Goa Crime: గోవాలోని రిసార్ట్‌లో దారుణం, కత్తులతో దాడి చేసిన దుండగులు - విచారణకు సీఎం ఆదేశాలు
Goa Crime: గోవాలోని ఓ రిసార్ట్‌లో ఢిల్లీకి చెందిన కుటుంబంపై దుండగులు కత్తులతో దాడి చేశారు.
Goa Crime:
అంజున బీచ్‌కు సమీపంలో..
ఢిల్లీ నుంచి గోవాకు వచ్చిన ఓ ఫ్యామిలీపై దుండగులు కత్తులతో దాడి చేయడం కలకలం రేపింది. అంజున బీచ్‌లో ఈ దాడి జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. బీచ్‌కు దగ్గర్లోని ఓ రిసార్ట్‌లో ఆ కుటుంబం ఉంటోందని చెప్పారు. మొదట కొందరు వ్యక్తులు వచ్చి వారిని బెదిరించారు. ఆ తరవాత ఉన్నట్టుండి కత్తులతో దాడి చేశారు. ఈ కుటుంబంలోని ఓ సభ్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దాడి జరిగిన వెంటనే రిసార్ట్ సిబ్బంది, యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆ తరవాత పోలీసులు రంగంలోకి దిగారు. ముగ్గురు, నలుగురు దుండగులు వచ్చి దాడి చేసినట్టు బాధితులు చెప్పారు. అలెర్ట్ అయిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే...అరెస్ట్ చేసిన కాసేపటికే వాళ్లను విడుదల చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్విటర్ వేదికగా హామీ ఇచ్చారు.
"ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదేశించాను. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశాను. కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాం"
- ప్రమోద్ సావంత్, గోవా ముఖ్యమంత్రి
అయితే...దాడి జరుగుతున్నప్పుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఓ మహిళ సాయం కోసం గట్టిగా అరుస్తుండగా ముగ్గురు, నలుగురు దుండగులు వచ్చి వాళ్లపై దాడి చేశారు. రిసార్ట్‌లో పని చేసే వాళ్లతో వాగ్వాదం అయిందని, బహుశా వాళ్లపై దాడి చేయడానికి ఇదే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
Today’s violent incident in Anjuna is shocking and intolerable. I have directed the Police to take the harshest action against the perpetrators. Such anti-social elements are a threat to the peace and safety of the people in the State, and will be dealt with strictly.
— Dr. Pramod Sawant (@DrPramodPSawant) March 12, 2023
గోవా అడవుల్లో మంటలు
గోవా అడవుల్లో మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దాదాపు వారం రోజులుగా కార్చిచ్చు చల్లారడం లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. మంటలు చల్లార్చేందుకు హెలికాప్టర్ల ద్వారా భారీ మొత్తంలో నీళ్లు చల్లుతోంది. IAF Mi-17 హెలికాప్టర్‌తో ప్రభావిత ప్రాంతాల్లో 25 వేల లీటర్ల మేర నీరు చల్లింది. ఇప్పటికే 47,000 లీటర్ల నీళ్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినట్టు వివరించింది IAF.కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఇదే విషయాన్ని వెల్లడించారు. ట్విటర్లో IAF వీడియో షేర్ చేశారు.
"ప్రధాని మోదీ సహకారంతో IAF హెలికాప్టర్లు మంటలు చల్లార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అడవిని రక్షించుకునేందుకు వీళ్లు చేస్తున్న ప్రయత్నం మరిచిపోలేనిది"
- భూపేంద్ర యాదవ్, కేంద్ర అటవీశాఖ మంత్రి
Augmenting its firefighting effort near #Goa with Mi-17 helicopters on 11 Mar 23, the #IAF dispensed over 25000 ltrs of water over the affected areas.
— Indian Air Force (@IAF_MCC) March 12, 2023
Thus far, 47000 litres of water have been dispensed by the #IAF, over the afflicted area.
Aapatsu Mitram pic.twitter.com/Zr8eWQ6cAl
Also Read: రైతుల ఆత్మహత్యలు కొత్తేమీ కాదు, ఏటా జరుగుతూనే ఉంటాయ్ - మహారాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు