Helicopter Crash: ధ్రువ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్, తృటిలో తప్పిన ప్రమాదం
Helicopter Crash: కొచ్చిలో ధ్రువ్ హెలికాప్టర్‌ను టెస్ట్ చేస్తుండగా కంట్రోల్ తప్పి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
Helicopter Crash:
ఈ మధ్య కాలంలో తరచూ ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ప్రమాదానికి గురవుతున్నాయి. ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్‌లో చీతా హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్‌లు మృతి చెందారు. ఇప్పుడు మరో ప్రమాదం జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన ALH Dhruv Mark 3 హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. కేరళలోని కొచ్చిలో చాపర్‌ను పరీక్షించిన తరవాత ల్యాండింగ్ చేసే సమయంలో ఉన్నట్టుండి కంట్రోల్ తప్పి పడిపోయింది. 25 అడుగుల ఎత్తులో ఉండగా ఉన్నట్టుండి ల్యాండ్ అయింది. ప్రస్తుతం కోస్ట్ గార్డ్ సిబ్బంది అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. ఉన్నట్టుండి పవర్ లాస్ అవడం వల్ల తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మార్చి 8న ALH Dhruv హెలికాప్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇటీవలే ముంబయిలోనూ ఇదే హెలికాప్టర్‌ను టెక్నికల్ ఫెయిల్యూర్ కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఇలా తరచూ ప్రమాదానికి గురవుతున్న నేపథ్యంలోనే...ధ్రువ్ హెలికాప్టర్లను వినియోగించకుండా బ్యాన్ విధించే యోచనలో ఉంది ఇండియన్ కోస్ట్ గార్డ్. అప్పటి నుంచి ముందు జాగ్రత్త చర్యలుగా ఆ హెలికాప్టర్లను వాడడం లేదు. ఈలోగా మరో ప్రమాదం తప్పింది. అయితే...ఇవి ఎందుకిలా క్రాష్ అవుతున్నాయో నిర్ధరించలేకపోతున్నారు. విచారణ మాత్రం కొనసాగుతోంది. అప్పటి వరకూ బ్యాన్ కొనసాగనుంది. ఈ హెలికాప్టర్లను HAL తయారు చేసింది. ఆర్మీ,నేవీ, ఎయిర్ ఫోర్స్‌లలో వీటిని వినియోగిస్తూ వస్తున్నారు.
An incident of forced landing of an ALH Dhruv Mark 3 helicopter of the Indian Coast Guard today took place in Kochi while the pilots of the force were testing the chopper. The chopper was at around 25 feet height when it had to make a forced landing. The ICG is working towards… pic.twitter.com/p8UW1WLjKA
— ANI (@ANI) March 26, 2023
#WATCH | Kerala: An ALH Dhruv Mark 3 helicopter of the Indian Coast Guard met with an accident near main runway at Kochi Airport today. All crew are safe. The aircraft sustained damage to its rotors & airframe. ICG has ordered an inquiry to investigate the cause of the accident. pic.twitter.com/OjysEoU1nq
— ANI (@ANI) March 26, 2023