Haryana Crime: భార్య కాదు యమదూత - ప్రియుడితో జల్సా వీడియో పంపిన భార్య - భర్త ఆత్మహత్య ! వీడియో
Wife: భర్తలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న భార్యల వ్యవహారాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడితో జల్సా చేస్తున్న వీడియోను భార్య పంపడంతో ఓ భర్త ప్రాణాలుతీసుకున్నాడు.

Haryana Wife Sensual Dance Video With Lover: భర్తలను నేరుగా చంపే భార్యలు ఓ రకం అయితే.. మానసికంగా హింసించి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేలా చేసే భార్యలు మరో రకం. ఇలాంటి వాళ్లు కూడా బయటకు వస్తున్నారు. ఓ భార్య .. తన ప్రియుడితో కలిసి హోటల్ లో అన్నీ పనులు చేసేసుకుంటున్న వీడియోలను తీసి భర్తకు పంపింది. వాటిని చూసి ఆయన ఇక బతుకు దండగ అని ప్రాణాలు తీసుకున్నాడు.
మాగన్ అలియాస్ అజయ్, హర్యానాలోని రోహ్‌టక్ జిల్లాలోని డోభ్ గ్రామానికి చెందిన వ్యక్తి, జూన్ 18, 2025న ఒక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరణానికి ముందు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు, ఇందులో తన భార్య దివ్యా , ఆమె ప్రియుడు దీపక్ తన ఆత్మహత్యకు కారణం అని చెప్పాడు. దీపక్ మహారాష్ట్రలోని సంభాజీనగర్‌లో పోలీసు అధికారి గా పని చేస్తున్నారు. ఇద్దరూ కలిసి తనను మానసికంగా హింసించారని.. దివ్యాకు దీపక్‌తో వివాహేతర బంధం పెట్టుకుని మానసికంగా హింసించారు, డబ్బు డిమాండ్ చేశారన్నారు.
A man in Rohtak, Haryana, died by suicide after allegedly being harassed by his wife and her lover. He claimed in a video that his wife pressured him to murder his father and sell ancestral land for her partner's promotion. pic.twitter.com/OdkBtm3tML
— Team SCB⚔️ #Citizen_Media🏹भारतपुत्र👣 (@1SanatanSatya) June 24, 2025
ఆస్తులు అమ్మి డబ్బులివ్వాలని వేధించాలన్నారు. దివ్యా తన ప్రేమికుడు దీపక్‌తో కలిసి ఒక అసభ్యకర వీడియోను అతనికి పంపింది, ఇది అతన్ని తీవ్ర డిప్రెషన్‌లోకి నెట్టివేసింది. ఈ వీడియోలో దివ్యా డాన్స్ చేస్తూ, దీపక్ రికార్డ్ చేస్తూ అసభ్యకరంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించారు. దీపక్ తన ఉద్యోగ పదోన్నతి కోసం 5 లక్షలు అవసరమని, ఇందుకోసం మాగన్‌ను ఒత్తిడి చేశాడని ఆరోపణ. మాగన్ ఇప్పటికే మూడున్నర లక్షలు ఇచ్చాడు. మిగతా లక్షన్నర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Magan alias Ajay from Dobh village, Haryana, was found hanging from a tree after posting a heart-wrenching video online on June 18. In his final message, he blamed his wife Divya and her alleged lover, police officer Deepak from Maharashtra, for mental har@ssment.
— LocalTak™ (@localtak) June 24, 2025
The video… pic.twitter.com/WyHC0CmlRv
దివ్యా , దీపక్ ముంబైలో ఫ్లాట్ కొనుగోలు చేయడానికి మాగన్‌ను తన తండ్రిని చంపి, పూర్వీకు భూమిని అమ్మమని ఒత్తిడి చేశారని వీడడియోలో ఆరోపించాడు. దివ్యా తన మొదటి భర్తను చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండానే తనను వివాహం చేసుకుంది. ఈ విషయం అతనికి వివాహం తర్వాత ఒకటిన్నర సంవత్సరాల తర్వాత తెలిసిందియమార్చి 20, 2025న దివ్యా ఉద్యోగం కోసం వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి వెళ్లిపోయింది మరియు తిరిగి రాలేదు. ఆమె మహారాష్ట్రలోని ఇగత్‌పురిలో దీపక్‌తో ఉన్నట్లు తర్వాత తెలిసింది. మగవారి రక్షణకు కూడా చట్టాలు తీసుకురండి అని మాగన్ అలియాస్ అజయ్ వీడియోలో కోరారు.





















