Hair transplant Side Effect: జుట్టు కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు, సర్జరీ చేయించుకునే ముందు కాస్త జాగ్రత్త
Hair transplant Side Effect: ఢిల్లీకి చెందిన ఓ యువకుడు హెయిర్ ట్రాన్స్‌ప్లంటేషన్ వికటించి మృతి చెందాడు.
Hair Transplant Side Effect:
వైద్యుల నిర్లక్ష్యం..
ఈ తరం యువతను ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో జుట్టు రాలిపోవడం ఒకటి. ముప్పై ఏళ్లు దాటగానే...చాలా మందికి బట్టతల వచ్చేస్తోంది. అమ్మాయిలకూ హెయిర్ ఫాల్ మొదలవుతోంది. దీన్ని చాలా పెద్ద సమస్యగా ఫీల్ అయిపోయి చాలా మంది టెన్షన్ పడుతుంటారు. ఏవేవో ఆయిల్స్ వాడతారు. అవేవీ పనిచేయకపోతే...హెయిర్ ట్రాన్స్‌ప్లెంటేషన్ (Hair Transplantation)చేయించుకుంటారు. ఇది అన్ని సార్లు సక్సెస్ అవుతుందని చెప్పలేం. కొన్ని సార్లు ఇదే ప్రాణాల మీదకూ తెస్తుంది. ఢిల్లీలో ఓ యువకుడికి ఇదే జరిగింది. జుట్టు కచ్చితంగా వస్తుందన్న నమ్మకంతో సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే...ఆ ఆపరేషన్‌ను తట్టుకోలేక ప్రాణాలొదిలాడు. 30 ఏళ్ల అతర్ రషీద్...హెయిర్ ట్రాన్స్‌ప్లంటేషన్ కోసం ఢిల్లీలోని ఓ క్లినిక్ వెళ్లాడు. అక్కడి సిబ్బంది నిర్లక్ష్య కారణంగా మృతి చెందాడు. అమ్మ, ఇద్దరి చెల్లెళ్లకు ఈ యువకుడే ఆధారం. ఈ ముగ్గురూ ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఆ క్లినిక్‌పై ఫిర్యాదు చేయగా...పోలీసులు ఈ ఘటనతో
సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేశారు. ట్రీట్‌మెంట్ పూర్తయ్యాక ఒళ్లంతా దద్దులొచ్చాయని, కిడ్నీలు పని చేయకుండా పోయాయని మృతుడి తల్లి వెల్లడించింది. క్రమక్రమంగా ఒక్కో అవయవం పని చేయలేదని చెప్పింది. హెయిర్ ట్రాన్స్‌ప్లంట్ చేయించుకుంటూ మృతి చెందిన ఘటన ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటివెన్నో జరిగాయి.
గతేడాది సెప్టెంబర్‌లోనూ గుజరాత్‌కు చెందిన ఓ యువకుడు ఇలానే మృతి చెందాడు. అంతకు ముందు 2019లో ముంబయికి చెందిన ఓ బిజినెస్‌మేన్ హెయిర్ ట్రాన్స్‌ప్లంటేషన్ చేయించుకున్న రెండ్రోజులకే ప్రాణాలు కోల్పోయాడు. ఎందుకిలా జరుగుతోంది..? ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఈ సర్జరీలు చేస్తున్నారు...?
ఇవీ కారణాలు..
నిజానికి..ఇది ప్రాణాలు తీసేంత సర్జరీ అయితే కాదు. కానీ..ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాపాయం తప్పదు. చాలా క్లినిక్స్‌లో చేసే తప్పు లోకల్ అనస్థీషియాకు బదులుగా జనరల్ అనస్థీషియా ఇవ్వడం. ఇది తప్పకుండా ప్రాణాపాయాన్ని పెంచేస్తుంది. చాలా సున్నితమైన ప్రదేశం కనుక...కాస్త అటుఇటుగా అయినా వెంటనే ఆ ప్రభావం తీవ్రంగా పడుతుంది. ఇక మరో కారణం...ఒకేసారి ఎక్కువ మొత్తంలో జుట్టుని ట్రాన్స్‌ప్లాంట్ చేయడం. ఒక్కసారి 3000 వెంట్రుకలు ట్రాన్స్‌ప్లాంట్ చేయడం సురక్షితం. కానీ...అంతకు మించి చేయడం...ప్రాణాల మీదకు తెస్తోంది. ముంబయిలో బిజినెస్‌మేన్ చనిపోయింది ఇందుకే. ఒకేసారి 9 వేల వెంట్రుకలు ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ఇది వికటించి మృతి చెందాడు. వైద్యులు నిపుణులా కాదా అని సరి చూసుకోవడం మన బాధ్యతే. తక్కువ ఖర్చులో అయిపోతుందని ఎక్కడ పడితే అక్కడ ట్రాన్స్‌ప్లంటేషన్ చేయించుకుంటే...ఇలాంటి దుష్పరిణామాలు తప్పవు. చాలా మంది ఈ తప్పులే చేస్తున్నారు. తెలిసిన వాళ్లే అని ధైర్యంతోనో, ఎక్కువ ఖర్చు పెట్టలేం కానీ జుట్టు వచ్చేయాలన్న ఆరాటంలోనో చిన్న చిన్న క్లినిక్స్‌కు వెళ్లిపోతున్నారు. అక్కడి వైద్యులు క్వాలిఫైడ్ అవునా కాదా అన్నదీ సరిగా పట్టించుకోవడం లేదు.
Also Read: Baba Vanga: భయం గొలుపుతున్న బాబా వంగా ప్రిడిక్షన్స్ - 2023లో ఇన్ని అనర్థాలా?