విచ్‌గేర్‌పై టోగుల్‌ను గమనించవచ్చు. దీని ద్వారా క్రూయిజ్ కంట్రోల్ ను ఎఫెక్టివ్ గా వాడవచ్చు. దీంతోపాటు ఈ బైకులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను పొందు పరిచారు. ఇది కరిజ్మా XMR 210 బేస్ వేరియంట్ , Xtreme 250R లలో కనిపించే మాదిరిగానే కలర్ LCD ప్యానెల్ లాగా కనిపిస్తుంది. ఈ స్క్రీన్ చుట్టూ టెల్-టేల్ లైట్లు ఉన్నాయి.గేర్ షిఫ్ట్ లైట్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది, దీనివలన గరిష్ట ఇంధన సామర్థ్యాన్ని పొందడానికి వీలవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్లస్టర్ Xtreme 250R కంటే తక్కువ ఫీచర్లను కలిగి ఉండవచ్చని సమాచారం. ఇది నోటిఫికేషన్ వార్నింగ్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయబడిన ఫీచర్లకు లోబడి పని చేసే చాన్స్ ఉంది. అలాగే, హీరో గ్లామర్ X లో టైప్-సి పోర్ట్‌ను అందిస్తోంది, ఇది హీరో మోటోకార్ప్ బైక్‌లలో ఫస్ట్ టైమ్ యాడ్ చేశారు.. అలాగే LED టర్న్ ఇండికేటర్‌లు, మస్క్యులర్ ట్యాంక్ ష్రౌడ్‌లతో కూడిన స్టైలిస్టిక్ ఫ్యూయల్ ట్యాంక్‌ను కూడా గమనించవచ్చు.
సూపర్ ఫీచర్లు..
ఇతర ముఖ్యమైన అంశాలలో ఖరీదైన అల్లాయ్ వీల్ డిజైన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సెటప్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, ఇంజిన్ కిల్-స్విచ్, పూర్తి LED హెడ్‌లైట్ , టెయిల్ లైట్లు , ఈ కొత్త LCD స్క్రీన్‌ను ఆపరేట్ చేయడానికి ఎడమ వైపున నూతనమైన స్విచ్‌గేర్ ఉన్నాయి. హీరో గ్లామర్ X తో అండర్‌బోన్ ఛాసిస్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. హీరో గ్లామర్ X లో 124.7cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 10.39 bhp గరిష్ట శక్తిని , 10.4 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కలిగి ఉంటుంది. ఈ భైకును ఆగస్టు 19, 2025న ఆవిష్కరించే అవకాశముంది.





















