Russia Ukraine War: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో దాడిలో హ్యారీ పాటర్ కోట ధ్వంసం, వీడియో వైరల్
Russia Ukraine War: రష్యా దాడిలో ఉక్రెయిన్‌లోని హ్యారీ పాటర్ భవనం ధ్వంసమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Russia Ukraine War News: రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ దాడుల్లో రెండు దేశాలకు చెందిన ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లోని ఒడెసాలో Harry Potter castle పై రష్యా మిజైల్స్ దాడి చేశాయి. ఈ దాడిలో భవనం ధ్వంసమైపోయింది. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. The Independent న్యూస్ పోర్టల్ ఈ విషయం వెల్లడించింది. Gothic style లో నిర్మించిన ఈ బిల్డింగ్ ప్రస్తుతం ప్రైవేట్ లా ఇన్‌స్టిట్యూట్‌గా ఉంది. ఈ మిజైల్ అటాక్‌లో భవనానికి మంటలు అంటుకున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒడెసా సిటీపై మరి కొన్ని చోట్ల కూడా రష్యా దాడులు చేసింది. బాంబులు,డ్రోన్‌లతో దాడులు చేసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ దాడిలో ఐదుగురు మృతి చెందగా...32 మంది గాయపడ్డారు. గాయపడ్డ వాళ్లలో ఓ గర్భిణితో పాటు నాలుగేళ్ల చిన్నారి కూడా ఉంది. ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితీ విషమంగా ఉంది. స్థానిక గవర్నర్ వెల్లడించిన వివరాల ప్రకారం...రష్యాకి చెందిన Iskander-M బాలిస్టిక్ మిజైల్‌ని ఈ దాడిలో ఉపయోగించారు. అయితే...ఈ దాడిపై రష్యా ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీనిపై ఉక్రెయిన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
The Harry Potter castle in Odessa was recently on fire. Another Phoenix connection? The Phoenix phenomenon stands for the flapping bird plasma effect when the Thunder Dome is started up - which ushers in the Antichrist period as described here: https://t.co/k8OW1Ek7my
— Martin Vrijland (@MartinVrijland) May 1, 2024
and here… pic.twitter.com/YDqNk7hsjb
ఈ దాడుల్లో హ్యారీ పాటర్ కోటతో పాటు దాదాపు 20 భవనాలు ధ్వంసమైనట్టు స్థానిక మీడియా వెల్లడించింది. మరి కొన్ని కీలక భవనాలపైనా దాడి జరిగినట్టు తెలిపింది. వీటికి సంబంధించిన కొన్ని వీడియోలను ఉక్రెయిన్ మీడియా విడుదల చేసింది. హ్యారీ పాటర్ సిరీస్‌లో ఉన్న కోటను పోలిన లా ఇన్‌స్టిట్యూట్ అంటే స్థానికులకు చాలా ఇష్టం. టూరిస్ట్ స్పాట్‌గానూ మారిందీ కోట. అలాంటి భవనంపై దాడి చేయడం అలజడి రేపింది. తమ పౌరులను చంపడమే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోందని ఉక్రెయిన్ మండి పడుతోంది. అటు రష్యా మాత్రం క్రిమియాలో ఉక్రెయిన్ మిజైల్ దాడులు చేస్తోందని, వాటిని అడ్డుకున్నామని ఆరోపిస్తోంది. మొత్తంగా చూస్తే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా తగ్గడం లేదని మాత్రం అర్థమవుతోంది. ఉక్రెయిన్‌పై దాడుల వల్ల లక్షలాది మంది పౌరులు వలస వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓ 98 ఏళ్ల వృద్ధురాలు రష్యా అధీనంలో ఉన్న ప్రాంతం నుంచి ఉక్రెయిన్ అధీనంలోని ఏరియా వరకూ 10 కిలోమీటర్ల వరకూ నడుచుకుంటూ వెళ్లింది. చేతి కర్ర సాయంతో మధ్య మధ్యలో ఆగుతూ, రోడ్డుపైనే విశ్రాంతి తీసుకుంటూ ప్రయాణించింది.
Also Read: Fact Check: కొవిషీల్డ్ వ్యాక్సిన్‌తో రక్తం గడ్డకట్టుకుపోతుందా? ఈ ప్రచారంలో నిజమెంత?