Kia First Electric Taxi: ట్రావెల్స్ కోసం కియా మొదటి ఎలక్ట్రిక్ టాక్సీ - సూపర్ లాంగ్ రేంజ్, ఆధునిక టెక్నాలజీ
Kia EV Taxi Launched: కియా, భారతదేశంలో కారెన్స్ క్లావిస్ EVని లాంచ్ చేసింది, దీని ధర రూ. 18-20 లక్షలు. ఈ EV ప్రత్యేకంగా ఫ్లీట్/క్యాబ్ సర్వీసుల కోసం తయారైంది, దీని డ్రైవింగ్ రేంజ్ ఎక్కువ.

Kia First Electric Taxi Carens Clavis Launched: ఇండియన్ కార్ మార్కెట్లో పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి, కియా ఇండియా, కారెన్స్ క్లావిస్ EVని లాంచ్ చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ప్రధానంగా టాక్సీ సర్వీస్, కార్పొరేట్ క్యాబ్‌లు & మొబిలిటీ సర్వీస్‌లు వంటి ఫ్లీట్ కార్యకలాపాల కోసం తీసుకొచ్చింది. కంపెనీ దీనిని రూ. 18 లక్షల నుంచి 20 లక్షల ధరకు అందుబాటులోకి తెచ్చింది.
డిజైన్ ఎలా ఉంది?
Kia Carens Clavis లుక్, డిజైన్ చాలా స్టైలిష్‌గా, ఆధునిక SUV తరహా ఆకర్షణీయంగా ఉంటుంది. ముందు భాగంలో డిజిటల్ టైగర్ ఫేస్, ఐస్‌క్యూబ్ LED హెడ్‌ల్యాంప్స్, కనెక్టెడ్ LED టెయిల్‌లైట్స్‌తో గ్లామరస్‌గా కనిపిస్తుంది. ఇంటీరియర్‌లో డ్యుయల్ 12-ఇంచ్ డిస్‌ప్లేలు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, BOSE సౌండ్ సిస్టమ్ కారణంగా ప్రయాణం చాలా హాయిగా సాగుతుంది. లెవల్ 2 ADAS, 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్లు దీనిని ప్రీమియం క్లాస్ కార్‌గా నిలబెడుతున్నాయి.
ఈ ఎలక్ట్రిక్ కారు కియా సిగ్నేచర్ స్టైల్‌ను ప్రతిబింబిస్తుంది. కారులో కూర్చున్న వ్యక్తులకు తగినంత స్థలం & సౌకర్యం పొందుతారు. ముఖ్యంగా ఫ్లీట్ కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించడం వల్ల, ఈ SUV సులభమైన నిర్వహణ, మెరుగైన బ్యాటరీ రేంజ్ & తక్కువ ఖర్చులో డ్రైవింగ్ వంటివి అందిస్తుంది.
డ్రైవింగ్ రేంజ్
కియా కారెన్స్ క్లావిస్ EV రెండు రేంజ్ ఆప్షన్లను అందిస్తుంది, అవి - ఆధారంగా 404 కి.మీ. & 490 కి.మీ. 42 kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే స్టాండర్డ్ రేంజ్ మోడల్‌ను ఫుల్‌గా ఛార్జ్ చేస్తే 404 కి.మీ.లు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. 51.4 kWh బ్యాటరీతో కూడిన ఎక్స్‌టెండెడ్ రేంజ్ వెర్షన్ 490 కి.మీ.లు ప్రయాణించగలదని పేర్కొంది.
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ మొబిలిటీకి కారెన్స్ క్లావిస్ EV కొత్త మార్గాన్ని చూపుతుందని కియా విశ్వసిస్తోంది. పెట్రోల్ & డీజిల్ ధరలు పెరుగుతున్న టైంలో ఫ్లీట్ ఆపరేటర్లు చౌకైన & పర్యావరణ అనుకూల ఎంపికల కోసం వెతుకుతున్నారు. క్యాబ్/ ట్రావెల్ సేవలు అందించే కంపెనీలు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాంతాలను కవర్ చేయడానికి ఈ కారు ఉపయోగపడుతుంది. సాంప్రదాయ ఇంధనంతో నడుస్తున్న కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు నిర్వహించడం సులభం & చవకగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. అందుకే కారెన్స్ క్లావిస్ EV ఫ్లీట్ ఆపరేటర్ల ఆదరణ పొందవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ కారు ఫ్యామిలీకి కూడా చక్కగా సరిపోతుంది, అన్ని ఆధునిక ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.
కియా వ్యూహం ఇదే
కియా కార్లు ఇప్పటికే భారత మార్కెట్లో ఉనికిని చాటుకున్నాయి, ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు, కంపెనీ EV విభాగంలోనూ పట్టు బిగించాలనుకుంటోంది. కారెన్స్ క్లావిస్ EV ద్వారా, కియా, వ్యక్తిగత కార్ల మార్కెట్‌ను మాత్రమే కాకుండా కమర్షియల్ & ఫ్లీట్ మార్కెట్‌ను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నట్లు అర్ధమవుతోంది. క్రమంగా, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు బలంగా మారుతున్నందున, ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణలో వేగం పెరుగుతుంది.





















