By: ABP Desam | Updated at : 06 Apr 2023 04:20 PM (IST)
Edited By: jyothi
ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు - జీఐ ట్యాగ్ సంస్థ వెల్లడి
Atreyapuram Pootharekulu: నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే పూతరేకులకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆత్రేయపురం పూతరేకులకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భౌగోళిక గుర్తింపు లభించింది. జీఐ ట్యాగ్ సంస్థ ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు ఇస్తూ ప్రకటన చేసింది. ఈ వార్త తెలుసుకున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు వందల చరిత్ర కలిగిన ఆత్రేయపురం పూతరేకులకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది.
పూతరేకులు చాలా ప్రాంతాల్లో లభ్యం అవుతున్నప్పటికీ ఆత్రేయపురం పూతరేకులు అంటే జనాలు మరింత ఆసక్తి చూపిస్తుంటారు. కొనడానికి, తినడానికి ఎంత దూరం అయినా వస్తుంటారు. ఇక్కడ తయారైన పూతరేకులకు చాలా డిమాండ్ ఉండగా.. నోట్లో వేసుకోగానే కరిగిపోవడంతో పాటు అదిరిపోయే టేస్ట్ కలిగిన విభిన్న రకాల పూతరేకులు కేవలం ఆత్రేయపురంలోనే దొరుకుతాయి. రుచి, శుచి, ప్రత్యేకత ఇక్కడి సొంతం. అందుకే ఆత్రేయపురం పూతరేకులకు అంతటి డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించడంతో ఆత్రేయపురం పూతరేకుల మరో ఘనత సాధించినట్లు అయింది.
ఏపీలో 19వ ప్రఖ్యాతి ప్రొడక్ట్స్ గా ఖ్యాతి..
ఆంధ్రప్రదేశ్‌కు సంబందించి ఇప్పటి వరకు కేవలం 18 ప్రాంతాల్లో చారిత్రక నేపథ్యం ఉన్న వాటికే జియోలాజికల్ ఇండికేషన్స్‌లో చోటు లభించాయి. వాటిలో కొండపల్లి బొమ్మలు, తిరుపతి లడ్డూ, ఉప్పాడ జిందానీ చీరలు, బందరు లడ్డూ ఇలా కొన్ని ప్రాముఖ్యమైనవి ఉండగా తాజాగా ఆత్రేయపురం పూతరేకులు ఈ జాబితాలో చేరాయి. మరో నాలుగు నెలల్లో గెజిట్ విడుదల చేస్తుందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా వెల్లడించారు. దామోదర్ సంజీవయ్య న్యాయ విశ్వ విద్యాలయానికి చెందిన మాకిరెడ్డి మనోజ్, ఆత్రేయపురం పూతరేకుల సంఘ నాయకులు కలిసి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి భౌగోళిక జనరల్‌ను అందించారు.
విభిన్న రకాల పూతరేకులకు కేరాఫ్ అడ్రస్..
రాజమండ్రి నుంచి కేవలం 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఆత్రేయపురం పూతరేకులకు చాలా ప్రత్యేకత ఉంది. ఆత్రేయపురంలో 400 ఏళ్ల నుంచి పూతరేకులు తయారు అవుతున్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఇక్కడి పూర్వీకులు పూతరేకుల తయారీను వృత్తిగా చేసుకున్నట్లు కూడా స్థానికులు చెబుతారు. ప్రస్తుతం ఆత్రేయపురంలో సుమారు 300 వరకు దుకాణాలు ఉండగా ఇళ్ల వద్దనే ఉండి తయారు చేసే వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడి ఇంటింటా పూతరేకులు తయారు చేసే మహిళలు ఉండడం గమనార్హం. విభిన్న రకాల పూతరేకుల తయారీకీ కూగా ఆత్రేయపురం తన ప్రత్యేకతను చాటుకుంది.
పంచదార, బెల్లం, నేతితో తయారైన పూతరేకులతో పాటు డ్రైఫ్రూట్స్, చాక్లెట్, షుగర్ ఫ్రీ, ఇంకా పలు రకాల ఫ్లేవర్లతో పూతరేకులను ఇక్కడ తయారు చేస్తున్నారు. దేశ విదేశాలకు ఆత్రేయపురం నుంచి పూతరేకులు వెళ్తున్నాయి. ఆర్డర్ల ఇచ్చి మరీ చాలా మంది ఇక్కడి నుంచి పూతరేకులను తెప్పించుకొని తింటారు. హైదరాబాద్, బెంగళూర్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కూడా ఆత్రేయపురం పూతరేకులను ప్రత్యేకంగా అమ్ముతుంటారు. చాలా స్వీట్స్ దుకాణాల్లో కూడా ఆత్రేయపురం పూత రేకులు దొరుకుతాయంటేనే వాటికి ఉన్న క్రేజ్ అర్థం అవుతోంది.
Weather Latest Update: 48 గంటల్లో కేరళలోకి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే?
ABP Desam Top 10, 8 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!
తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!
TS PGECET: జూన్ 8న తెలంగాణ పీజీఈసెట్ ఫలితాల వెల్లడి, రిజల్ట్ టైమ్ ఇదే!
YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి
Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!
Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!
10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!