Heeraben Modi Health: 'మోదీజీ, మా ప్రేమ, మద్దతు మీకు తోడుగా ఉంటాయ్'- రాహుల్ గాంధీ ట్వీట్
Heeraben Modi Health: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
![Heeraben Modi Health: 'మోదీజీ, మా ప్రేమ, మద్దతు మీకు తోడుగా ఉంటాయ్'- రాహుల్ గాంధీ ట్వీట్ Heeraben Modi Health Rahul Gandhi, Other Leaders Wish Speedy Recovery For PM's Mother Heeraben Modi Health: 'మోదీజీ, మా ప్రేమ, మద్దతు మీకు తోడుగా ఉంటాయ్'- రాహుల్ గాంధీ ట్వీట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/28/001d095bd24e2b8a27b58dadac875f291672220480228626_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Heeraben Modi Health: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. ఈ మేరకు బుధవారం ఓ ట్వీట్ చేశారు. ఆరోగ్యం బాలేకపోవడంతో అహ్మదాబాద్‌లో యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో హీరాబెన్ చికిత్స తీసుకుంటున్నారు.
एक मां और बेटे के बीच का प्यार अनन्त और अनमोल होता है।
— Rahul Gandhi (@RahulGandhi) December 28, 2022
मोदी जी, इस कठिन समय में मेरा प्यार और समर्थन आपके साथ है। मैं आशा करता हूं आपकी माताजी जल्द से जल्द स्वस्थ हो जाएं।
ప్రియాంక గాంధీ
ప్రియాంక గాంధీ కూడా ఈ మేరకు ట్వీట్ చేశారు. మోదీ తల్లి త్వరగా కోలుకోవాలని ఆమె ప్రార్థించారు.
प्रधानमंत्री श्री @narendramodi जी की माता जी के अस्वस्थ होने का समाचार प्राप्त हुआ। इस घड़ी में हम सब उनके साथ हैं।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 28, 2022
मैं ईश्वर से प्रार्थना करती हूं कि उन्हें जल्द स्वास्थ्य लाभ मिले।
వీరితో పాటు పలువురు కేంద్రమంత్రులు, భాజపా నేతలు కూడా హీరాబెన్ మోదీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో సహా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకులు ఆమె పరిస్థితి గురించి ఆరా తీయడానికి ఆసుపత్రికి చేరుకున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
మోదీ
ప్రస్తుతం హీరాబెన్ మోదీ.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆసుపత్రిలో చేరిన తల్లిని పరామర్శించేందుకు ప్రధాని మోదీ కూడా అహ్మదాబాద్ చేరుకున్నారు.
Also Read: Kerala Crime News: కేరళలో దారుణం- బాలికను గొంతుకోసి చంపిన యువకుడు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)