అన్వేషించండి

GST Relief: కార్లు, బైక్‌లు చౌకగా - దీపావళి నాటికి దిగిరానున్న వాహన ధరలు!

GST Reforms on Car And Bikes: కేంద్ర ప్రభుత్వం కొత్త GST సంస్కరణలు 2025 కింద చిన్న కార్లు & బైక్‌లపై పన్నును తగ్గించాలని యోచిస్తోంది. దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం?.

Government GST Reforms Relief On Automobiles: భారతదేశంలో కొత్తగా కారు లేదా బైక్‌/స్కూటర్‌ కొనబోయే వాళ్లకు శుభవార్త. ప్రధానమంత్రి మోదీ, స్వాతంత్ర్య దినోత్సవం నాడు కొత్త "GST సంస్కరణలు 2025" ‍‌(GST Reforms 2025) ను ప్రకటించారు. ఈ సంస్కరణలను దీపావళి నాటికి దానిని అమలు చేయడానికి వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడం & సాధారణ వినియోగదారులకు ఉపశమనం కల్పించడం ప్రభుత్వ లక్ష్యం. చిన్న కార్లు & ఎంట్రీ లెవల్ బైక్‌లను కొనుగోలు చేయాలనుకునే ఆటోమొబైల్‌ కంపెనీలకు అతి పెద్ద ప్రయోజనం ఉంటుంది. తద్వారా, కొత్త కస్టమర్లకు కూడా ఆ బెనిఫిట్‌ దక్కుతుంది.

చిన్న కార్లపై పన్ను తగ్గుతుందా?
ఇప్పటివరకు చిన్న కార్లపై 28% GST & 1% నుంచి 3% సెస్సు విధిస్తున్నారు. ఈ పరిధిలో... 1.2 లీటర్ ఇంజిన్ వరకు & 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉన్న కార్లు వస్తాయి. ఆల్టో K10, వ్యాగన్ R, స్విఫ్ట్, బాలెనో, డిజైర్, టాటా టియాగో, టిగోర్, పంచ్, హ్యుందాయ్ i10, i20 & ఎక్స్‌టర్ వంటి కార్లు ఇప్పుడు ఖరీదైనవి కావడానికి ఇదే కారణం. కొత్త సంస్కరణ తర్వాత, వాటిని 28% GST శ్లాబ్‌ నుంచి 18% టాక్స్‌ శ్లాబ్‌లోకి తీసుకురావచ్చు. అంటే రాబోయే కాలంలో ఈ కార్లన్నీ చాలా చౌకగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మిడ్‌ రేంజ్‌ & పెద్ద కార్లపైనా ప్రభావం
1.5 లీటర్ల వరకు ఇంజిన్లు కలిగిన మిడ్-సైజ్ కార్లు & SUVలు ప్రస్తుతం 28% GST శ్లాబ్‌ & 15% సెస్సు పరిధిలో ఉన్నాయి. ఈ కారణంగా అవి దాదాపు 43% పన్ను పరిధిలో ఉన్నాయి. నివేదికల ప్రకారం, వీటిని కూడా కొత్త 40% స్లాబ్ కిందకు తీసుకురావచ్చు. ఇది జరిగితే, మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్, కియా సెల్టోస్, సోనెట్ & హ్యుందాయ్ క్రెటా వంటి ప్రముఖ SUVల ధరలు కూడా 3% వరకు తగ్గుతాయి.

మోటార్ సైకిల్ లేదా స్కూటర్‌ కొనేవాళ్ల మాటేమిటి?
భారత ప్రభుత్వం తీసుకు వస్తున్న GST సంస్కరణలు కారు కొనుగోలుదారులకు మాత్రమే కాకుండా బైక్ కొనుగోలుదారులకు కూడా ఉపశమనం కలిగిస్తాయి. ప్రస్తుతం, 350cc వరకు ఉన్న బైక్‌లపై 28% GST విధిస్తున్నారు, దీనిని 18% శ్లాబ్‌లోకి తగ్గించాలని సర్కారు యోచిస్ోంది. ఈ మార్పు అమల్లోకి వస్తే... హీరో స్ప్లెండర్, హోండా షైన్, బజాజ్ పల్సర్ & TVS రైడర్ వంటి ఎంట్రీ-లెవల్ & కమ్యూటర్ బైక్‌ల రేట్లు భారీగా తగ్గి, చౌకగా మారతాయి. అదే సమయంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ 650cc, KTM & హార్లే డేవిడ్‌సన్ వంటి 350cc కంటే ఎక్కువ ఇంజిన్‌ కెపాసిటీ కలిగిన ప్రీమియం బైక్‌లపై అధిక పన్నులు ఉంటాయి. నూతన పన్ను మార్పులు స్కూటర్లకు వర్తించే అవకాశం కూడా ఉంది.

ఈ మార్పు ఎందుకు అవసరం?
భారతదేశంలో, కార్ల కంటే ద్విచక్ర వాహనాల కొనుగోలుదారుల సంఖ్య చాలా ఎక్కువ. కార్లు కొనేవాళ్లలోనూ మెజారిటీ వర్గం చిన్న కార్ల వైపే మొగ్గు చూపుతోంది. టూవీలర్లు కొనేవాళ్లలో ఎక్కువ మంది ఎంట్రీ లెవల్ బైక్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు, ప్రభుత్వం 350cc వరకు బైక్‌లు & చిన్న కార్లపై పన్నును తగ్గిస్తే, అది వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అదే సమయంలో ఆటోమొబైల్ మార్కెట్‌లో హుషారు, సేల్స్‌ పెరుగుతాయి. అమ్మకాలు పెరగడం వల్ల పన్నుల రూపంలో ప్రభుత్వం పెరుగుతుంది, పన్నులు తగ్గించిన గ్యాప్‌ పూడిపోతుంది. ఫైనల్‌గా, ప్రభుత్వంపై పెద్దగా భారం ఉండదు & అదే సమయంలో ప్రజలకు తక్కువ ధరలకు వాహనాలు అందుబాటులోకి వస్తాయి.

టాప్ హెడ్ లైన్స్

యూత్‌ కోసం కొత్త 4V ఇంజిన్‌తో వచ్చిన Bajaj Pulsar N160.. ఏ వేరియంట్‌ కొనాలి?
కొత్త Bajaj Pulsar N160 లో ఐదు వేరియంట్లు.. మీరు ఏ వేరియంట్‌ కొంటారు?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
Embed widget